మరణిస్తాను ఏనాడో తెలియని క్షణం
జీవిస్తాను ఎంతవరకో తెలపని కాలం
జీవితమంటే తెలియని కాలంతో కొనసాగే జీవనం
కాలంతో సాగే ప్రయాణం మరణంతో నిలిచే జీవం || మరణిస్తాను ||
మరణిస్తానని ఏనాడో తెలుసు జీవిస్తున్నానని నేడే తెలుసు
మరణించే సమయం తెలియక జీవిస్తున్నానని నాకే తెలుసు
మరణించాలని ఉన్నా సమయం వచ్చేదాక వేచి ఉండాలి
జీవించేదాకా కాలం మనతో ఉన్నా మరణంతో నిలిచిపోవాలి || మరణిస్తాను ||
మరణం కోసమే జీవితమా జీవించుటయే జీవనమా
జీవించుటలో ఎన్నెన్నో అనుభవించడమే జీవితమా
మరణంలోపే ఎన్నో అధిగమించాలి ఎన్నో తెలుసుకోవాలి
జీవించుటలోనే పరమార్థం తెలియాలి పరమాత్మం పొందాలి || మరణిస్తాను ||

No comments:
Post a Comment