Showing posts with label సంగతి. Show all posts
Showing posts with label సంగతి. Show all posts

Friday, September 9, 2016

ఎవరికి ఎవరు ఏమని తెలిపారు

ఎవరికి ఎవరు ఏమని తెలిపారు
ఎవరికి ఎవరు ఏదని ఇచ్చెదరు
ఎవరికి ఎవరు ఏమి కారని తెలిపేదెవరు
ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు
ఒకరితో ఒకరు స్నేహం అన్నారు
ఒకరికి ఒకరై బంధం అంటున్నారు

ఇదే మా సంగతి అంటూ ఇంతే మన సంస్కృతి అని చెప్పెదరు || ఎవరికి ఎవరు ||

తెలిసినదేదైనా ఆలోచిస్తారు
తెలియనిదేదైనా విచారిస్తారు
తెలుసుకునేదాక అన్వేషిస్తారు

కొత్తది ఏదైనా పరిశోధిస్తారు
వచ్చినదేదైనా పరిశీలిస్తారు
వచ్చేదేదైనా పర్యవేక్షిస్తారు  || ఎవరికి ఎవరు ||

ఎవరు వచ్చినా పలికించేస్తారు
ఎవరికి ఏమైనా తడబడిపోతారు
ఎవరిని ప్రశ్నించినా బదులిస్తారు

అందరితో కలిసే ఉంటారు
అందరికి తోడుగా ఉన్నారు
అందరిలా ఒకటిగా వస్తారు

ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఒకటిగా వెళ్తారు
ఎక్కడైనా ఉండాలనుకున్నా ఒకటిగా ఉంటారు
ఎక్కడికో పోవాలనుకున్నా ఒకటిగా పోతారు       || ఎవరికి ఎవరు ||