Showing posts with label అంతర్యామి. Show all posts
Showing posts with label అంతర్యామి. Show all posts

Tuesday, November 8, 2016

నీవు నడిచిన పాదం ఎవరి పాదం నీవు వెళ్ళిన దేహం ఎవరి దేహం

నీవు నడిచిన పాదం ఎవరి పాదం  నీవు వెళ్ళిన దేహం ఎవరి దేహం
నీవు తాకిన పాదం ఎవరి పాదం నీవు ధరించిన దేహం ఎవరి దేహం

లోకాలకే ఈ పాదం జీవ పాదం ఈ దేహం దైవ దేహం
జగతికే ఈ పాదం విశ్వ పాదం ఈ దేహం శాంతి దేహం

సర్వ లోక నాద పాదం సర్వ జ్ఞాన వేద పాదం
సర్వ పాద పుణ్య స్థానం సర్వ వేద పుణ్య భావం                || నీవు నడిచిన ||

బ్రంహయే మెచ్చిన దివ్య పాదం విష్ణువే తలచిన నాభి పాదం
శివుడే దర్శించిన దైవ పాదం సాయియే కరుణించిన కాల పాదం
కాల జ్ఞాన పూర్వ పాదం కాల విజ్ఞాన అపూర్వ పాదం భక్త పాదం
త్రిమూర్తులకు త్రిగుణ పాదం త్రికోటి జనులకు జన్మ పాదం

నటరాజుని  నాట్య పాదం నలుగురిలో స్నేహ పాదం
శ్లోకాలకే శుభ పాదం వర్ణాలకే సువర్ణ పాదం నంది పాదం

ఎవరి పలుకులకైనా హంస పాదం ఎవరి పిలుపులకైనా రాగ పాదం
ఎవరి ప్రాణానికైనా ప్రాణం పాదం ఎవరి ఊపిరికైనా ఊపిరి దేహం

పాదమే నిలిపిన దేహం అనూహ్యమైన స్నేహ బంధం
పాదమే కదిపిన దేహం అమోఘమైన ప్రేమ బంధం         || నీవు నడిచిన ||

యుగాలే గడిచిన యోగ పాదం శతాబ్దాలే తరిలిన తీర పాదం
వర్షాలకే తడిచిన వర పాదం గాలికే చలించిన స్పర్శ పాదం
నదులే ప్రవహించిన క్షీర పాదం సముద్రాలే ఉప్పొంగిన అలల పాదం
ప్రపంచానికే ప్రాణ పాదం ప్రకృతికే పరమ పాదం ఆత్మకే మహా పాదం

పరమాత్ముడే సృష్టించిన ధర్మ పాదం పరంధామయే పూజించిన సత్య పాదం
అంతర్యామి అధిరోహించిన అనంత పాదం అవధూత సాగించిన అమర పాదం

ధ్యానులకే ధ్యాన పాదం చరిత్రకే చరణ పాదం
పరలోక పవిత్ర పాదం ఇహలోక ఇంద్ర పాదం

స్వయంభువ ప్రకాష పాదం స్వయంకృప సూర్య పాదం
విజయానికే దీక్ష పాదం మరణంతో మహా మోక్ష పాదం

దేహమే మోపిన అడుగు పాదం అనుబంధమైన గుణం
దేహమే నిలిచిన ఇరు పాదం అమరమైన జీవ తత్వం     || నీవు నడిచిన || 

Monday, October 17, 2016

అంతర్యామి అలసితి సొలసితి

అంతర్యామి అలసితి సొలసితి
అవధూతగా నిన్నే కొలిచితి పిలిచితి
ఆత్మ పరమాత్మగా నీకై నేనే మిగిలితి  || అంతర్యామి ||

నా అంతర్భావాలలో నీవే నా అంతరాత్మవు
నా అంతర్భాగములో నీవే నా అవధూతవు
నా అంతర్ముఖములో నీవే నా పరమాత్మవు

నా భారాన్ని ఏనాటి వరకు మోసితివి
నా మోక్షాన్ని ఏనాటి వరకు దాచితివి
నా మరణాన్ని ఏనాటి వరకు పెంచితివి  || అంతర్యామి ||

నీ దర్శనముకై నీ సప్త ద్వారముల యందే నిలిచితి
నీ రూపమునకై నీ అంతస్తుల అడుగులనే కొలిచితి
నీ వరమునకై నీ దూరముల ప్రయాణమునే నడిచితి

నీవే నాకు దిక్కుగా నేనే నీకు మోక్కుగా సాగితిని
నీవే నాకు దైవంగా నేనే నీకు దేహంగా ఉండితిని
నీవే నాకు ధర్మంగా నేనే నీకు సత్యమై పలికితిని  || అంతర్యామి || 

