Tuesday, October 31, 2017

పరిశుద్ధమైనదే సూర్యోదయం

పరిశుద్ధమైనదే సూర్యోదయం
పరిశోధనమైనదే పర్యావరణం

పవిత్రమైనదే ప్రకృతి ప్రాంతం
ప్రశాంతమైనదే విశ్వతి రూపం   || పరిశుద్ధమైనదే ||

జగమంతా ఉద్యానవనం
విశ్వమంతా బృందావనం 

జీవమంతా సర్వానందం
దేహమంతా నిత్యానందం   

సూర్యని తేజం మహా పవిత్రం మహా పరిశుద్ధం
సూర్యుని రూపం మహా ప్రజ్వలం మహా పరిశోధనం   || పరిశుద్ధమైనదే ||

వేదమంతా విద్యానందం
భావమంతా విజ్ఞానందం

జీవమంతా దైవానందం
దేహమంతా తత్వానందం   

ప్రకృతి ప్రాంతం మహా పరిమళం మహా పవిత్రం
ప్రకృతి నిలయం మహా ప్రశాంతం మహా ప్రసాదం   || పరిశుద్ధమైనదే ||

Friday, October 27, 2017

ప్రకృతినే పరిచయం చేసుకో ప్రకృతినే ప్రేమంతో చూసుకో

ప్రకృతినే పరిచయం చేసుకో ప్రకృతినే ప్రేమంతో చూసుకో
ప్రకృతినే పరిశోధనం చేసుకో ప్రకృతినే ప్రాణంతో చూసుకో

ప్రకృతినే హృదయంతో చూసుకో ప్రకృతినే మేధస్సుతో చూసుకో
ప్రకృతినే సూర్యోదయంతో చూసుకో ప్రకృతినే మనస్సుతో చూసుకో  || ప్రకృతినే ||

ప్రకృతినే పండించుకో ప్రకృతినే వండించుకో
ప్రకృతినే ఎదిగించుకో ప్రకృతినే ఒదిగించుకో

ప్రకృతినే సాగించుకో ప్రకృతినే ప్రయాణించుకో
ప్రకృతినే ఆరగించుకో ప్రకృతినే ఆశ్రయించుకో   || ప్రకృతినే ||

ప్రకృతినే సాధన చేసుకో ప్రకృతినే సేద్యం చేసుకో
ప్రకృతినే ఆధారం చేసుకో ప్రకృతినే ఉదారం చేసుకో

ప్రకృతినే దైవంగా చూసుకో ప్రకృతినే దేహంగా చూసుకో
ప్రకృతినే ధర్మంగా చూసుకో ప్రకృతినే దివ్యంగా చూసుకో  || ప్రకృతినే || 

ఎవరికి ఏదో జరగాలి కాలంతో సాగిపోవాలి

ఎవరికి ఏదో జరగాలి కాలంతో సాగిపోవాలి
ఎవరికి ఏదో అవ్వాలి క్షణాలతో కొనసాగాలి

ఎందరితో ఏదో జరిగిపోవాలి సమయంతో గడిచిపోవాలి
ఎందరితో ఏదేదో తరిగిపోవాలి క్షణాలతో వదిలిపోవాలి   || ఎవరికి ||

ఎవరు ఏది కలిగించినా కరుణతో కరిగిపోవాలి
ఎవరు ఏది వదిలించినా దయతో మరిగిపోవాలి

ఎందరో వస్తారు ఏదో చేస్తారు ఏదో ఇచ్చివెళ్ళిపోతారు
ఎందరో ఉంటారు ఏదో అంటారు ఎంతో తీసుకెళ్తారు   || ఎవరికి ||

ఎవరికి ఏదో అవుతుంది ఏదో ఆగిపోతుంది
ఎవరికి ఏదో వస్తుంది ఏదో వెళ్ళిపోతుంది

ఎవరికి ఏది జరగాలో కాలమే తెలపాలి
ఎవరికి ఏది కలగాలో క్షణమే తపించాలి   || ఎవరికి ||

ఎవరికి ఏమైనా సుఖానందమే కలగాలి
ఎవరికి ఏదైనా శుభానందమే వరించాలి

ఎవరికి ఎంతైనా లాభమే సర్వానందమై సాగాలి
ఎవరికి ఎలైనా సంతోషమే నిత్యానందమై చేరాలి   || ఎవరికి || 

Wednesday, October 25, 2017

ఎవరో మనకు మేలు చేసెదరు

ఎవరో మనకు మేలు చేసెదరు
ఎందరో మనకు కీడు చేసెదరు

ఎవరు మేలు చేసినా మనకు శుభమే
ఎందరో కీడు చేసినా మనకు అశుభమే  || ఎవరో ||

ఎవరి స్వభావం ఎలా ఉంటుందో మేధస్సుకే ప్రశ్నార్థకం
ఎవరి తత్వం ఎలా ఉంటుందో ఆలోచనకే సమస్యాత్మకం

ఎవరికి ఎవరు ఎదురౌతారో ఎలా ప్రవర్తిస్తారో తెలియని భావం
ఎవరికి ఎందరు ఎదురౌతారో ఎలా ఏంచేస్తారో తోచలేని తత్వం  || ఎవరో ||

మేలు చేసేవారు మనకు విజ్ఞానమే
కీడు చేసేవారు మనకు అనుభవమే

ఎవరు ఎలా జీవిస్తారో ఎలా ప్రవర్తిస్తారో కాలానికే ఎరుక
ఎవరు ఎలా వస్తారో ఎలా ఉంటారో సమయానికే ఎరుక  || ఎవరో ||

