Tuesday, April 12, 2016

ఊపిరితో ఉన్నావా ఊహలతో జీవిస్తున్నావా

ఊపిరితో ఉన్నావా ఊహలతో జీవిస్తున్నావా
శ్వాసతో ఉంటూనే ఊహలలో తేలిపోయావా
హృదయంలో దాగి ఉంటూనే మేధస్సులో ఆలోచిస్తూ ఉన్నావా || ఊపిరితో ||

ఊపిరి నాదైతే జీవం విశ్వానిదే కదా
ఊపిరి నా దేహానికైతే శ్వాస ఆత్మకే కదా

నిరంతరం ఉచ్చ్వాస నిచ్చ్వాస లతో సాగే శరీరం అలసిపోతున్నది
నిరంతరం శ్వాసతో ఆడే హృదయం అనారోగ్యంతో అలసిసొలసినది

వృద్ద్యాపంలో జీవ శ్వాస శరీరాన్ని కవలిస్తున్నది
మరణంతో ఊపిరి దేహాన్ని వదిలించుకుంటున్నది || ఊపిరితో ||

యోగం ధ్యానం చేసినా ఊపిరి సాగేందుకే ప్రయత్నం చేస్తున్నది
భోగం భాగ్యం ఉన్నా ఊపిరి సాగుతూనే ఏదేదో ఆలోచిస్తున్నది

కాలంతో స్నేహం చేసినా దేహాన్ని సాగించే శక్తి ఊపిరికే లేదన్నది
విశ్వంతో బంధం చేసినా ప్రకృతిలో నిలిచే సామర్థ్యం శ్వాసకే లేదన్నది

ఊహలతో సాగే ఊపిరిగా జగతిలోనే నిలిచి పోవాలని
శ్వాసతో ఆగే ఊపిరిగా ఊహకే మరణం లేదని సాగేనని  || ఊపిరితో ||

Thursday, April 7, 2016

ఊపిరివై నీవు నీలోనే జీవిస్తున్నావు

ఊపిరివై నీవు నీలోనే జీవిస్తున్నావు
శ్వాసగా నీవు నీలోనే ఉంటున్నావు
ఉచ్చ్వాస నిచ్చ్వాసలతో శ్వాసగా ఊపిరివైనావు || ఊపిరి ||

ఎదిగే జీవమై శ్వాసలో నిలయమై దేహాన్ని నిలిపావు
ఒదిగే స్వరమై ఉచ్చ్వాస నిచ్చ్వాసలతో ప్రాణమైనావు

నీ శ్వాసతో హృదయమే శరీరానికి చలనాన్ని కలిగించేను
నీ ఆయువుతో మేధస్సే ఆలోచనకు భావాన్ని వెలికించేను
 
గాలిగా నీవు జీవిస్తున్నా దేహంలో ఎన్నో కార్యాలను కొనసాగిస్తున్నావు
శ్వాసగా నీవు ప్రయాణిస్తున్నా ఎన్నో కార్యాలతో జీవితాన్ని సాగిస్తున్నావు || ఊపిరి ||

నీవు ఉంటేనే జీవులకు ఆయుస్సు జీవితాలకు ప్రయోజనము
నీవు ఆడుతుంటే జీవులకు ఊరట హృదయానికి ప్రతిస్పందన  

ఊపిరి ఉన్నంతవరకే జీవనం మేధస్సుతో సాగిపోయేను
శ్వాస ఆడెంతవరకే జీవితం కార్యాలతో జరిగిపోయేను

ఊపిరిలోనే జీవం శ్వాసలోనే ఆత్మ బంధం శరీరానికే సొంతం
దేహంలోనే ఆత్మ శ్వాసపైనే ధ్యాస ధ్యానంతోనే ఊపిరి ఉత్తేజం || ఊపిరి ||

Wednesday, April 6, 2016

నువ్వే నేనని నాలో నీవేనని

నువ్వే నేనని నాలో నీవేనని
నేనే నీవని నీలో నేనున్నానని
నీకై నేనే నీవై నాలోనే నీవున్నావని
నాకై నీవే నేనై నీలోనే నేనున్నాని || నువ్వే ||

