Showing posts with label అద్వైత్వం. Show all posts
Showing posts with label అద్వైత్వం. Show all posts

Friday, August 5, 2016

అంతరాత్మ అంతర్యామి

అంతరాత్మ అంతర్యామి
అవధూత అంతర్భావం
అధిరోహించేను అద్వైత్వం  || అంతరాత్మ ||

పరమ తత్వం పరిశోధించగా తెలిసేనే పరమాత్మము
మహా తత్వం పర్యవేక్షించగా తెలిసేనే పరతత్వము
వేద తత్వం అన్వేషించగా తెలిసేనే అద్వైత్వము
దైవ తత్వం పరిశీలించగా తెలిసేనే దైవత్వము         || అంతరాత్మ ||

ఆత్మలోనే మహాత్మ పరమాత్మ
మహాత్మలోనే పరమాత్మ అంతరాత్మ
పరమాత్మలోనే అంతరాత్మ జీవాత్మ
అంతరాత్మలోనే జీవాత్మ మహా ఆత్మ
జీవాత్మలోనే మహా ఆత్మ దైవాత్మ
మహా ఆత్మలోనే దైవాత్మ దేవాత్మ  
దైవాత్మలోనే దేవాత్మ ఓ ఆత్మ            || అంతరాత్మ ||

దేవాత్మలోనే ఓ ఆత్మ
ఆత్మలోనే ఆత్మ అనంతమై అధిరోహించేను  || అంతరాత్మ || 

Friday, July 15, 2016

మాతృత్వం ఒక జీవ తత్వం

మాతృత్వం ఒక జీవ తత్వం
మహా తత్వం ఒక మహాత్ముని దైవత్వం
ప్రతి తత్వం విశ్వంలో ఒదిగిన జీవత్వం || మాతృత్వం ||

ఆత్మ తత్వం జీవిలో ఒదిగిన మాతృత్వమే
మహా తత్వం మహాత్మునిలో ఎదిగిన జీవత్వమే

దైవత్వం సత్య భావాలతో సాగే ఆత్మ తత్వం
అద్వైత్వం పరమాత్మతో నడిచే పర తత్వం

వేదత్వం మహాత్ముల గుణ తత్వం
వేదాంతం మహానుభావుల సుగుణత్వం  || మాతృత్వం ||

భావంతో సాగే మహా జీవుల జీవనమే ఒక నవ తత్వం
స్వభావంతో సాగే అనేక జీవుల జీవితమే ఒక నవీనత్వం

విశ్వ తత్వం జగతికి మాతృత్వం
మహా తత్వం మహాత్మకు జీవత్వం

ప్రకృతిలో దాగిన పర తత్వాలే కాలంతో తెలిసే విజ్ఞాన తత్వం
అణువులో దాగిన జీవ తత్వాలే పరిశోధనలో కలిగే నవ తత్వం  || మాతృత్వం ||