Tuesday, October 30, 2018

ఆభరణం ధరించవా శంకరా ... !

ఆభరణం ధరించవా శంకరా ... !
ఆభరణం వరించవా శంకరా ... !

ఆభరణం లేని భరణం నటనకు మరణం
ఆభరణం లేని భరణం నటులకు చరణం

నీ ఆభరణమే నటనకు ఓంకార శంకరాభరణం
నీ ఆదరణమే నటులకు శ్రీకార శంకరాభరణం  || ఆభరణం ||

నీవు భరించిన భావాలే విశ్వానికి ఆభరణం
నీవు త్యజించిన తత్వాలే జగతికి ఆభరణం

నీవు ధరించిన ఆభరణమే శంకరాభరణం
నీవు వరించిన ఆభరణమే శంకరాభరణం  || ఆభరణం ||

నీవు పలికిన శృతులే సంగీత సాహిత్య భరణాల శంకరాభరణం
నీవు తలిచిన స్వరాలే సంగీత పాండిత్య భరణాల శంకరాభరణం

నీవు గమనించిన గమకాలే లోకానికి ఆభరణాల శంకరాభరణం
నీవు రచించిన రచనాలే కైలాసానికి ఆభరణాల శంకరాభరణం  || ఆభరణం || 

జ్ఞానమే ఆత్మ పరమాత్మగా ఉదయించేనా

జ్ఞానమే ఆత్మ పరమాత్మగా ఉదయించేనా
వేదమే జ్యోతి పరంజ్యోతిగా అధిరోహించేనా

మేధస్సులో ఆత్మ జ్యోతియే ఉజ్జ్వల తేజస్సుతో ప్రకాశించేనా   || జ్ఞానమే ||

విశ్వ విజ్ఞానమే అన్వేషించగా ఆత్మ జ్ఞానమే ఉదయించేనా
దైవ వేదాంతమే పరిశోధించగా జ్యోతి జ్ఞానమే ఉదయించేనా

సర్వ వేదములు పఠించగా పర జ్ఞానమే అధిరోహించేనా
సర్వ జీవములు జీవించగా సర్వ జ్ఞానమే అధిరోహించేనా   || జ్ఞానమే ||

అనంత భావాల స్వభావాలే విశ్వ వేదాలై జగతిలో అవతరించేనా
అనంత తత్వాల జీవత్వాలే వేద జ్ఞానమై ప్రకృతిలో అవతరించేనా

విజ్ఞాన జ్యోతులు అనంత ప్రకాశవంతమై మేధస్సులలో ప్రకాశించేనా
విజ్ఞాన కాంతులు అనంత ప్రతేజవంతమై శిరస్స్సులలో ప్రకాశించేనా   || జ్ఞానమే ||

Thursday, October 18, 2018

నా దేహములోనే అనంత జీవములు జీవిస్తున్నాయి

నా దేహములోనే అనంత జీవములు జీవిస్తున్నాయి
నా మేధస్సులోనే సర్వాంత జీవములు ఉదయిస్తున్నాయి

నా రూపములోనే సకల జీవరాసులు నిర్మితమైనాయి
నా ఆకారములోనే సకల జీవరాసులు నిర్ణీతమైనాయి   || నా దేహములోనే ||

జీవములన్నీ ఒకటేనని దేహములోనే జీవమై జీవిస్తున్నాయి
దేహములన్నీ ఒకటేనని మేధస్సులోనే జ్ఞానమై ఉదయిస్తున్నాయి

రూపాల ఆకారాలలోనే అనంత భావాలు నిర్మితమై ఉన్నాయి
సుగంధాల వర్ణాలలోనే సర్వాంతర తత్వాలు నిర్ణీతమై ఉన్నాయి  || నా దేహములోనే ||

ఆత్మ పరమాత్మలోనే పరిశోధన ప్రభావాలు పరిశీలనమై ఉన్నాయి
జ్యోతి పరంజ్యోతిలోనే పరిపూర్ణ ప్రాకారాలు పరిశుద్ధనమై ఉన్నాయి

