Wednesday, June 14, 2017

విజ్ఞానం నీ మేధస్సుకు తెలిసిందా పరిజ్ఞానం నీ ఎరుకకు తోచిందా

విజ్ఞానం నీ మేధస్సుకు తెలిసిందా పరిజ్ఞానం నీ ఎరుకకు తోచిందా
పరజ్ఞానం నీ మనస్సుకు కలిగిందా ప్రజ్ఞానం నీ వయస్సుకు చేరిందా  || విజ్ఞానం ||

అనుభవమే విజ్ఞానం సమ భావమే ప్రజ్ఞానం సుజ్ఞానమే పరిజ్ఞానం
సమయమే సందర్భోచితం సమ కాలమే సమయస్ఫూర్తి దాయకం

జీవితమే విజ్ఞాన పరిశోధనం జీవనమే ప్రజ్ఞాన పర్యవేక్షణం
పరిశోధనమే పరిమితి లేనిది పరిశీలనమే పరిమానం కానిది  || విజ్ఞానం ||

ప్రకృతిలోనే పరిశుద్ధ భావం విశ్వంలోనే పరిపూర్ణ స్వభావం
జగములోనే పవిత్ర బంధం లోకంలోనే ప్రత్యేక అనుబంధం

నేర్చిన భావాలే నేర్పరి తనమున విజ్ఞాన పరిశోధనం
గడిచిన స్వభావాలే లేఖరి తనమున జ్ఞాన ప్రబోధనం  || విజ్ఞానం || 

No comments:

Post a Comment