Monday, October 9, 2017

కాలంతో జన్మిస్తూనే ప్రయాణిస్తున్నాము

కాలంతో జన్మిస్తూనే ప్రయాణిస్తున్నాము
సమయంతో జీవిస్తూనే మరణిస్తున్నాము

కాలంతో తెలిసినది నేర్చినది వయస్సుకే తెలియాలి
సమయంతో తెలిపినది ఓర్చినది మనస్సుకే తెలియాలి

కాలం క్షణాలైనా సమయమే మన తరుణం మన తపనం  || కాలంతో ||

ఎంతో కాలం జీవించామా ఎంతో విజ్ఞానం నేర్చామా
ఎంతో సమయం గడిచామా ఎంతో వేదన ఓర్చామా

ఎన్నో దీక్షలతో ఎన్నో సాధించామా
ఎన్నో కష్టాలతో ఎన్నో నిర్మించామా  || కాలంతో ||

ఏవేవో భావాలు మేధస్సులలోనే అనుభావాలు
ఎన్నో తత్వాలు ఆలోచనలలోనే సహనత్వాలు

ఎన్నో సుఖ దుఃఖాలు బంధాలకే పరిమితమా
ఎన్నేన్నో లాభ నష్టాలు దేహాలకే అపరిమితమా  || కాలంతో || 

మరణించెదనా భావ రోగాలతో

మరణించెదనా భావ రోగాలతో
జీవించెదనా తత్వ లోపాలతో
అనంత భావాల సర్వ తత్వాలతో నిత్యం జీవిస్తూ మరణించెదనా  || మరణించెదనా ||

జీవిస్తూనే మరణాన్ని తలచెదను
మరణిస్తూనే జన్మను తపించెదను

జీవించుటలోనే మరణాన్ని అన్వేషించెదను
మరణించుటలోనే జీవాన్ని పరిశోధించెదను

భావాలతోనే వేద రోగాల తత్వాలను గమనించెదను
తత్వాలతోనే జ్ఞాన లోపాల భావాలను స్వీకరించెదను  || మరణించెదనా ||

జీవించడమే రోగమా జన్మించడమే లోపమా అని తెలిపెదను
జీవించుటలో రోగం జన్మించుటలో లోపం అని వివరించెదను

జీవించడం రోగాలతో నయంకాలేని విధంగా సాగిపోయేను 
జననం లోపాలతో సరిచేసుకోలేని రకంగా ఆరంభమయ్యేను

రోగాలు దేహ భావాలకు నిలయంగా పరిశోధించెదను 
లోపాలు దేహ తత్వాలకు నిదర్శనంగా పరిగణించెదను  || మరణించెదనా ||

భావాలతో రోగాలను మరువలేను
తత్వాలతో లోపాలను విడవలేను

రోగాల బంధాలను మానుకోలేను
లోపాల దేహాలను మార్చుకోలేను

సర్వ రోగాలను అనుభవిస్తూనే మరణించెదను
అనంత లోపాలను సహకరిస్తూనే జీవించెదను  || మరణించెదనా || 

జీవం నీవే దేహం నీవే

జీవం నీవే దేహం నీవే
విశ్వం నీవే వేదం నీవే
సత్యం నీవే దైవం నీవే
జ్ఞానం నీవే ధర్మం నీవే
సర్వం నీవే శాంతం నీవే

సర్వ విధాల అనంత భావం నీవే  || జీవం ||

కరుణించే రూపం దయచూపే తత్వం నీలోనే
వరమిచ్చే భావం స్వర పరిచే బంధం నీలోనే

సత్యాన్ని పలికించే ధర్మాన్ని రక్షించేది నీవేలే
జ్ఞానాన్ని కలిగించే శాంతాన్ని బోధించేది నీవేలే  || జీవం ||

ఆనంద తత్వం అభయ హస్తం నీవేలే
ఆకాశ రూపం నిర్మల స్వరూపం నీవేలే

జీవుల ఆత్మీయం దేహాల పరమాత్మం నీవేలే
దేహాల హృదయం ప్రాణుల పరమార్థం నీవేలే  || జీవం || 

