Friday, January 19, 2018

ఏనాటిదో రూపం ఏనాటిదో దేహం

ఏనాటిదో రూపం ఏనాటిదో దేహం
సూర్యోదయాన విశ్వ తేజమై ఉదయిస్తున్నది

ఏనాటిదో జీవం ఏనాటిదో దైవం
సూర్యోదయాన దివ్య సువర్ణాలతో జీవిస్తున్నది  || ఏనాటిదో ||

విశ్వ తేజమై కనిపించే రూపం దివ్య వర్ణమై కనిపించే దేహం
దైవ భావమై దేహ తత్వమై వెలుగుతున్నది సౌందర్య జీవం

విశ్వమంతా ఆవహించిన రూపం జగమంతా విస్తరించిన దేహం
ఆకాశమంతా కనిపిస్తూనే లోకమంతా దివ్యానంద సువర్ణాల దర్శనం  || ఏనాటిదో ||

రూపంలోనే ఉంది చలనం దేహంలోనే ఉంది గమనం
జీవంలోనే ఉంది ప్రయాణం దైవంలోనే ఉంది మననం

సూర్య తేజమే ఆ రూపం సూర్య కిరణమే ఆ దేహం
సూర్య ప్రజ్వలమే ఆ జీవం సూర్య ప్రకాశమే ఆ దైవం  || ఏనాటిదో || 

Thursday, January 18, 2018

ఏ జీవం లేదు ఏ దైవం లేదు

ఏ జీవం లేదు ఏ దైవం లేదు
ఏ రూపం లేదు ఏ దేహం లేదు
ఏ భావం లేదు ఏ తత్వం లేదు

మరణమే ఉందని అనంతం మౌనమే ఆవహించేను  || ఏ జీవం ||

మేధస్సులో సమస్తం శూన్యం దేహంలో జీవం శూన్యం
ఆలోచనలో గమనం మౌనం చలనంలో దేహం శిథిలం

కాలంతో రూపం రహితం సమయంతో దైవం ఆవహం
కాలంతో సర్వం శూన్యం సమయంతో సత్యం అంతం 

మనస్సుతో జీవితం సంక్షయం వయస్సుతో జీవనం సంక్షోభం
మనస్సులో సమస్తం నాశనం వయస్సులో అనంతం ప్రమాదం  || ఏ జీవం ||

కార్యాలతో కాలం కఠినం బంధాలతో సమయం స్వల్పం
రూపాలతో కాలం కదనం దేహాలతో సమయం విధ్వంసం

కార్యాలతో సర్వం విఫలం అజ్ఞానంతో సర్వం వినాశనం
కాలంతో నిత్యం ప్రళయం సమయంతో నిత్యం ప్రక్షయం

అజాగ్రతతో సర్వం వికారం అజ్ఞానంతో సర్వం పతనం
అజాగ్రతో నిత్యం విఘాతం అజ్ఞానంతో నిత్యం ప్రగాఢం  || ఏ జీవం ||

సూర్యుడే ప్రతి జీవికి జీవితం సూర్యుడే ప్రతి జీవికి జీవనం

సూర్యుడే ప్రతి జీవికి జీవితం సూర్యుడే ప్రతి జీవికి జీవనం
సూర్యుడే ప్రతి జీవికి ఉత్తేజం సూర్యుడే ప్రతి జీవికి ప్రతేజం

సూర్యుడే జగతికి ఆదర్శం సూర్యుడే ప్రకృతికి ఆధారం
సూర్యుడే లోకానికి ప్రజ్వలం సూర్యుడే విశ్వానికి ప్రబలం  || సూర్యుడే ||

సూర్యోదయమే కార్యాచరణం సూర్యాస్తమయమే కార్యాగమనం
సూర్యోదయమే కార్యాచలనం సూర్యాస్తమయమే కార్యాగమ్యం

సూర్యుడే మేధస్సుకు మహా తేజం సూర్యుడే ఉచ్చ్వాసకు మహా దైవం
సూర్యుడే భావనకు మహా సుందరం సూర్యుడే తత్వనకు మహా సుమం  || సూర్యుడే ||

సూర్యోదయమే కార్యాధర్మం సూర్యోదయమే కార్యాసత్యం
సూర్యోదయమే కార్యారూపం సూర్యోదయమే కార్యాబంధం

సూర్యుడే జగతికి నిత్యం జీవం సూర్యుడే విశ్వతికి సర్వం రూపం
సూర్యుడే ప్రకృతికి సహ భావనం సూర్యుడే దైవతికి సహ తత్వనం  || సూర్యుడే || 

Wednesday, January 17, 2018

గుర్తించలేదా విశ్వ కవిని గమనించలేదా తెలుగు కవిని

గుర్తించలేదా విశ్వ కవిని గమనించలేదా తెలుగు కవిని
స్మరించలేదా జీవ కవిని పలికించలేదా తెలుగు కవిత్వాన్ని

