ఏనాటిదో జననాల తరంతరం ఎంతవరకో జీవితాల తత్సంబంధం
ఎక్కడిదో జననాల ఉత్పన్నం ఎప్పటివరకో జీవితాల ఆత్మ బంధం
జీవన విధానంతో సాగే పరిణామమే జీవుల తత్సంగాల కాల పరిమాణం || ఏనాటిదో ||
ఉదయిస్తూనే జీవిస్తున్నాము అస్తమిస్తూనే ప్రయాణిస్తున్నాము
కార్యాలతో నిత్యం సాగుతున్నాము కాలంతో సర్వం శ్రమిస్తున్నాము
విజ్ఞాన వేదాలతో పరిశోధనం చేస్తూనే పరమార్థాన్ని గ్రహిస్తున్నాము
బంధాల భావాలతో అధ్యాయనం చేస్తూనే అర్థాన్ని గమనిస్తున్నాము || ఏనాటిదో ||
సాధనతో సాధించిన విజయాలను చాలకనే ఎన్నో నవ విషయాలను అన్వేషిస్తున్నాము
సాంకేతిక ప్రగతినే అధిరోహించినా సూక్ష్మ రూపాల కదలికలనే దివ్యంగా పరీక్షిస్తున్నాము
అనంతమైన విశ్వాన్ని అణువణువులుగా రకరకాలుగా ఉపయోగిస్తున్నాము
అపురూపమైన ప్రాంతాన్ని నిర్మాణాలతో ఎన్నో విధాలుగా ఆవహిస్తున్నాము || ఏనాటిదో ||

No comments:
Post a Comment