Showing posts with label దేశం. Show all posts
Showing posts with label దేశం. Show all posts

Wednesday, May 3, 2017

ఏది నీ దేశం ఏది మన దేశం

ఏది నీ దేశం ఏది మన దేశం
ఏది మన భావం ఏది మన తత్వం
మనలోనే విశ్వ గీతం మనలోనే జగతి పతాకం
మనమే చైతన్యం మనమే ఐక్యత చిహ్నం ఓ మానవా!  || ఏది నీ దేశం ||

మనిషిగా జీవించు మనస్సుతో జగతినే నడిపించు
మహర్షిగా దీవించు మనస్సుతో విశ్వాన్నే సాగించు

మనలోనే మాధవుడు మనలోనే మహాత్ముడు ఉదయిస్తున్నాడు
మనలోనే పరమాత్మ మనలోనే పరంధామ ఎదుగుతున్నాడు ఓ మానవా!  || ఏది నీ దేశం ||

దేశ దేశాలు తిరిగినా ప్రపంచమంతా విజ్ఞాన అన్వేషణయే
ఎన్ని రోజులు గడిచినా విశ్వమంతా విజ్ఞాన పరిశోధనయే

మనిషిలోనే సద్భావం మనలోనే మానవత్వం
మనిషిలోనే విజ్ఞానం మనలోనే పరిశుద్ధాత్మం ఓ మానవా!  || ఏది నీ దేశం ||

Friday, January 6, 2017

ఏ దేశం నీ దేశం ప్రతి దేశం ఓ ప్రదేశం

ఏ దేశం నీ దేశం ప్రతి దేశం ఓ ప్రదేశం
ప్రదేశమంతా మన ప్రపంచం అదంతా ఓ లోకం
లోకమంతా మన ప్రదేశం అదే మన దేశాల ప్రపంచం   || ఏ దేశం ||

దేశమే స్నేహితం ప్రదేశమే సన్నిహితం
లోకమే సత్యాంశం ప్రపంచమే సందేశం
దేశ విదేశమే ధర్మాంశం విజ్ఞానమే సంభోదితం
విశ్వ జగతియే మహా పవిత్ర ప్రదేశ విదేశ దేశం   || ఏ దేశం ||

దేశాలు ఐక్యమై విదేశాలు ఒక్కటై ప్రదేశమయ్యేను ఒక ప్రపంచం
ప్రదేశమంతా ప్రపంచ దేశాల ప్రాంతాల భూగోళ భూభాగాల లోకం
దేశాల ప్రదేశాలే వివిధ ఖండాల ప్రాంతాల ప్రపంచ దేశాల విశ్వం
ప్రకృతిలో ఒదిగిన అడవులు వనరులు సముద్రాలు భూస్థల ప్రదేశం  || ఏ దేశం ||

ఏ దేశమైన ఏ ప్రాంతమైన ఏ ప్రదేశమైన ఒకే రకమైన గాలి నీరు సూర్యోదయం
ఎక్కడైనా ఎవరైనా ఏ జీవమైనా జీవించే విధానం ఆహార నిద్రల కాల కార్యాక్రమం
ఎవరికైనా భావాలు తత్వాలు వేదాల విజ్ఞానం ఒకటిగా కలిగి సాగే శ్రమే పరమార్థం
జీవించే ప్రతి జీవి మరణించునని ఏ ప్రదేశమైన తెలిపే సామాన్య జీవన విధానం   || ఏ దేశం ||

Wednesday, December 14, 2016

మహాత్మవై ఎదగాలి మహర్షివై ఒదగాలి

మహాత్మవై ఎదగాలి మహర్షివై ఒదగాలి
పరమాత్మవై నిలవాలి పరంధామగా ఉండాలి
చిరంజీవివై జీవించాలి పరంజ్యోతిగా వెలగాలి  || మహాత్మవై ||

మహాత్మగా అవతరించి అవధూతగా నీవే మా లోకంలో ఎదగాలి
మహర్షిగా అధిరోహించి అవధానిగా నీవే మా విశ్వంలో ఒదగాలి
పరమాత్మగా ఉదయించి పరధ్యానంతో నీవే మా జగతిలో నిలవాలి

ఏ విశ్వ జగతి లోకంలో చూసినా నీవే మా మాధవ స్వరూపం    || మహాత్మవై ||

పరంధామగా నడిపించి పరజ్ఞానంతో నీవే మా మేధస్సులో ఉండాలి
చిరంజీవిగా అభ్యసించి చైతన్యంతో నీవే మా దేశంలో జీవించాలి
పరంజ్యోతిగా సాగించి పరతత్వంతో నీవే మా ప్రకృతిలో వెలగాలి

ఏ ప్రకృతి దేశంలో వెతికినా నీవే మా మేధస్సుకు విజ్ఞాన వేదం  || మహాత్మవై ||

Wednesday, November 30, 2016

ఓ దేశమా నీ ఎదుట నిలిచింది ప్రపంచమే

ఓ దేశమా నీ ఎదుట నిలిచింది ప్రపంచమే
విశ్వమే నీ దేశాన్ని చూపిస్తున్నది ఆకాశమై
సూర్యోదయంతో నీ లోకాన్ని వెలిగిస్తున్నది జగమే  || ఓ దేశమా ||

ప్రతి దేశం ఓ రూపం ప్రతి రూపం ఓ మహా భావం
ప్రతి భావం ఓ జీవం ప్రతి జీవం ఓ మహా దైవత్వం

