విశ్వమే మహా ప్రకృతిగా జగమే సహజ వనరులుగా
లోకమే మహా గొప్పగా ప్రదేశమే అపురూప నిర్మాణంగా
భావ తత్వాలతో బ్రంహాండాన్ని సృష్టించావా ఈశ్వరా
విశ్వమే ప్రకృతిగా జగమే జాగృతిగా నీవే నిలిపావా ఈశ్వరా
జీవమే ఆకృతిగా కాలమే వికృతిగా సాగించావా పరమేశ్వరా || విశ్వమే ||
ప్రకృతినే పరిశోధనతో విశ్వాన్ని పర్యావరణం చేశావా
ఆకృతినే పరిశీలనతో సజీవమైన ఆకారంగా మార్చావా
శ్వాసనే జీవంగా దేహాన్నే ఆకార రూపంగా మలిచావా
ధ్యాసనే జ్ఞానంగా పరధ్యానమే ప్రజ్ఞానంగా కల్పించావా || విశ్వమే ||
తత్వాలతో మహాత్ములను భావాలతో మహర్షులను నెలకొల్పావా
వేదాలతో పండితులను ఉపనిషత్తులలో భోదకులను సృష్టించావా
జీవులు స్వేచ్ఛగా జీవించుటకు మహా రూపమైన సజీవ ప్రకృతిని సాగించెదవా
మానవులు విజ్ఞానంతో సాగుటకు మహా రూప నిర్మాణ వనరులను పొదిగించావా || విశ్వమే ||

No comments:
Post a Comment