Wednesday, July 19, 2017

ఎవరో నీవు ఎవరో నాకు తెలియాలి

ఎవరో నీవు ఎవరో నాకు తెలియాలి
ఎవరో నీవు ఎవరో నాకు తెలపాలి
ఎవరో నీవు ఎవరో నాకు తోచాలి

ఎవరికి ఎవరో నాకు ఎవరో నీవే కావాలి
ఎవరికి ఎవరో నీకు ఎవరో నేనే కావాలి    || ఎవరో ||

ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నా ధ్యాస నువ్వే అవ్వాలి
ఎక్కడ ఉన్నా ఎలా ఉంటున్నా నీ శ్వాస నేనే అవ్వాలి

ఎక్కడ ఏదో జరుగుతున్నా నీవు క్షేమంగా ఉండాలి
ఎక్కడ ఏదో తరుగుతున్న నీవు ధీరంగా ఉండాలి   || ఎవరో ||

ఎక్కడ ఎవరెవరు ఉన్నా మనమే ఉన్నామని జీవించాలి
ఎక్కడ ఎవరెవరు లేకున్నా మనమే ఉండాలని నివసించాలి

ఎవరికి ఎవరు లేకున్నా మనమే అండగా నిలవాలి అందరితో కలవాలి
ఎవరికి ఎవరు ఉన్నా మనమే నీడగా సాగిపోవాలి అందరితో తోడవ్వాలి   || ఎవరో ||
-- -- -- --
ఎవరో మీరు ఎవరో మాకు తెలియాలి
ఎవరో మీరు ఎవరో మాకు తెలపాలి
ఎవరో మీరు ఎవరో మాకు తోచాలి

ఎవరికి ఎవరో మాకు ఎవరో మీరే కావాలి
ఎవరికి ఎవరో మీకు ఎవరో మేమే కావాలి    || ఎవరో ||

ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మా ధ్యాస మీరే అవ్వాలి
ఎక్కడ ఉన్నా ఎలా ఉంటున్నా మీ శ్వాస మేమే అవ్వాలి

ఎక్కడ ఏదో జరుగుతున్నా మీరు క్షేమంగా ఉండాలి
ఎక్కడ ఏదో తరుగుతున్న మీరు ధీరంగా ఉండాలి   || ఎవరో ||
-- -- -- -- 

ఉదయించే సూర్యున్ని చూసిన క్షణమే నా మేధస్సు మెరిసిందిలే

ఉదయించే సూర్యున్ని చూసిన క్షణమే నా మేధస్సు మెరిసిందిలే
అవతరించే చంద్రున్ని చూసిన క్షణమే నా భావన మెచ్చిందిలే
అధిరోహించే మేఘాన్ని చూసిన క్షణమే నా వేదన మురిసిందిలే   || ఉదయించే ||

మెలకువతో కలిగే విజ్ఞానం ప్రజ్వలించే సూర్యోదయ తేజం
అనుకువతో కలిగే ప్రమోదం పరిమళించే చంద్రుని కాంతం

ఆకాశాన్ని చూడగా నా మేధస్సులో కలిగే వేద భావాలే అమరం
విశ్వాన్ని చూడగా నా ఆలోచనలో కదిలే వేద తత్వాలే అమోఘం
జగతిని చూడగా నా మనస్సులో కలిగే వేద స్వభావాలే అఖిలం    || ఉదయించే ||

మెలకువతో వచ్చే ఆలోచన విజ్ఞాన కార్యాల కార్యాచరణం
అనుకువతో వచ్చే స్వభావన ప్రజ్ఞాన కార్యాల కార్యాదరణం

ఆకాశాన్ని చూస్తూనే నిలిచిపోయే అనంతమైన భావాలు ఆవరణం
విశ్వాన్ని చూస్తూనే తలిచిపోయే అమరమైన తత్వాలు అఖండం
జగతిని చూస్తూనే మరచిపోయే అపురూపమైన గుణాలు ఆనందం   || ఉదయించే || 

నీలోనే మహాత్ములు విజ్ఞానముకై ఉదయిస్తున్నారు

నీలోనే మహాత్ములు విజ్ఞానముకై ఉదయిస్తున్నారు
నీతోనే మహనీయులు వేదాంతముకై వెలుగుతున్నారు

నీవెంటే మహర్షులు ప్రజ్ఞానముకై జీవిస్తున్నారు
నీవెంటే సాధువులు పరిశోధనకై అన్వేషిస్తున్నారు
నీవెంటే ప్రవక్తలు పర్యవేక్షణకై పరితపిస్తున్నారు    || నీలోనే ||

అఖండమైన సాధనతో విజయం నీదైతే ఎవరైనా అభినందిస్తుంటారు
అమోఘమైన దీక్షణతో విజయం నీదైతే ఎందరైనా అభిమానిస్తుంటారు

అమరమైన వేదాంతం అమృతమై మహాత్మగా నీలోనే ఉదయిస్తుంది
అపారమైన విజ్ఞానం అనుభవమై పరమాత్మగా నీతోనే వెలుగుతుంది  
అంతర్భావమైన ప్రజ్ఞానం అనిర్వచనమై ఆత్మగా నీలోనే జీవిస్తుంది    || నీలోనే ||

ఆకాశం అద్వితీయమైతే ఎవరైనా విజ్ఞానంతో జీవిస్తుంటారు
ఆనందం అపురూపమైతే ఎందరైనా అనుభవంతో వస్తుంటారు

