రూపంతో ఎదిగావా ఓ మహాత్మా
ఆకారంతో ఒదిగావా ఓ మానవా
నీలోనే ఉన్నది పరమాత్మ ఓ మాధవా
నీలోనే ఉన్నది పరమార్థం ఓ మానవా || రూపంతో ||
ఏది నీ జీవం ఏది నీ దేహం
ఏది నీ దైవం ఏది నీ ధర్మం
ఏది నీ భావం ఏది నీ తత్వం
ఎన్నెన్నో లోకాలు తిరిగినా ఒకటే జీవిత పరమార్థం
ఎన్నెన్నో జన్మలు పొందినా ఒకటే ఆత్మ విశ్వాసం || రూపంతో ||
ఏది నీ జ్ఞానం ఏది నీ సత్యం
ఏది నీ వేదం ఏది నీ విజ్ఞానం
ఏది నీ రూపం ఏది నీ ఆకారం
ఎక్కడికి వెళ్ళినా ఏ జీవైనా కోరుకునేది ప్రశాంతమైన జీవితం
ఎక్కడ ఉన్నా ఏ జీవిని అడిగినా కోరేది స్వచ్ఛమైన ఆనందం || రూపంతో ||

No comments:
Post a Comment