Wednesday, March 15, 2017

ఏ నాదంతో ధ్యానిస్తున్నావో

ఏ నాదంతో ధ్యానిస్తున్నావో
ఏ భావంతో స్మరిస్తున్నావో
ఏ తత్వంతో జీవిస్తున్నావో
లోకమంతా ఉదయిస్తూ అస్తమించినా నీ చలనం ఉచ్చ్వాసయేనా శివా!  || ఏ నాదంతో ||

ప్రతి క్షణం అనంతమైన కార్యాలతో సాగుతున్నా నీలో అమర పర ధ్యానమే
ప్రతి సమయం అనంతమైన సమస్యలతో సాగుతున్నా నీలో మహా పర భావమే
ప్రతి సంభవం అనంతమైన సంఘటనలతో సాగుతున్నా నీలో వేద పర నాదమే

ప్రకృతిలో పర్యావరణం క్షీణిస్తున్నా నీలో ఏకధాటి స్మరణమే
విశ్వంలో హితత్వం నశిస్తున్నా నీలో ఏకసూటి అంతర్భావమే
జగతిలో జీవత్వం తరుగుతున్న నీలో ఏకపాటి అంతరంగమే  || ఏ నాదంతో ||

ఉదయించే జీవం అస్తమించే వరకు ఏ విధంగా జీవిస్తుందో నీకు ఎరుకైనా నీలో నిశ్చలత్వం
ఉదయించే విశ్వం అస్తమిస్తున్నా సంభవించే కార్యాలకు బాధ్యతే లేనట్లు నీలో తటస్థత్వం

ఉదయించే జగతి అస్తమిస్తున్నదని తెలిసినా నీలో చలనం భావనగా తెలియని స్థైర్యం
ఉదయించే లోకం ఎలా అస్తమిస్తుందో పరధ్యానంలో తెలిసినా నీలో తెలియని స్థిరత్వం

ఉదయించే సూర్యుడే అస్తమిస్తున్నా ప్రజ్వల తేజం లేని లోకంలో నీకు పరధ్యాన మౌనం
ఉదయించే బ్రంహాండం అస్తమించినా అనంత లోకాలకు నీ స్వభావత్వం పరధ్యాస వైనం  || ఏ నాదంతో || 

No comments:

Post a Comment