Showing posts with label మహోదయం. Show all posts
Showing posts with label మహోదయం. Show all posts

Wednesday, August 17, 2016

అప్పుడెప్పుడో కలిగిన పడమటి సంధ్యా రాగం

అప్పుడెప్పుడో కలిగిన పడమటి సంధ్యా రాగం
ఇప్పుడిప్పుడే తోచిన ఉత్తరవాణి గానాల గీతం
వెలిగే వైశాఖం పెరిగే పేరంటం మనలో సంగీతం || అప్పుడెప్పుడో ||

కోకిల పాడే నవ వసంతం రాగాల స్వర గీతం
కోకిల కూసే నవ రాగం స్వరాల సుస్వరాగం

కొమ్మ కొమ్మలలో దాగి చాటున పాడే కోకిలల రాగాలే పేరంటం
చెట్టు చెట్టున చేరి చలాకిగా పాడే కోకిలల స్వరాగాలే సంగీతం    || అప్పుడెప్పుడో ||

ఎప్పటికైనా ఒకే రాగం స్వరాగాలలో మహా వేదం మేధస్సుకే మహనీయం
ఏనాటికైనా ఒకే గీతం సంగీతాలలో మహా జీవం హృదయానికే వైభోగ రాగం

భావాలతో పాడే నవ జీవన రాగం సంధ్య వేళ శుభోదయం
మాటలతో సాగే నవ జీవత వేదం గానంతో సాగే మహోదయం  || అప్పుడెప్పుడో || 

Friday, July 15, 2016

మాత్రోదయం ఒక జీవోదయం


మాత్రోదయం ఒక జీవోదయం
మహోదయం ఒక సూర్యోదయం  

ప్రతి జీవిలో తొలి భావమే శుభోదయం
ప్రతి జీవికి మాతృ తత్వమే నవోదయం   || మాత్రోదయం ||

సూర్యునితో లోకమంతా తేజోదయం
ఆకాశంలో మేఘాలన్నీ సువర్ణోదయం

జీవంతో జన్మించే ప్రతి జీవికి శుభోదయం
భావంతో జీవించే ప్రతి జీవికి మాత్రోదయం

నవోదయం శుభోదయం అంటున్నది ఒక జీవోదయం
సర్వోదయం విశ్వోదయం అనిపించెను ఒక తేజోదయం  || మాత్రోదయం ||

జీవంతో ఆరంభమే ఆత్మోదయం
జన్మతో ప్రారంభమే జీవోదయం

ఎదిగే ప్రతి జీవిలో నవోదయం
ఒదిగే ప్రతి దేహంలో వర్ణోదయం

ఉదయించే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలకు మహోదయం
జ్వలించే విశ్వానికి గ్రహాలతో సాగే జగతికి సూర్యోదయం  || మాత్రోదయం ||