నీయందే ఉన్నది విశ్వ కవి గీతం నీలోనే ఉన్నది తెలుగు కవి గానం
నీతోనే ఉన్నది విశ్వ కవి భావనం నీలోనే ఉన్నది తెలుగు కవి గాత్రం  || గుర్తించలేదా ||

మరచిపోలేని జ్ఞాపకాల కవిత్వాలు విజ్ఞానమే తెలిపేను నిత్యం
మరణింపలేని వేదాల కవిత్వాలు ప్రజ్ఞానమే తెలిపేను సర్వం

తెలుగు కవి విజ్ఞాన భావాలలో వేదాల వేదాంతం మహా గమన సిద్ధాంతం
తెలుగు కవి ప్రజ్ఞాన తత్వాలలో భావాల అనుభవం మహా స్మరణ శాస్త్రీయం  || గుర్తించలేదా ||

తెలుగు బంధాలకు తేనీయ వచనమే విజ్ఞాన పరిశోధనం
తెలుగు స్నేహాలకు తెలుపు రచనమే ప్రజ్ఞాన అన్వేషణం

తెలుగు భావాలకే తెలిసేను కవి చిత్ర వర్ణన రూప సౌందర్య సుగంధం
తెలుగు తత్వాలకే తెలిసేను కవి మిత్ర గమన జీవ సౌభాగ్య సుందరం  || గుర్తించలేదా ||

Tuesday, January 16, 2018

ఏనాటిదో తెలుగు ఏనాటిదో వెలుగు

ఏనాటిదో తెలుగు ఏనాటిదో వెలుగు
ఎక్కడిదో తెలుగు ఎక్కడిదో వెలుగు

తెలుగు తేజమై తెలుగు విశ్వమై తెలుగు చంద్రమై తెలుగు బీజమై
ఏనాటి నుండి ఏనాటి దాక సాగుతున్నదో అలుపెరుగని కమ్మన్నైనా తెలుగు  || ఏనాటిదో ||

తెలుగు మంత్రమో తెలుగు తంత్రమో తెలుగు యంత్రమో
తెలుగు పదాల తేనీయంతో తెలిసిందిలే తెలుగు తత్వము

తెలుగు బంధమో తెలుగు జీవమో తెలుగు భావమో
తెలుగు వేదాల అనుభవంతో తెలిసిందిలే తెలుగు తత్వము  || ఏనాటిదో ||

తెలుగు రాగమో తెలుగు గానమో తెలుగు గీతమో
తెలుగు స్వరాల సంగీతంతో తెలిసిందిలే తెలుగు తత్వము

తెలుగు సత్యమో తెలుగు నిత్యమో తెలుగు దైవమో
తెలుగు ధర్మాల హితంతో తెలిసిందిలే తెలుగు తత్వము  || ఏనాటిదో || 

Thursday, January 4, 2018

అద్భుతమే మహా రథోత్సవం

అద్భుతమే మహా రథోత్సవం
ఆనందమే బహు జన చైతన్యం
ఆరోగ్యమే సర్వ కార్య ఐశ్వర్యం

అనుభవాల జీవితంలో అనుబంధమే అమోఘం
అనురాగాల జీవనంలో ఆడంబరమే అపురూపం  || అద్భుతమే ||

బంధాలతో సాగే ఉత్సవం బహు జన సమ్మేళన చైతన్యం
భావాలతో సాగే మహోత్సవం మహా జన సమీక్ష సందేశం

వేదాలతో సాగే హితోపదేశం మహా ఆనంద విజ్ఞాన భరితం
ధర్మాలతో సాగే సత్యోపదేశం మహా సుగుణ ప్రజ్ఞాన చరితం  || అద్భుతమే ||

ఆశ్చర్య చిత్ర నిర్మాణ రూపాల అద్భుతమే మేధస్సుకు మహా అద్భుతం
ఆనంద వర్ణ అలంకార రూపాల ఆవిష్కరణమే ఆలోచనకు మహా సుందరం

ఉత్సవాల కలయికల సంబరమే ఆరోగ్య పర్యావరణ ప్రకృతి ప్రావీణ్యం
మహోత్సవాల బహు సంభాషణమే ఆనంద తాత్విక విశ్వతి పవిత్రతం  || అద్భుతమే || 

Monday, January 1, 2018

జీవమే భావము

జీవమే భావము
దేహమే తత్వము

రూపమే వేదము
బంధమే జ్ఞానము

దైవమే ధర్మము
కాలమే ప్రయాణము  || జీవమే ||

జీవితం ఒక పరిశోధనం
జీవనం ఒక అనుభవం

కాలంతో సాగే జీవితం మహా మధుర అనుభవం
జీవంతో సాగే జీవనం మహా మనోహర పరిశోధనం  || జీవమే ||

జీవితం ఒక నిదర్శనం
జీవనం ఒక సుదర్శనం

దేహమెంత గొప్పదో దైవమే తెలిపిన మహా గుణ ధర్మం
రూపమెంత చిత్రమో బంధమే చూపిన మహా కళ వేదం  || జీవమే ||