Wednesday, June 14, 2017

ప్రతి అణువులో ఆత్మగా జీవం ఉంటే

ప్రతి అణువులో ఆత్మగా జీవం ఉంటే
ప్రతి పరమాణువులో పరమాత్మగా సజీవం ఉంటే
ప్రకృతి పరంధామమే విశ్వం పరధ్యానమే జగతి జీవత్వమే  || ప్రతి అణువులో ||

అణువే ఆత్మ జ్ఞానమైతే పరమాణువే పరమాత్మ విజ్ఞానంగా తోచేనుగా
అణువే ఆకృతి ఐతే పరమాణువే వికృతి ఐతే  ప్రజ్ఞానంగా పరజ్ఞానమే

అణువులోనే జీవ భావ స్వభావాలు మహోదయ తత్వమై ఉదయించునే
పరమాణువులోనే సజీవ సూక్ష్మ స్వభావాలు మహా తత్వమై ప్రజ్వలించునే   || ప్రతి అణువులో ||

అణువులో జీవం అనుభవమైతే పరమాణువులో సజీవం సమన్వయ భావమే
అణువులో పరమాణువే పరధ్యానమైతే ఆత్మలో పరమాత్మయే పరలీనత్వమే

అణువుగా దర్శించే రూపం విజ్ఞానమైతే పరమాణువుగా వీక్షించే భావం ప్రజ్ఞానమే
అణువే అపురూపమైతే పరమాణువే స్వరూపమైతే ఆత్మ పరమాత్మ విశ్వ రూపమే   || ప్రతి అణువులో || 

No comments:

Post a Comment