నేనుగా నాలో నేనే లేనని నీవే ఉన్నావని
నీలో నీవై నీవుగా లేవని నేనే ఉన్నానని
నేనే నీవై పోయానని నీలోనే ఉంటున్నానని
నీవే నేనై పోయానని నాలోనే ఉంటున్నావని
నీలోనే నేను నాలోనే నీవు కలిసే ఉన్నామని
నీతోనే నేను నాతోనే నీవు మనలో మనమే ఉంటున్నామని || నువ్వే ||

నీవే నేనుగా నాలోన నీవే ఉన్నావని
నేనే నీవుగా నీలోనే నేనే ఉన్నానని
నీవే నాలో లేవని నేనే నీలో ఉంటున్నానని
నేనే నీలో లేనని నీవే నాలో ఉంటున్నావని
నీతో నేను నీవుగా ఉండాలని నేనే నీవై యదలో ఉన్నానని
నాతో నీవు నేనుగా ఉండాలని నీవే నేనై మదిలో ఉంటున్నావని || నువ్వే || 

Tuesday, April 5, 2016

ఎవరు మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడికి వెళ్లి పోతారు మీరు .....

ఎవరు మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడికి వెళ్లి పోతారు మీరు .....
ఏ నగరంలో ఉంటారు ఏ ఊరు వెళ్తారు ఎప్పుడు వస్తారు మీరు .....

ఏనాటి దాకో తెలియని ప్రపంచమే నాది ఎవరికో తెలియని ఆలోచన నాది
రూపంలోనే ఏదో తెలియనిది ఉంది ఆకారంలో ఏదో ఒకటి దాగే ఉంటుంది
భావంతోనే జీవిస్తున్నా కాలంతోనే నడిచి ప్రయాణమే చేస్తున్నా
బంధంతోనే సాగుతున్నా కలిసిన వారితోనే కాలాక్షేపం చేస్తున్నా ॥ ఎవరు ||

తెలియనిది తెలిసేదాక తెలియనిది ఎంతో ఉందని అనుకుంటున్నా
తెలిసినది మరచిపోయే దాక మరో ఆలోచన లేదని భావిస్తున్నా
ఎవరికి ఎవరో తెలియని వారితో జీవితం ఎలాగైనా సాగుతుంది
ఎవరికి ఎవరో తెలిసినా జీవితం ఎప్పటికైనా ఒంటరి అవుతుంది ॥ ఎవరు || 

Tuesday, March 15, 2016

విశ్వమై వచ్చాను ఈ జగతికి విశ్వ భావమై ఉన్నాను ఈ లోకానికి

విశ్వమై వచ్చాను ఈ జగతికి విశ్వ భావమై ఉన్నాను ఈ లోకానికి
శ్వాసనై ఉన్నాను ప్రతి జీవికి ధ్యాసనై ఉన్నాను ప్రతి మేధస్సుకు ॥ విశ్వమై ॥

సూర్యుడినై ఉదయిస్తూ విశ్వమంతా అవతరిస్తున్నా ఈ లోకానికి
చీకటితో అస్తమిస్తూ చంద్రుడినై జీవిస్తూ నక్షత్రాలతో వెలుగుతున్నా
నాలో దాగిన అణువుల సముదాయము నాలో  నిక్షిప్తమైన రూపాలే
నాలో ఉన్న రూపాలు విశ్వానికి తెలిపే విజ్ఞాన భావాల ఆకృతులే ॥ విశ్వమై ॥

ఆశ్చర్యమో అద్భుతమో అన్వేషిస్తే భయాలు తొలగిపోయే విజ్ఞానమే
నిగూడార్థము తెలిసే వరకు విశ్వమున అన్వేషణలు ఎన్నో సాగేను
విశ్వమై ఉంటాను ప్రతి జగతికి విశ్వ భావాలతో జీవిస్తాను ప్రతి లోకంలో
జీవమై జీవిస్తాను ప్రతి జీవిలో ధ్యాసగా సాగిపోతాను ప్రతి మేధస్సులో ॥ విశ్వమై ॥