జ్ఞాన విజ్ఞానములోనే ప్రజ్ఞాన ప్రబంధకాలు పరిజ్ఞానమై ఉన్నాయి
శాస్త్ర సిద్ధాంతములోనే శాస్త్రీయ పరిష్కారాలు సృస్టీకరణమై ఉన్నాయి  || నా దేహములోనే || 

Thursday, October 11, 2018

ప్రతి జీవి శూన్యం నుండే ఉదయిస్తుంది

ప్రతి జీవి శూన్యం నుండే ఉదయిస్తుంది
ప్రతి అణువు శూన్యం నుండే ఉదయిస్తుంది

జీవుల మరణం శూన్యమై అంతరిస్తుంది
అణువుల నాశనం శూన్యమై అంతరిస్తుంది

సృష్టిలో అనంతము అంతరించే కాలం అనంతమై సాగుతున్నది  || ప్రతి జీవి ||

అంతరించే జీవములు మరో జీవములను సృష్టిస్తూనే సాగిపోతున్నాయి
అంతరించే అణువులు మరో అణువులను సృష్టిస్తూనే సాగిపోతున్నాయి

ప్రకృతియే కాలంతో అణువులను జీవములను సృష్టిస్తూ అంతరింపజేస్తున్నాయి
మేధస్సే కార్యాలతో అణువులను జీవములను సృష్టిస్తూ అంతరింపజేస్తున్నాయి   || ప్రతి జీవి ||

అనంతమే శూన్యమయ్యేలా కాలమే సాగుతూ అణువుల ఉత్పత్తితో కొనసాగుతున్నాయి 
అనంతమే శూన్యమయ్యేలా కాలమే సాగుతూ జీవముల ఉత్పత్తితో కొనసాగుతున్నాయి

అంతరిస్తున్న అణువులు మరో అణువులను సృష్టిస్తూనే కాలంతో సాగుతున్నాయి
అంతరిస్తున్న జీవములు మరో జీవములను సృష్టిస్తూనే కాలంతో సాగుతున్నాయి   || ప్రతి జీవి ||

Wednesday, September 19, 2018

ఏనాడు మొదలైనదో ప్రశ్న ఇప్పటికి తెలియని విధమై సాగుతున్నది

ఏనాడు మొదలైనదో ప్రశ్న ఇప్పటికి తెలియని విధమై సాగుతున్నది
ఎందుకు మొదలైనదో ప్రశ్న ఎప్పటికి తెలియని తనమై సాగుతున్నది

ప్రశ్నలతోనే సాగే రోజుల జీవితం సమస్యల తీరుగా వెళ్ళే కాలం
ప్రశ్నలతోనే సాగే రోజుల జీవనం విచారాల బారుగా సాగే సమయం  || ఏనాడు ||

విజ్ఞానులైనా సమస్యలను సృష్టిస్తూనే ఉంటారు
వేదాంతులైనా సమస్యలను చూస్తూనే ఉంటారు

సమస్య కానిదైనను సమస్యగా తెలుపుతూనే ఉంటారు
సమస్య లేకున్నను సమస్యగా మార్చుతూనే ఉంటారు   || ఏనాడు ||

అర్థం లేనిదైనను అలవాటుగా ప్రశ్నలతో సమస్యలుగా మార్చెదరు
అవసరం కానిదైనను మోహంగా ప్రశ్నలతో సమస్యలుగా చూపెదరు

పరిష్కారం తెలిసే వరకు ఆగలేక సమస్యను ప్రశ్నలతో విసిగించెదరు
పరిష్కారం కలిగే వరకు ఓర్వలేక సమస్యను ప్రశ్నలతోనే వేగించెదరు   || ఏనాడు ||

విచారణలో వివరణ లేకుండానే సమస్యను మరో ప్రశ్నలతో ముగించెదరు
విశ్లేషణలో ప్రాధాన్యత లేకుండానే సమస్యను మరో ప్రశ్నలతో పెంచెదరు

అవసరం లేనివారికి అవసరం అన్నట్లు ఎన్నో సమస్యలను కల్పిస్తుంటారు
అవసరం ఉన్నవారికి అవసరం లేనట్లు ఎన్నో సమస్యలను కల్పుతుంటారు   || ఏనాడు ||