Thursday, October 5, 2017

మరణిస్తాను ఏనాడో తెలియని క్షణం

మరణిస్తాను ఏనాడో తెలియని క్షణం
జీవిస్తాను ఎంతవరకో తెలపని కాలం

జీవితమంటే తెలియని కాలంతో కొనసాగే జీవనం
కాలంతో సాగే ప్రయాణం మరణంతో నిలిచే జీవం  || మరణిస్తాను ||

మరణిస్తానని ఏనాడో తెలుసు జీవిస్తున్నానని నేడే తెలుసు
మరణించే సమయం తెలియక జీవిస్తున్నానని నాకే తెలుసు

మరణించాలని ఉన్నా సమయం వచ్చేదాక వేచి ఉండాలి
జీవించేదాకా కాలం మనతో ఉన్నా మరణంతో నిలిచిపోవాలి  || మరణిస్తాను ||

మరణం కోసమే జీవితమా జీవించుటయే జీవనమా
జీవించుటలో ఎన్నెన్నో అనుభవించడమే జీవితమా

మరణంలోపే ఎన్నో అధిగమించాలి ఎన్నో తెలుసుకోవాలి
జీవించుటలోనే పరమార్థం తెలియాలి పరమాత్మం పొందాలి  || మరణిస్తాను || 

Wednesday, October 4, 2017

మెళకువకు మంత్రం కావలెనా

మెళకువకు మంత్రం కావలెనా
నింద్రించుటకు మర్మం అవసరమా

కార్యాలకు తంత్రం కావలెనా
ఆలోచనకు యంత్రం అవసరమా

అలసటలో మర్మం ఉందో
నిద్రించుటలో మంత్రం ఉందో
దేహానికే యంత్రం తంత్రంగా సాగుతున్నది   || మెళకువకు ||

దేహాలకు శ్వాసే మంత్రం మేధస్సులకు ధ్యాసే మర్మం ఆలోచనలకు భావాలే మర్మం
రూపాలకు దేహమే యంత్రం బంధాలకు భాషే తంత్రం జీవులకు జీవనమే మంత్రం

జీవించే ప్రతి జీవి మేధస్సులో ఏదో ఆలోచన మంత్ర తంత్రం అవసరమే
కాలంతో సాగే ప్రతి జీవి దేహ యంత్రంలో ఎన్నో భావ తత్వాలు కావాలిలే  

తరతరాలుగా కొనసాగే జీవుల మేధస్సులలో ఎన్నో భావాలు సాగుతూ వచ్చేనులే
యుగయుగాలుగా జీవించే జీవులలో ఎన్నో నవ తత్వాలు ఉదయిస్తూ వచ్చేనులే  || మెళకువకు ||

శరీరాన్ని జీవింపజేయుటకే దేహ యంత్రాన్ని మర్మంతో నడిపించాలి
మేధస్సును నడిపించుటకే స్వభావ తంత్రాన్ని మంత్రంతో సాగించాలి

ఆహారం కోసమే విజ్ఞాన కార్యాల అన్వేషణను ప్రతి రోజు శ్రమిస్తూ సాగించాలి
సౌఖ్యాల కోసమే మరెన్నో కార్యాలను అధిగమిస్తూ ప్రతి సారి ప్రయత్నించాలి

జీవించుటలో ఎన్నో కార్యాలను ఎన్నో స్వభావాలతో సాగిస్తూ మంత్రంవలె గడపాలి
నివసించుటలో ఎన్నో కార్యాలను ఎన్నో తత్వాలతో ఓర్చేస్తూ తంత్రంవలె నడవాలి  || మెళకువకు ||