Thursday, October 13, 2016

ఒక జీవిగా చిరంజీవిగా జీవించవా జీవత్వమా

ఒక జీవిగా చిరంజీవిగా జీవించవా జీవత్వమా
ఒక ఆత్మగా పరమాత్మగా పలికించవా పరతత్వమా  || ఒక జీవిగా ||

ఈ జగతికి నీవే మహాత్మవై పరంధామగా అవతరించావు
ఈ విశ్వానికి నీవే మహర్షివై పరంజ్యోతిగా అధిరోహించావు
ఈ లోకానికి నీవే అవధూతవై అంతర్యామిగా అంతర్భవించావు

ప్రతి జీవిలో ఒకే జీవత్వమే చిరంజీవిగా జీవిస్తూ మరణించే భావత్వమే
ప్రతి అణువు ప్రతి జీవి ఆనందంగా జీవించాలనే విశ్వాన్ని వేడుకొనెను
ప్రతి అణువు ప్రతి జీవి సంతోషంగా మరణించాలనే కాలాన్ని కోరుకొనెను  || ఒక జీవిగా ||

ప్రతి జీవిలో ప్రతి అణువులో ఒకే జీవత్వమై ఒకే ప్రేమత్వమై దాగేను
ప్రతి జీవిలో ప్రతి అణువులో ఒకే భాషత్వమై ఒకే సత్యత్వమై ఉండేను
ప్రతి జీవిలో ప్రతి అణువులో ఒకే శ్వాసత్వమై ఒకే ధ్యాసత్వమై సాగేను

మనిషిగా జీవించే ప్రతి జీవిలో విజ్ఞానమే సంపూర్ణమైన ప్రజ్ఞానమయ్యేను
మనిషిగా ఎదిగే ప్రతి జీవిలో వివేకత్వమే పరిశుద్ధమైన పరిపూర్ణమయ్యేను
మనిషిగా ఒదిగే ప్రతి జీవిలో అనుభవమే పేమత్వమైన పరిశోధనమయ్యేను  || ఒక జీవిగా || 

Tuesday, September 20, 2016

నాతో జీవించే దైవం ఏదో నాతో కలిసే దేహం ఎదో

నాతో జీవించే దైవం ఏదో నాతో కలిసే దేహం ఎదో
నాతో నడిచే తోడు ఎవరో నాతో ఉండే నీడ ఎవరిదో  || నాతో జీవించే ||

శ్వాసలో ప్రతి శ్వాసగా ఊపిరిలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ఎవరివో
మాతృత్వం సృష్టించిన మహా తల్లి హృదయం ఎంతటి దైవమో

మహా ఆత్మగా మహా ఋషిగా వచ్చేది ఎవరో
మహా ధూతగా మహా ధాతగా వచ్చేది ఎవరో
పర బ్రంహగా పర విష్ణుగా వచ్చే పరమేశ్వర ఎవరో   || నాతో జీవించే ||

దైవం చూపే పరంధామ ఎవరో దేహంలో ఉన్న అంతరాత్మ ఎవరో
తోడుగా నడిచే అంతర్యామి ఎవరో నీడను ఇచ్చే అవధూత ఎవరో

మహాత్మగా జీవితం సాగుతున్నా మహర్షిగా జీవనం వెళ్ళుతున్నా
అవధూతగా జీవిస్తూనే ఉన్నా విశ్వధాతగా ప్రయాణం చేస్తున్నా   || నాతో జీవించే || 

Friday, August 5, 2016

అంతరాత్మ అంతర్యామి

అంతరాత్మ అంతర్యామి
అవధూత అంతర్భావం
అధిరోహించేను అద్వైత్వం  || అంతరాత్మ ||

పరమ తత్వం పరిశోధించగా తెలిసేనే పరమాత్మము
మహా తత్వం పర్యవేక్షించగా తెలిసేనే పరతత్వము
వేద తత్వం అన్వేషించగా తెలిసేనే అద్వైత్వము
దైవ తత్వం పరిశీలించగా తెలిసేనే దైవత్వము         || అంతరాత్మ ||

ఆత్మలోనే మహాత్మ పరమాత్మ
మహాత్మలోనే పరమాత్మ అంతరాత్మ
పరమాత్మలోనే అంతరాత్మ జీవాత్మ
అంతరాత్మలోనే జీవాత్మ మహా ఆత్మ
జీవాత్మలోనే మహా ఆత్మ దైవాత్మ
మహా ఆత్మలోనే దైవాత్మ దేవాత్మ  
దైవాత్మలోనే దేవాత్మ ఓ ఆత్మ            || అంతరాత్మ ||

దేవాత్మలోనే ఓ ఆత్మ
ఆత్మలోనే ఆత్మ అనంతమై అధిరోహించేను  || అంతరాత్మ ||