Saturday, August 4, 2018

విశ్వం నుండే జగతికి మాతృ భావమై వచ్చావా సుమతి

విశ్వం నుండే జగతికి మాతృ భావమై వచ్చావా సుమతి
శూన్యం నుండే విశ్వతికి పితృ తత్వమై ఉన్నావా మహతి

పర లోకాల నుండే ప్రకృతికి పరంధామవై నిలిచావా అమరావతి
ఘన లోకాల నుండే జగతికి పరమాత్మవై జన్మించావా అరుంధతి   || విశ్వం ||

మాతృత్వ భావాల ప్రేమతి మమతాను రాగాల స్రవంతి
జీవిత బంధాల జయంతి జీవన స్వరూపాల సంస్కృతి

సంగీత సరిగమల సాహితి విజ్ఞాన వేదాల సరస్వతి
సువర్ణ మధురాలా సంపతి సుగంధ మోహాల మాలతి   || విశ్వం ||

అనంత గుణాల ఆద్యంతి అఖండ తత్వాల ప్రణతి
నదుల సంగముల తపతి  సాగర ప్రవాహాల సమ్మతి

అమోఘ కార్యాల భూపతి ఆవర్ణ రూపాల ఆకృతి
ఆనంద స్నేహాల దేవతి ఐశ్వర్య కాంతుల ఇరావతి   || విశ్వం ||

ఎటు చూసినా నీవే ఎటు వెళ్ళినా నీవే దేవా!

ఎటు చూసినా నీవే ఎటు వెళ్ళినా నీవే దేవా!
ఎటు తలచినా నీవే ఎటు మలచినా నీవే దేవా!

ఏది పలికినా నీవే ఏది పిలిచినా నీవే దేవా!
ఏది అడిగినా నీవే ఏది కలిగినా నీవే దేవా!

సర్వం నీవే భూతం నిత్యం నీవే పంచభూతం దేవా!
దైవం నీవే తారకం దివ్యం నీవే దశావతారకం దేవా!   || ఎటు ||

విశ్వమై వచ్చావు జగమై వెలిశావు మేఘమై కురిశావు నీవే
దేహమై వచ్చావు ధర్మమై వెలిశావు ఆత్మమై వెలిగావు నీవే

శాంతమై ఉన్నావు ప్రశాంతమై కదిలావు తేజమై చలించావు నీవే
మౌనమై ఉన్నావు భావనమై కదిలావు ప్రజ్వలమై ప్రకాశించావు నీవే   || ఎటు ||

తత్వమై ఎదిగావు దివ్యమై ఒదిగావు మూలమై నిలిచావు నీవే
శ్వాసవై దాగావు ఉచ్చ్వాసవై వస్తావు నిశ్శబ్దమై చలిస్తావు నీవే

అణువై జన్మించావు పరమాణువై ఉద్భవించావు జీవమై అధిరోహించావు నీవే
ఆకారమై వరించావు అపురూపమై ధరించావు అవధానమై ఆదర్శించావు నీవే   || ఎటు ||

Friday, June 29, 2018

ఎంతటి భాగ్యమో మానవ జీవితం

ఎంతటి భాగ్యమో మానవ జీవితం
ఏనాటి బంధమో మానవ జననం
ఎలాంటి యోగమో మానవ జాగృతం

ఎంతెంత సౌభాగ్యమో మానవ దేహానికి విశ్వతి మందిరం
ఎంతెంత సౌఖ్యమో మానవ మేధస్సుకు ప్రకృతి విజ్ఞానం  || ఎంతటి ||

ఎంతటి రూపమో ఏనాటి నిర్మాణమో ఎలాంటి శాస్త్రమో
ఎక్కడి ప్రదేశమో ఏ వేద విజ్ఞానమో ఎందుకో అద్భుతమో

ఆశ్చర్యాల అద్భుత ఆకార వర్ణ గంధాలు అతిశయమే
శాస్త్రీయ సాంకేతిక నైపుణ్య లిపి శిల్పాలు అమోఘమే  || ఎంతటి ||

బంధాలతో సాగే తరతరాల యుగాలు యోగాల అనురాగమే
అందాలతో కలిగే సౌందర్యాల సుగంధాలు భోగాల సౌఖ్యమే

ఆకారాలతో సమకూర్చే రూపాల ఆకృతులు ఆశ్చర్యమే
సువర్ణాలతో పొదిగించే చేనేత కళా కృతులు అద్భుతమే  || ఎంతటి ||

ఏ శ్వాసతో ఉన్నావో ఏ ధ్యాసతో ఉన్నావో

ఏ శ్వాసతో ఉన్నావో ఏ ధ్యాసతో ఉన్నావో
ఏ భాషతో ఉన్నావో ఏ ఉషస్సుతో ఉన్నావో

ఆలోచనలో భావమే లేదు ఆకారంలో తత్వమే లేదు
దేహములో వేదమే లేదు మేధస్సులో విజ్ఞానమే లేదు  || ఏ శ్వాసతో ||