Tuesday, October 3, 2017

ఏనాటి భావన నీలో ఉంది

ఏనాటి భావన నీలో ఉంది
ఎంతటి తత్వన నీలో ఉంది

ఏనాటి వేదం నీలో ఉంది
ఎంతటి జ్ఞానం నీలో ఉంది

ఎవరికి తెలియని వేద విజ్ఞాన భావాల తత్వం నీలో ఉందా  || ఏనాటి ||

అనంత భావాల విశ్వ వేదం నీలో దాగినదా
అఖండ తత్వాల జీవ జ్ఞానం నీలో ఉన్నదా

యుగయుగాలుకు తెలియని భావాల వేదం నీలో ఉన్నదా
తరతరాలకు తెలియని తత్వాల విజ్ఞానం నీలో దాగినదా

సర్వం తెలిసిన ధ్యాన భావాలు నీలోనే ఉదయించాయా
సత్యం తెలిపిన ధ్యాస తత్వాలు నీలోనే జీవిస్తున్నాయా  || ఏనాటి ||

ఎంతటి సూక్ష్మ జీవులకైనా శ్వాసే మహా ప్రాణం
ఏ కార్యాలోచన లేని జీవికైనా పరధ్యాసే ప్రధానం

ఏ కార్య గమనమైన భావాలకు ధ్యానమే పర జ్ఞాన కేంద్రం
ఏ పరిశోధనమైన మేధస్సుకు ఆలోచనే మహా విజ్ఞాన స్థానం

ఏ జీవికి లేని మహా పర విజ్ఞాన కేంద్రం మానవ మేధస్సులోనే ఉన్నది
ఏ జీవికి లేని మహా పర స్వభావ తత్వం మానవ దేహములోనే ఉన్నది   || ఏనాటి ||

వేదంలో ఉన్నావో

వేదంలో ఉన్నావో
భావంలో ఉన్నావో
జ్ఞానంలో ఉన్నావో
తత్వంలో ఉన్నావో

సర్వం శాంతంలో ఉన్నావో అనంతం ప్రశాంతంలో ఉన్నావో  || వేదంలో ||

జీవంలో నీవే ఉన్నావా దైవంలో నీవే ఉన్నావా
దేహంలో నీవే ఉన్నావా ధర్మంలో నీవే ఉన్నావా
సత్యంలో నీవే ఉన్నావా నిత్యంలో నీవే ఉన్నావా

శ్వాసలో నీవే ఉన్నావా ధ్యాసలో నీవే ఉన్నావా
ఉచ్చ్వాసలో నీవే ఉన్నావా ధ్యానంలో నీవే ఉన్నావా
ప్రాణంలో నీవే ఉన్నావా ప్రయాసలో నీవే ఉన్నావా  

మేధస్సులో నీవే ఉన్నావా మర్మంలో నీవే ఉన్నావా
మంత్రంలో నీవే ఉన్నావా తంత్రంలో నీవే ఉన్నావా

ఆత్మలో నీవే ఉన్నావా పరమాత్మలో నీవే ఉన్నావా
అర్థంలో నీవే ఉన్నావా పరమార్థంలో నీవే ఉన్నావా   || వేదంలో ||

ప్రకృతిలో నీవే ఉన్నావా జగతిలో నీవే ఉన్నావా
విశ్వంలో నీవే ఉన్నావా లోకంలో నీవే ఉన్నావా
జీవనంలో నీవే ఉన్నావా జీవితంలో నీవే ఉన్నావా

ప్రభాతంలో నీవే ఉన్నావా ప్రయాణంలో నీవే ఉన్నావా
పరిశోధనలో నీవే ఉన్నావా పరిశుద్ధంలో నీవే ఉన్నావా  

స్నేహంలో నీవే ఉన్నావా హితంలో నీవే ఉన్నావా
వర్ణంలో నీవే ఉన్నావా బంధంలో నీవే ఉన్నావా  
రూపంలో నీవే ఉన్నావా ఆకారంలో నీవే ఉన్నావా

కాలంలో నీవే ఉన్నావా సమయంలో నీవే ఉన్నావా
క్షణంలో నీవే ఉన్నావా తరుణంలో నీవే ఉన్నావా    || వేదంలో ||