నీవు నడిచిన పాదం ఎవరి పాదం నీవు వెళ్ళిన దేహం ఎవరి దేహం
నీవు తాకిన పాదం ఎవరి పాదం నీవు ధరించిన దేహం ఎవరి దేహం
లోకాలకే ఈ పాదం జీవ పాదం ఈ దేహం దైవ దేహం
జగతికే ఈ పాదం విశ్వ పాదం ఈ దేహం శాంతి దేహం
సర్వ లోక నాద పాదం సర్వ జ్ఞాన వేద పాదం
సర్వ పాద పుణ్య స్థానం సర్వ వేద పుణ్య భావం || నీవు నడిచిన ||
బ్రంహయే మెచ్చిన దివ్య పాదం విష్ణువే తలచిన నాభి పాదం
శివుడే దర్శించిన దైవ పాదం సాయియే కరుణించిన కాల పాదం
కాల జ్ఞాన పూర్వ పాదం కాల విజ్ఞాన అపూర్వ పాదం భక్త పాదం
త్రిమూర్తులకు త్రిగుణ పాదం త్రికోటి జనులకు జన్మ పాదం
నటరాజుని నాట్య పాదం నలుగురిలో స్నేహ పాదం
శ్లోకాలకే శుభ పాదం వర్ణాలకే సువర్ణ పాదం నంది పాదం
ఎవరి పలుకులకైనా హంస పాదం ఎవరి పిలుపులకైనా రాగ పాదం
ఎవరి ప్రాణానికైనా ప్రాణం పాదం ఎవరి ఊపిరికైనా ఊపిరి దేహం
పాదమే నిలిపిన దేహం అనూహ్యమైన స్నేహ బంధం
పాదమే కదిపిన దేహం అమోఘమైన ప్రేమ బంధం || నీవు నడిచిన ||
యుగాలే గడిచిన యోగ పాదం శతాబ్దాలే తరిలిన తీర పాదం
వర్షాలకే తడిచిన వర పాదం గాలికే చలించిన స్పర్శ పాదం
నదులే ప్రవహించిన క్షీర పాదం సముద్రాలే ఉప్పొంగిన అలల పాదం
ప్రపంచానికే ప్రాణ పాదం ప్రకృతికే పరమ పాదం ఆత్మకే మహా పాదం
పరమాత్ముడే సృష్టించిన ధర్మ పాదం పరంధామయే పూజించిన సత్య పాదం
అంతర్యామి అధిరోహించిన అనంత పాదం అవధూత సాగించిన అమర పాదం
ధ్యానులకే ధ్యాన పాదం చరిత్రకే చరణ పాదం
పరలోక పవిత్ర పాదం ఇహలోక ఇంద్ర పాదం
స్వయంభువ ప్రకాష పాదం స్వయంకృప సూర్య పాదం
విజయానికే దీక్ష పాదం మరణంతో మహా మోక్ష పాదం
దేహమే మోపిన అడుగు పాదం అనుబంధమైన గుణం
దేహమే నిలిచిన ఇరు పాదం అమరమైన జీవ తత్వం || నీవు నడిచిన ||

No comments:
Post a Comment