Tuesday, February 16, 2016

ఆత్మనై వచ్చాను ఈ జగతికి - జీవమై ఉన్నాను ఈ లోకానికి

ఆత్మనై వచ్చాను ఈ జగతికి - జీవమై ఉన్నాను ఈ లోకానికి
విశ్వమై ఉంటాను ఈ కాలానికి  - దైవమై ఉన్నాను ఈ సృష్టికి
పంచ భూతమై నిలిచాను ఈ ప్రకృతిలో - పరమాత్మలా జీవిస్తున్నాను ప్రతి అణువులో ॥

శ్వాసలో ధ్యాసనై మరణం వరకు ఉచ్చ్వాస నిచ్చ్వాస లతో జీవమై జీవిస్తున్నా
మేధస్సులో భావమై ఆలోచనలతో కార్యమై అజ్ఞాన విజ్ఞానాలతో సాగుతున్నా

ప్రపంచమే పరమావధిగా అంతరిక్షమే బ్రంహాన్డముగా విశ్వ పరంపరలలో దాగి ఉన్నా
ఆకాశమే విజ్ఞాన క్షేత్రంగా సముద్రమే విజ్ఞాన కెరటంగా అలల మేఘాలతో సాగుతున్నా

సుమదుర భావాల సువర్ణాలలో ఆకార రూపాల ఆభరణాలలో గుణ లక్షణమై ఒదిగున్నా
అమృత స్వరాల స్వప్నములలో గంధర్వపు గాలుల సవ్వడులలో హాయిగా నిద్రిస్తున్నా ॥

సూర్యుడినై విశ్వమంతా ప్రకాశిస్తూ జీవ బంధాలకు తేజమునై తరతరాలుగా సాగుతున్నా
చంద్రుడినై చీకటికి కాంతి వెన్నెలగా నక్షత్ర కూటమిలో మూల కేంద్రమై ఆకాశాన్ని వీక్షిస్తున్నా

భూగోళానికే గురుత్వాకర్షణ నై భూ మండలానికే విశ్వ విఖ్యాత కీర్తి ప్రతిభనై నే ఉన్నా
విశ్వ దేశాలకు అధిపతినై కాల భావాలకు ప్రత్యక్షమై కాల ప్రభావాలకు అతిధినై ఉన్నా

జీవించుటలో సర్వము నేనై ధ్యానించుటలో సమస్తము నేనై జగతికి ప్రతి రూపమై ఉన్నా
అనంత రూపాలలో అణువులనై ఆఖండ దేశాలలో ఆశ్చర్యమై విజ్ఞాన పరిశోధన చేస్తున్నా ॥  

ఈ జగమంతా శివ రూపం ఈ జగమంతా శివ నామం

ఈ జగమంతా శివ రూపం ఈ జగమంతా శివ నామం
ఈ జగమంతా శివ ధ్యానం ఈ జగమంతా శివ భావం
అంతా శివ ఆకారమే అంతా శివ స్వరూపమే
సర్వం శివ ప్రమేయమే సమస్తం శివ సన్నిధియే ॥ ॥

శివుడే అర్ధనారీశ్వరీయ జగన్నాటక సూత్రధారి
శివుడే పురుషస్త్రీయ పర లోక జీవ మోక్షకారి

శివాయే సర్వ పూజిత నిత్య మంగళ ఆది శేషగిరి
శివాయే విశ్వ త్రి నేత్రిత దివ్య జ్యోతియ కరుణాకరి

శివ శంకరుడే శంఖు పూరిత సూర్యోదయ ధారి
శివ శంకరుడే కపాల పూర్ణిత అన్నపూర్ణ దేహి ॥ ॥

శివ నాధుడే శ్రీ కైలాస హిమాలయ నివాసి
శివ నాధుడే శ్రీ క్షేత్ర శ్రీశైల అరణ్య నివాసి

శివుడే త్రీలోక విజ్ఞాన వేద పాండిత్య సంపన్నుడు
శివుడే ముక్కోటి దేవతల సర్వ భూత సర్వజ్ఞుడు

శివ శంకరుడే విశ్వ ప్రాణుల మార్కండేయుడు
శివ శంకరుడే అల్ప జీవుల యోగ క్షేమంధరుడు ॥ ॥