దేశమే లోకమై ప్రపంచమే విదేశాల మహా సమూహమై జగమైపోయేను
పరదేశిగా ప్రవేశమై విదేశమే స్వదేశమై జనులతో నీవు స్థిరపడిపోయేను  || ఓ దేశమా ||

ప్రతి విశ్వం ఓ లోకం ప్రతి లోకం ఓ మహా నగర దేశం
ప్రతి దేశం ఓ ప్రదేశం ప్రతి ప్రదేశం ఓ మహా ప్రపంచం

దేశమే మహా జనులకు జీవమై లోకమే దేశానికి మహోదయమయ్యేను
విదేశమే ప్రజలకు స్నేహమై విశ్వమే ప్రపంచానికి నవోదయమయ్యేను  || ఓ దేశమా ||

Tuesday, November 8, 2016

ఎవరే నీవు ఎవరే అని అంటున్నది నా హృదయం

ఎవరే నీవు ఎవరే అని అంటున్నది నా హృదయం
ఎవరే నీవు ఎవరే అని అడుగుతున్నది నా మౌనం

మనస్సులో కలిగే భావాలకు నీవే ప్రతి రూపం
వయస్సులో తోచే భావాలకు నీవే ప్రతి నాదం   || ఎవరే నీవు ||

ప్రతి మాటలో నీ ప్రేమే పిలుస్తున్నది
ప్రతి బాటలో నీ భావమే కనిపిస్తున్నది

ఏ చోట ఉన్నా నీ ధ్యాసే ఏ క్షణమైనా నీ శ్వాసే నాలో
ఏనాటికైనా నీ వైపు నేనే ఏ చెంతనైనా నీ తోడు నేనే  

ఏ లోకమైన కనిపించేది నీవే పరలోకమైన వినిపించేది నీవే
ఏ విశ్వమైన చూపులకు నీవే ఏ జగమైన అలజడులకు నీవే  || ఎవరే నీవు ||

ఏ దేశమైన ప్రతి దేశం నా ప్రపంచంలోనే ప్రేమగా ఉంటుంది నీ దేహం
ఏ ప్రాంతమైన ప్రతి ప్రాంతం నా ప్రదేశంలోనే స్థిరమై పోతుంది నీ రూపం

సముద్రాల కెరటాలలో దాగిన అలల ప్రవాహం నీ కోసమే ఉప్పొంగేనే
నదుల ప్రవాహాలలో దాగిన నీటి ఊటలే నీ కోసమే ఉరకలు సాగించేనే  || ఎవరే నీవు ||

Thursday, September 15, 2016

అదిగదిగో ఆకాశం అదే మన దేశం

అదిగదిగో ఆకాశం అదే మన దేశం
కనిపించే మేఘాలే మన లోకం అదే మన ప్రపంచం || అదిగదిగో ||

ఉదయించే సూర్యునితో మేల్కోవడం
మెరిసే కిరణంతో విజ్ఞానం పొందడం
కదిలే మేఘాలతో ప్రయాణం విశ్వమంతా చుట్టడం
భూగోళమే భౌతికం భూలోకమే భువనం
భూమి భ్రమణమే భూతాంశ నియమం   || అదిగదిగో ||

ఆకాశంతో తిలకించడం మేఘాల భావాలతో వర్ణాలను దర్శించడం
అపురూపమైన ఆకార రూపాలను చూస్తూ మేఘాలతోనే సాగిపోవడం

కాలంతో ప్రయాణం అద్భుతమైన దృశ్య కావ్యం
స్థానికుల జీవన విధానం ఓ మహోత్తర విషయం
విజ్ఞానంతో సాగడం అనుభవానికి మహా దర్పణం
విశ్వాంతర విజ్ఞానం జీవితానికి నవోదయ కిరణం
నూతన సహాసం మరో అనుభావాన్ని చూసుకోవడం  || అదిగదిగో || 

Wednesday, September 14, 2016

స్వాతంత్య్రం వచ్చిందా స్వరాజ్యం ఇచ్చిందా

స్వాతంత్య్రం వచ్చిందా స్వరాజ్యం ఇచ్చిందా
సామ్రాజ్యం ఏర్పడిందా సంతోషం కలిగిందా
సమరం ఆగిందా సత్యం ధర్మం నడిచిందా  
శతాబ్దాల పరిపాలన ప్రభుత్వం మారిపోయిందా  || స్వాతంత్య్రం ||

జయమే మనదై దేశమే సగర్వమై నిలిచిందా
ధైర్యమే గర్వించేలా మన దేహమే పోరాడిందా
రణ రంగం ముగిసేలా ఆక్రమణ ఆగిపోయిందా
శత్రుత్వం నశించేలా మిత్ర భావం కలిసిందా

హితమేదో తెలిసిందా స్థానిక బలమెంతో గుర్తించిందా || స్వాతంత్య్రం ||

ఎవరికి వారు స్వేఛ్ఛా జీవితాన్ని ఆరంభించారా
ఎవరికి ఎవరో మనకు బంధాన్ని కలిగించారా
ఎవరున్నా లేకున్నా మన జీవనాన్ని సాగించారా
ఎవరో వచ్చి పోయినా మన కుటుంబాన్నే మిగిలించారా

మనదే దేశం మనదే లోకం మనమే ముందుకు సాగేదం
మనలో చైతన్యం మనమే సమూహం మనతోనే సహాసం || స్వాతంత్య్రం ||