Showing posts with label పరమేశ్వర. Show all posts
Showing posts with label పరమేశ్వర. Show all posts

Monday, August 8, 2016

బ్రంహ విష్ణు పరమేశ్వర రూపాలే జీవుల ప్రతి రూపాలు

బ్రంహ విష్ణు పరమేశ్వర రూపాలే జీవుల ప్రతి రూపాలు
ఆత్మ మహాత్మ పరమాత్మ తత్వాలే జీవుల భావ స్వభావాలు  || బ్రంహ ||

ప్రతి జీవిలో ఉదయించే జీవం శ్వాసగా జన్మించునే
ప్రతి రూపంలో కనిపించే తత్వం ధ్యాసగా తోచేనులే

జీవించుటలో కర్త కర్మ క్రియలు మన జీవితానికి సోపానాలు
ఎదుగుటలో భావ స్వభావ తత్వాలు మన జీవనానికి వేదాలు  || బ్రంహ ||

ప్రకృతియే ప్రత్యక్ష దైవంగా బ్రంహ విష్ణు మహేశ్వరులే పరమావధిగా
విశ్వమే జగతికి లయముగా పంచభూతములే పరిశోధన జీవములుగా

మాతృత్వంతో జన్మనిచ్చే మాతా రూపమే బ్రంహ విష్ణు మహేశ్వర రూపాలుగా
మధురంతో అమృతాన్ని పంచే దైవ స్వరూపమే ఆత్మ మహాత్మ పరమాత్మంగా  || బ్రంహ ||