ఆత్మలోనే ఉన్నాను పరమాత్మగా దాగాను
మేధస్సులోనే ఉన్నాను ఆలోచనగా దాగాను
అణువులోనే ఉన్నాను పరమాణువుగా దాగాను
శ్వాసలోనే ఉన్నాను ఉచ్చ్వాస జీవంగా దాగాను || ఆత్మలోనే ||
పంచభూతాల ప్రకృతిగా పరమాత్మవలే పరమాణువునై ఇమిడిపోయాను
విశ్వభూతాల జగతిగా పరంధామవలే ఖనిజమునై అంతర్లీనమైపోయాను
దైవభూతాల సాక్షిగా దేహములోనే హృదయమునై మిగిలిపోయాను
సర్వభూతాల దీక్షగా మనస్సులోనే మౌనత్వమునై లీనమైపోయాను || ఆత్మలోనే ||
ప్రకృతిలోనే పరిశోధనమై ఆకృతిలోనే పరిశుద్ధమై ఉండిపోయాను
విశ్వతిలోనే అన్వేషణనై జగతిలోనే ఆద్యంతమై నిండిపోయాను
జీవంలోనే సూక్ష్మమై రూపంలోనే శూన్యమై శ్వాసలో చేరిపోయాను
ధ్యాసలోనే వేదమై మేధస్సులోనే ధ్యానమై ఆలోచనలో పడిపోయాను || ఆత్మలోనే ||

No comments:
Post a Comment