ఉచ్చ్వాసలో గమనం లేదే ధ్యాసలో చలనం లేదే
స్వభాషలో ఉచ్చారణ లేదే ఉషస్సులో స్ఫూర్తి లేదే

ఆలోచనలో అవగాహన లేదే ఆకారంలో ఆకృతి లేదే
దేహంలో దైవత్వమే లేదే మేధస్సులో మనోజ్ఞత లేదే  || ఏ శ్వాసతో ||

విశ్వమే లేని శ్వాస జగమే లేని ధ్యాస మలినమే
లౌక్యమే లేని భాష ఉన్నతి లేని ఉషస్సు శూన్యమే

భావమే లేని భోగం తపనమే లేని తత్వం ఎందుకో
యోగమే లేని యాగం వేదమే లేని విజ్ఞానం ఎవరికో  || ఏ శ్వాసతో || 

Wednesday, May 23, 2018

జన్మించరా జగతిలా

జన్మించరా జగతిలా
జీవించరా చిరంజీవిలా
జయించరా జగదేకవీరుడిలా

మానవుడే మాధవుడిలా స్పందించేనురా  || జన్మించరా ||

ఉదయించే సూర్యుడే నీకు సద్గురువురా
అస్తమించే సూర్యుడే నీకు సన్నిహితుడురా

అధిరోహించే కిరణమే నీకు ఉత్తేజమురా
ఆవహించే ప్రజ్వలమే నీకు సహనమురా  || జన్మించరా ||

మాతృత్వమే అమృతత్వమై జన్మించునురా
పితృత్వమే  తన్మయతత్వమై జీవించునురా

ఆచార్యత్వమే విజ్ఞాన వేదత్వమై జయించునురా
దైవత్వమే విశ్వామృత సత్యత్వమై జపించునురా  || జన్మించరా || 

Sunday, May 6, 2018

నీ శ్వాసలో నా ఉచ్చ్వాస జీవించునా

నీ శ్వాసలో నా ఉచ్చ్వాస జీవించునా
నీ ధ్యాసలో నా ఆలోచన గమనించునా

నీ దేహంలో నా చలనం స్పందించునా
నీ రూపంలో నా భావనం అన్వేషించునా

నీవెక్కడున్నా నా తపనం నీ చెంతనే
నీవెలావున్నా నా సమయం నీ కోసమే    || నీ శ్వాసలో ||

ఎందరో జీవిస్తూ ఉన్నారు మరెందరో మరణించి వెళ్ళారు
ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటారు మరెందరో ఎక్కడికో వెళ్తారు

ఉన్నవారి కోసం మీతో పర ధ్యాసతో జీవిస్తూ ఉన్నాను
ఐనవారి కోసం నాలో పర ధ్యానమే చేస్తూనే ఉంటాను    || నీ శ్వాసలో ||

మీ శ్వాసలో ఉచ్చ్వాస జీవమై మీ ధ్యాసలో వేదాంత విజ్ఞానమై
ఏనాటికైనా అనుబంధమై నీ వారిని కలుపుటకే జీవిస్తున్నాను

ఆరోగ్యం కోసమే మీతో పర శ్వాసనై విజయం కోసమే మీతో పర ధ్యాసనై
నిత్యం జ్ఞాపకాలతో ఆలోచనల ప్రేమ తత్వాలతో పర దేహమై ఉన్నాను   || నీ శ్వాసలో ||

మాతృ శ్వాసతో పితృ ధ్యాసతో

మాతృ శ్వాసతో పితృ ధ్యాసతో
జీవ బంధంతో దైవ నిర్ణయంతో

ఉదయించాను మహా రూపంతో
ఎదుగుతున్నాను కాల భావంతో   || మాతృ ||

ఆత్మగా ఉన్నానో పరమాత్మగా ఉంటానో
ప్రకృతిలో ప్రదేశమై కలిసి ఉంటున్నాను 

సువర్ణమై ఉన్నానో సుగంధమై ఉంటానో
రూపాలలో ఆకారమై కలిసి ఉంటున్నాను   || మాతృ ||

మహాత్మనై ఉన్నావో మహర్షినై ఉంటానో
మహానుభావుల మహాజనకుడిగా ఉంటున్నాను

పుష్పమై ఉన్నానో పత్రమై ఉంటానో
వేదాల విశ్వమై విజ్ఞానంతో ఉంటున్నాను   || మాతృ ||

భావంతో ఉన్నానో తత్వంతో ఉంటానో
స్వచ్ఛమైన స్పందనతో ఉంటున్నాను

యోగంతో ఉన్నానో భోగంతో ఉంటానో
సమయమైన కాలంతో కలిసి ఉంటున్నాను   || మాతృ ||