భాషే జీవనం భాషే పరిచయం

భాషే జీవనం భాషే పరిచయం
భాషే జీవితం భాషే పరిశోధనం

అక్షరాల పదాలతోనే వాక్యాల వ్యాకరణ అర్థాంశం
అక్షరాల పదాలతోనే భావాల వ్యాకరణ పరమార్థం  || భాషే ||

భావాల భాషతోనే జీవనం ఆరంభం
తత్వాల భాషతోనే జీవితం ప్రారంభం

భాషతో విజ్ఞానం పర భాషతో పరిశోధనం
భాషతో సమాచారం పర భాషతో ప్రజ్ఞానం

భాషలోనే పరమార్థం పర భాషలోనే పరమాత్మం
భాషలోనే అర్థాంశం పర భాషలోనే స్వభావార్థం

జన్మించడంతోనే భావాల పరిశోధనం బంధాల పరిచయం
జీవించడంతోనే తత్వాల పరిశోధనం వేదాల పరిచయం    || భాషే ||

భాషలో ఎన్నో మార్పులు కలిగేలా యంత్రాల పరిశోధనం
భాషలో ఎన్నో విధానాలు కలిగేలా యాంత్రిక ఉపయోగం

పర భాషతోనే స్వదేశ విదేశ ప్రదేశాల అనేక విధాల ప్రయాణం
పర భాషతోనే స్వదేశ విదేశాల ఎగుమతుల దిగుమతుల వ్యాపారం

భాషతోనే కాలాన్ని విజ్ఞానంగా సాగిస్తూ జీవితాన్ని వినియోగించుకోవడం
భాషతోనే సమయాన్ని పఠనంగా సాగిస్తూ జీవనాన్ని ఉపయోగించుకోవడం

భావాల భాషతో ఒంటరితనమైన జీవితాన్ని పరమార్థంగా సాగించుకోవడం
తత్వాల భాషతో ఉమ్మడితనమైన జీవనాన్ని పరమాత్మంగా మలుచుకోవడం || భాషే ||

Tuesday, October 24, 2017

లోకం పరిశుద్ధమైతేనే ఉదయించనా

లోకం పరిశుద్ధమైతేనే ఉదయించనా
లోకం పరిశుద్ధమైతేనే జీవించెదనా

విశ్వం పవిత్రమైతేనే జన్మించెదనా
విశ్వం పవిత్రమైతేనే ప్రయాణించెదనా  || లోకం ||

జన్మించుటలో పవిత్రం పరిశుద్ధం ప్రశాంతం తిలకించెదను
జీవించుటలో పరిశోధనం పరిశుభ్రం ప్రధానం వహించెదను

ఉదయించుటలో ప్రజ్వలం ప్రతేజం ప్రకాశం ధరించెదను
ప్రయాణించుటలో పర్యావరణం పరిపూర్ణం ఆవహించెదను  || లోకం ||

ధ్యానించుటలో పరిమళం ప్రత్యామ్నాయం కల్పించెదను
భోధించుటలో ప్రదీపం ప్రజ్ఞానం ప్రవచనం అర్పించెదను

ఎదుగుటలో భవిష్య ప్రణాళికం ప్రశాంత ప్రదేశం ప్రసాదించెదను
ఒదుగుటలో వైవిధ్య ప్రచురణం ప్రకృతం ప్రస్థానం రచించెదను   || లోకం || 

Saturday, October 14, 2017

ఇవ్వాలనుకున్నా ఇవ్వలేవు

ఇవ్వాలనుకున్నా ఇవ్వలేవు
తీసుకోవాలనుకున్నా తీసుకోలేవు

ఇచ్చేది ఎవరో తీసుకునేది ఎవరో
జీవించేంతవరకే ఇవ్వడం తీసుకోవడం  || ఇవ్వాలనుకున్నా ||

ఉన్నప్పుడు ఇచ్చేస్తేనే ఎంతో ఉపయోగం
అవసరమైనప్పుడు ఇస్తేనే సద్వినియోగం

మరణించే సమయాన ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితి
మరణించే సమయాన తీసుకోవాలనుకున్నా తీసుకోలేని స్థితి

ఇవ్వాలనుకున్నా తీసుకునేవారు లేకపోతే నిరుపయోగం
తీసుకోవాలనుకున్నా ఇచ్చేవారు లేకపోతే నిష్ప్రయోజనం   || ఇవ్వాలనుకున్నా ||

సహాయంగా ఇవ్వలేకపోయినా బాధ్యతగా ఉన్నప్పుడే ఇచ్చేయాలి
ఉచితంగా ఇవ్వలేకపోయినా తిరిగి ఇచ్చేలా సహాయంగా ఇవ్వాలి

భాగంగా ఇవ్వాలనుకున్నది అవసరాలకు ఉన్నప్పుడే ఇచ్చేయాలి
బాధ్యతగా తీసుకోవాలనుకున్నది ఉపయోగం ఉన్నప్పుడే తీసుకోవాలి

ఇవ్వడం తీసుకోవడం ఆరోగ్యాంగా జీవిస్తున్నప్పుడే జరిగిపోవాలి
ఇవ్వడం తీసుకోవడం ఉపయోగంగా అవసరాలతో గడిచిపోవాలి   || ఇవ్వాలనుకున్నా || 

తీసుకోవడానికి అడగాలి ఇవ్వడానికి తెలపాలి
తీసుకోవడం అడగడమే ఇవ్వడం తెలపడమే

తరతరాలకు మించిన ఆస్తులను బాధ్యతగా సరైన భాగంగా అవసరాలకు ఉన్నప్పుడే పంచుకోండి
తరతరాలకు మించిన ఆస్తులను అనుభవించేవారు లేకపోతే ఎందరినో ఉన్నప్పుడే ఆదుకోండి      || ఇవ్వాలనుకున్నా ||