వరసిద్ధి వినాయక వరమియ్యవా
నీ సిద్దులకు విజ్ఞానం ప్రసాదించవా
నీ భక్తులను ప్రయోజనం చేయవా || వరసిద్ధి ||
నీ విశ్వ విజ్ఞానాన్ని మహిమగా చూపవా
నీ విశ్వ తేజాన్ని మేధస్సుకే కలిగించవా
నీలో దాగిన అనంత భావాలను వర్ణించవా
నీలో నిండిన అమృత తత్వాన్ని తెలుపవా
లోకానికి నీ విజ్ఞానమే శరణం అభయం
జగతికి నీ ధ్యానమే తపనం తరుణం || వరసిద్ధి ||
వేదాలనే బోధించి తత్వాలనే అపురూప వర్ణ తేజస్సులతో రుచింపవా
భావాలనే పరిశోధించి స్వభావాలనే అద్వితీయ గుణాలతో మార్చవా
జగతినే ప్రశాంతమైన ప్రకృతి పర్యావరణం చేయవా
లోకాన్నే నిర్మలమైన కాల కార్యాలతో నడిపించవా
దైవం రూపం నీవే ధర్మం
వేదం భావం నీవే సత్యం || వరసిద్ధి ||

No comments:
Post a Comment