నీకై నేను జన్మించాను నాకై నీవు ఉదయిస్తున్నావు
నీలో నేనే నిలిచిపోయాను నాలో నీవే కలిసిపోయావు
ఎవరికి ఎవరో తెలియని మనము జగతిలో కలిసిపోయాము || నీకై నేను ||
ఎవరికి ఎవరో తెలియకనే పరిచయాల చేరువతో స్నేహమై పోయాము
స్నేహంతో సాగిన కాలం ఒకరికి ఒకరై ప్రేమతో జంటగా సాగిపోయాము
సుఖ దుఃఖాలు ఏవైనా శ్రమ ఫలితాలు ఏమైనా ఇద్దరం పంచుకున్నాము
ఒడిదుడుకులు ఎన్నైనా హెచ్చుతగ్గులు ఏవైనా ఇద్దరం కలిసివున్నాము || నీకై నేను ||
జీవించే ప్రతి కార్యములో ఏ సమస్యలు ఎదురైనా మన భవిష్యానికి మార్గమేనని తలిచాము
జీవన కార్యాలలో సమస్యలు ఎన్నున్నా మన జీవిత గమ్యానికి ప్రయాణమని అనుకున్నాము
జగతికి మనమే ఉదాహరణగా ఉండాలని మరణం వరకు కలసిమెలసి ఉండిపోయాము
యుగానికి మనమే మార్గ దర్శకంగా నిలవాలని తుది వరకు అలసిసొలసి కలసిపోయాము || నీకై నేను ||

No comments:
Post a Comment