Friday, January 20, 2017

ఎవరైనా ఆకాశ వర్ణాలను ఏనాడైనా గమనించారా

ఎవరైనా ఆకాశ వర్ణాలను ఏనాడైనా గమనించారా
ఎవరైనా మేఘాల వర్ణ భావాలను ఏనాడైనా చూశారా
ఏ దేశ ప్రదేశాన ఏ తీర సాగర ప్రాంతాన ఏమున్నదో
ఏదైనా కనిపించిందా ఏదైనా తెలిసిందా ఏదైనా తోచిందా   || ఎవరైనా ||

ఆకాశంలో రూపాల వర్ణాలను ఏనాడైనా గమనిస్తేనే ఏదో ఒక భావన తెలిసేనుగా
ఆకాశంలో రూపాల భావాలను ఎప్పుడైనా ఆలోచిస్తేనే ఏదో ఒక తత్వం తోచేనుగా

ఏ సమయ వేళలో నైనా ఎవరైనా ఏదైనా గమనిస్తున్నారా ఈ దేశ ప్రదేశాన
ఏ క్షణ కాలములలో నైనా ఎవరైనా ఏదైనా చూస్తున్నారా ఈ తీర ప్రాంతాన   || ఎవరైనా ||

ఆకాశ పొరల అంచులలో దాగిన సువర్ణ తేజస్సులన్నీ సంధ్యా వేళలో ఆవర్ణమై పోయెనే
ఆకాశ వర్ణమంతా చీకటితో ఆవర్ణమై స్వభావాలతో తారా నక్షత్ర కాంతులు వెలిగిపోయెనే

ఆకాశపు పై పొరల పరంపరలలో అంతరిక్షపు సౌర కుటుంబంలో ఆది నక్షత్రమై ఉన్నానే
ఆకాశ మేఘాల వర్ణ తేజస్సుల ఆకార రూపాలలో భావాల తత్వ రూపమై కనిపిస్తూ ఉన్నానే  || ఎవరైనా || 

No comments:

Post a Comment