Thursday, November 10, 2016

ఏ లోకాలలో ఎన్ని మేధస్సులు కలిసినా విశ్వ మేధస్సుకు సరికాదులే

ఏ లోకాలలో ఎన్ని మేధస్సులు కలిసినా విశ్వ మేధస్సుకు సరికాదులే
ఏ భావాలతో ఎన్ని తత్వాలు తెలిసినా విశ్వ భావత్వాలకు సరిపోదులే  || ఏ లోకాలలో  ||

విశ్వ భావాలలో ఉన్న దివ్య గుణాలు మహాత్ముని పరతత్వ పరిశోధనాలే
విశ్వ తత్వాలలో ఉన్న లక్షణాలు మాధవుని పరధ్యాస పర్యాయ పద్మాలే

ప్రకృతి లక్షణాలలో దాగిన తత్వములు మహా దేవుని మధురములే
ప్రకృతి శాస్త్రీయములలో దాగిన భావములు మహా ఋషి వరణములే   || ఏ లోకాలలో  ||

జగతిలో కలిగే కాల ప్రభావాలు సూక్ష్మ ప్రజ్ఞాన పరిశీలన ప్రయోగాలే
విశ్వంలో కలిగే కార్య ప్రభావాలు ఆధ్యాత్మ విజ్ఞాన పర్యవేక్షణములే

సృష్టిలో కలిగే మార్పుల విధానాలలో ఎన్నెన్నో మహోత్తరమైన విషయాలే
సృష్టిలో కలిగే పరిభ్రమణం విజ్ఞాన వేదాలలో ఎన్నో మహత్యమైన అంశాలే   || ఏ లోకాలలో  || 

No comments:

Post a Comment