జన్మించడమే ప్రశ్నల వలయంగా సాగే సమస్యల రహదారి ప్రయాణం
జీవించడమే ప్రశ్నల ప్రళయంగా మారే సమస్యల పరదారి పరిశోధనం

ఎదురుగా వచ్చే సమస్యల ప్రశ్నలకు ఎరుకగా నిలిచేదే జీవితం
అకస్మాత్తుగా కలిగే సమస్యల ప్రశ్నలకు సాధనగా సహించేదే జీవనం   || ఏనాడు || 

ప్రాణం ఉన్నంతవరకు ఏదైనా కావాలని తెలిపేదే మేధస్సు

ప్రాణం ఉన్నంతవరకు ఏదైనా కావాలని తెలిపేదే మేధస్సు
ఆలోచన ఉన్నంతవరకు ఏ కోరికనైనా కలిగించేదే మనస్సు

మేధస్సులోని ఆలోచన మనస్సులోని కోరిక ఎదిగే వయస్సు
ఆయుస్సులోని వేదన మనస్సులోని మోహన ఒదిగే వయస్సు

కాలమంతా అనంతమైన ఆలోచనలతో సాగే మోహన కోరికల శిరస్సు  || ప్రాణం ||

కోరికల ఆలోచనలతో మనస్సు ఎదుగుతూనే సాగేను వయస్సు
భావాల ఆలోచనలతో వయస్సు ఒదుగుతూనే సాగేను మనస్సు

తత్వాల తపనంతో తన్వయం చేసేదే వలపుల వయస్సు
భావాల తహనంతో తన్మయం చేసేదే మమతల మనస్సు   || ప్రాణం ||

అంతమే లేని ఆలోచనలకు విజయమే లేదు చివరి వరకు అన్నదే తపస్సు
శూన్యమే లేని ఆలోచనలకు విశ్రాంతియే లేదు తుది వరకు అన్నదే తేజస్సు

కాలంతో కలిగే భావాల స్వభావాలను మార్చేను మనలోని వేదాల ఛందస్సు 
సమయంతో వచ్చే తత్వాల తపనాలను దాచేను యదలోని నాదాల సరస్సు   || ప్రాణం ||

ఎప్పటికి చెదరని మనస్సు మోహనాల మననం మేధస్సు 
ఎన్నటికి కుదరని వయస్సు నవ కోరికల గమనం శిరస్సు

అన్వేషణతో సాగే తెలియని వేదాల ఆలోచనల అనంత నాభమే మేధస్సు
సంభాషణతో సాగే తెలుపని జ్ఞానుల ఆలోచనల సర్వాంత చిత్రమే శిరస్సు   || ప్రాణం ||

Saturday, September 15, 2018

శోధన పరిశోధన చేసుకో నీలోనే అన్వేషణ

శోధన పరిశోధన చేసుకో నీలోనే అన్వేషణ
వేదన ఆవేదన సరిచేసుకో నీలోనే ఆలోచన

సంఘటనలతో నీవు విచారమా సమస్యలతో నీవు విషాదమా
వేదాలతో నీవు వేదాంతమా బంధాలతో నీవు అనుబంధమా

సాధనాలతో పరిష్కారాలను ప్రయోజనం చేసుకో మిత్రమా  || శోధన ||

సమాజంతో సంక్షోభమా సంఘటనలతో సంతాపమా
సమస్యలతో సంశయమా సంఘాలతో సంభావనమా 

విఘ్నాలతో వితండమా విషయాలతో విఫలమా
విభేదాలతో విచారణమా విధానాలతో విన్నపమా  || శోధన ||

పరిచయాలతో పరిశోధనమా పరిణామాలతో పరిశుద్ధమా
ప్రశ్నలతో ప్రత్యామ్నాయమా ప్రశంసలతో పర్యావరణమా

స్వభావాలతో సద్భావమా తత్వములతో తాపత్రయమా 
పరిశోధనలతో పరిష్కారమా సిద్ధాంతాలతో ప్రయోజనమా  || శోధన ||