Friday, June 16, 2017

కాలం ఆగని క్షణమై సమయం నిలవని భావమై

కాలం ఆగని క్షణమై సమయం నిలవని భావమై
జీవం తెలియని స్వభావమై రూపం ఎదగని దేహమై
విశ్వంతో పోరాటం దైవంతో ఆరాటం కలుగుతున్నదే  || కాలం ||

కాలం నీదని సాగినా సమయం ఏదో ఓ క్షణమున నిన్ను ఆపేనులే
దైవం నీదని వెళ్ళినా అధర్మం ఏ సందర్భమైన నిన్ను నిలిపేనులే

కాలం దైవం మన వెంటే ఉన్నా సమయం అధర్మం మన చుట్టూ ఆవహించునులే
కాలం దైవం మన తోనే ఉన్నా ఏ క్షణమైనా సందర్భం మన కోసం సంభవించేనులే   || కాలం ||

కాలంతోనే సాగినా మన సమయం ఎప్పటికైనా విశ్వ కాలాన్ని చేధించేనులే
సమయంతోనే సాగినా మన సందర్భం ఏ క్షణమైనా జీవ తత్వాన్ని మార్చేనులే

దైవమే కాలమై సందర్భం సమయస్ఫూర్తిగా సాగినా క్షణాలే అమృత కార్యమగునులే
క్షణాలే సమయమై దైవమే జీవత్వమై ఎదిగినా కాలమే అమోఘమై ప్రయాణించేనులే   || కాలం || 

No comments:

Post a Comment