ఏనాడు లేని ఆలోచన కలిగేను ఈనాడే నాలో
ఎక్కడ ఎవరికి లేని భావన తోచేను ఈనాడే నాలో
యదలోన కదిలే మదిలోన మొదిలే అనురాగ వేదం
తపించిపోతున్నది నేడే నా మనసున్న మేధస్సులో || ఏనాడు ||
హృదయానికే దూరం కంటికే చేరువై కనిపిస్తున్నదే నవ భావ దృశ్యం
మేధస్సుకే ఊహా చిత్రం ఆలోచనకే అలంకార రూపం నవ రస భరితం
ప్రకృతిలో పరవశించిపోయే జీవామృతం తపనంతో విహరిస్తున్నది
విశ్వ జగతిలో ఉప్పొంగిపోయే నాదామృతం విరహంతో గాలిస్తున్నది || ఏనాడు ||
విజ్ఞానమైన జీవన విధానం వేదాంతమైన జీవిత సవరణగా సాగుతున్నది
శాస్త్రీయమైన జీవన కవచం సిద్ధాంతమైన జీవిత రహస్యంగా వెళ్ళుతున్నది
వినయం ఎంతటి భావమో ఆలోచనకు అంతటి వేదనగా కలుగుతున్నది
పరువం ఎంతటి మోహమో వయస్సుకు అంతటి ఆత్రతగా తెలుస్తున్నది || ఏనాడు ||

No comments:
Post a Comment