Showing posts with label మనస్థత్వం. Show all posts
Showing posts with label మనస్థత్వం. Show all posts

Monday, August 1, 2016

ప్రకృతిలో మొలచినది తల్లి హృదయత్వం

ప్రకృతిలో మొలచినది తల్లి హృదయత్వం
విశ్వమంతా అవతరించినది తల్లి మనస్థత్వం
జగమంతా వ్యాపించినది తల్లి స్వభావ తత్వం  || ప్రకృతిలో ||

ప్రేమామృతమే పంచి ప్రకృతికే మైమరిపించినది
భావామృతమే ఇచ్చి విశ్వాన్ని తిలకింపజేసినది
దైవత్వమే పరచి తన ధర్మాన్ని జగానికి చాటింపజేసింది

తనలోనే తాను జీవిస్తూ తన ప్రతి రూపాన్నే సృష్టిస్తున్నది
తనలోనే తాను ఎదుగుతూ తన స్వభావాన్నే పంచిస్తున్నది
తనలోనే తానూ ఒదుగుతూ తన తత్వాన్నే చూపుతున్నది     || ప్రకృతిలో ||

తల్లిగా జీవించే ప్రతి అమ్మలో దైవమే దాగి ఉన్నది
తల్లిగా లాలించే ప్రతి అమ్మలో భావమే నిండి ఉన్నది
తల్లిగా పోషించే ప్రతి అమ్మలో వేదమే ఒదిగి ఉన్నది

ప్రకృతికే పరమాత్మగా పరమార్థమై ఉన్నది
విశ్వానికే వినయంగా వివేకంతో తెలిపినది
జగతికే విధేయతగా విశాలమై నిలిచింది     || ప్రకృతిలో ||