Tuesday, October 10, 2017

అన్వేషణ మేధస్సులో మొదలైనదా

అన్వేషణ మేధస్సులో మొదలైనదా
పరిశోధన ఆలోచనతో ఆరంభమైనదా 

విజ్ఞానం భావాలతో కలుగుతున్నదా
కార్యాచరణ కాలంతో సాగుతున్నదా  || అన్వేషణ ||

విశ్వాన్ని అన్వేషించి చూడగా తెలియును మహా విజ్ఞాన వేదం
జగతిని పరిశోధించి చూడగా తెలియును మహా శాస్త్రీయ భావం
ప్రకృతిని పరిశీలించి చూడగా తెలియును మహా ప్రజ్ఞాన తత్వం
లోకాన్ని పర్యవేక్షించి చూడగా తెలియును మహా ప్రస్థాన విధానం  || అన్వేషణ ||

విశ్వాన్ని గమనించి చూడగా తెలియును మహా కాల వేదాంతం 
జగతిని తిలకించి చూడగా తెలియును మహా కార్య సిద్ధాంతం
ప్రకృతిని పరీక్షించి చూడగా తెలియును మహా జీవన శాస్త్రీయం
లోకాన్ని అభ్యసించి చూడగా తెలియును మహా మానవ నైపుణ్యం  || అన్వేషణ || 

No comments:

Post a Comment