Tuesday, November 1, 2016

వేదం నీవే వేదాంతం నీవే దైవం నీవే దైవాంతం నీవే

వేదం నీవే వేదాంతం నీవే దైవం నీవే దైవాంతం నీవే
జీవం నీవే జీవాంతం నీవే లోకం నీవే లోకాంతం నీవే
విశ్వం నీవే విశ్వాంతం నీవే భావం నీవే భావాంతం నీవే
రూపం నీవే రూపాంతం నీవే దేహం నీవే దేహాంతం నీవే  || వేదం ||

మన లోనే కాలం తెలిపే వేదాంశ దైవాంశం సహజాంశం
మన కోసమే సమయం చూపే రూపాంశ దేహాంశం సహాంశం
మన యందే క్షణం ఇచ్చే జీవాంశ లోకాంశం సమ్మోహాంశం
మన నుండే తరుణం తెలిపే విశ్వాంశ భావాంశం సమాంశం  || వేదం ||

ఏదైనా మన అంశం విషయాంశం ఎంతైనా మన వంశం శతాబ్దాంశం
ఏమైనా మన వర్ణాంశం సువర్ణాంశం ఏవైనా మన భోగాంశం అంగాంశం
ఏదైనా మన సత్యాంశం ధర్మాంశం ఎంతైనా మన కార్యాంశం విధ్యాంశం
ఏమైనా మన భాగాంశం సర్వాంశం ఏవైనా మన పూర్ణాంశం శూన్యాంశం   || వేదం || 

No comments:

Post a Comment