అఖిలమైన ప్రేమం పరతత్వంతో మనతోనే ప్రజ్వలిస్తుంది
అచలమైన  స్నేహం పరభావంతో మనలోనే పరిశోధిస్తుంది
అనంతమైన  హితం పరధ్యాసతో మనతోనే ప్రయాణిస్తుంది    || నీలోనే || 

ఓ సూర్య దేవ! నీవు ఏనాటి దైవానివో

ఓ సూర్య దేవ! నీవు ఏనాటి దైవానివో
ఓ సూర్య తేజ! నీవు ఏనాటి దేహానివో
ఓ సూర్య భావ! నీవు ఏనాటి రూపానివో

ప్రతి క్షణం జగతిలో ఉదయిస్తూనే ప్రజ్వలిస్తున్నావు
ప్రతి కణం విశ్వంలో వెలుగుతూనే ప్రయాణిస్తున్నావు  || ఓ సూర్య దేవ! ||

ఎంతటి భారమో నీ కార్యాచరణ ఏనాటి బంధమో నీ కార్యాదక్షణ
ఎంతటి వైనమో నీ కార్యాదీక్షణ ఏనాటి స్వభావమో నీ కార్యావర్ణన

ఎంతటి రూపమో నీ కార్యావేదన ఏనాటి దేహమో నీ కార్యాభావన
ఎంతటి గుణమో నీ కార్యావచన ఏనాటి మూలమో నీ కార్యాజ్ఞానన

జగమే నీవని జీవిస్తూ వెలుగే నీవని ఉదయిస్తున్నావు
విశ్వమే నీవని శ్వాసిస్తూ ధ్యాసే నీవని వెలుగుతున్నావు  || ఓ సూర్య దేవ! ||

ఎంతటి చిత్రమో నీ కార్యావరణ ఏనాటి జ్ఞానమే నీ కార్యాదరణ
ఎంతటి ఊష్ణమో నీ కార్యావర్గన ఏనాటి తేజమో నీ కార్యాదహన

ఎంతటి దైవమో నీ కార్యాజనన ఏనాటి వరమో నీ కార్యాతపన
ఎంతటి లీనమో నీ కార్యాకర్తన ఏనాటి విధమో నీ కార్యాకర్మన

దైవమే నీవని దహిస్తూ తేజమే నీవని వర్ణిస్తూ చూస్తున్నావు
భావమే నీవని వహిస్తూ రూపమే నీవని జీవిస్తూ వస్తున్నావు   || ఓ సూర్య దేవ! || 

Tuesday, July 18, 2017

మనలోనే మానవత్వం

మనలోనే మానవత్వం
మనతోనే జీవత్వం
మనదే వేదత్వం
మనకే వినయత్వం
మనమే సర్వత్వం   || మనలోనే ||

మహా గుణమే గుణతత్వం
మహా లక్ష్యమే వీరత్వం
మహా భావమే ప్రేమత్వం
మహా ధ్యానమే దివ్యత్వం
మహా లోకమే ఉదయత్వం  || మనలోనే ||

అక్కడ ఉన్నదే అల్పత్వం
ఇక్కడ లేనిదే శూన్యత్వం
మరల రానిదే శాంతత్వం
ఎప్పుడో వచ్చినదే దైవత్వం
ఇప్పుడే వెళ్ళినదే దేహత్వం  || మనలోనే || 

Saturday, July 15, 2017

ప్రేమంటేనే పిలిచిన వెంటనే పలికే ప్రాణమా

ప్రేమంటేనే పిలిచిన వెంటనే పలికే ప్రాణమా
స్నేహమంటేనే పిలవకనే పలికించే బంధమా

ప్రేమించడం మన స్వభాలతో సాగే సంబంధమా
స్నేహించడం మన భావాలతో సాగే పరబంధమా   || ప్రేమంటేనే ||

ప్రేమకైనా స్నేహంకైనా పరిచయాల బంధాలు సాగేనా
ప్రేమకైనా స్నేహంకైనా సంబంధాల భావాలు కలిగేనా

మనస్సుకైనా వయస్సుకైనా భావాలు ఆనందమై కలిగేనా
మనస్సుకైనా వయస్సుకైనా బంధాలు అవసరమై వచ్చేనా   || ప్రేమంటేనే ||

ప్రేమతో పిలిచితే పలకని భావన ఉండదేమో
స్నేహంతో పలికితే పిలవని వేదన ఆగదేమో

మనస్సుతో సాగే ప్రేమకు మౌనం ఎందుకో తెలియునా
వయస్సుతో సాగే స్నేహంకు భావం ఎందుకో తెలిసేనా   || ప్రేమంటేనే ||

ఎవరని మీరు ఎవరని ఎవరికి తెలుసు

ఎవరని మీరు ఎవరని ఎవరికి తెలుసు
ఎవరని మీరు ఎవరని ఎవరికి ఏమని తెలుసు

ఎవరికి ఎవరు ఏమౌతున్నా ఎవరికి ఎవరో తెలుసు
ఎవరికి ఎవరు ఏమౌతున్నా ఎవరికి వారెవరో తెలుసు

ఎవరికి ఎవరు ఎక్కడ ఉన్నా ఇక్కడే ఉన్నామని తెలుసు
ఎవరికి ఎవరు ఎలా ఉన్నా ఎక్కడో ఉంటున్నామని తెలుసు   || ఎవరని ||

ఎవరు ఎక్కడ ఉన్నా నీరు మీరు ఉంటే చాలని తెలుసు
నీరు మీరు ఉంటేనే ఆహారం ఉండేనని మనకు తెలుసు

ఆకలి తీరిన వారికి ఆరోగ్యమే ఉత్తేజమై బంధమే కలుగునని తెలుసు
బంధాలే ఉన్న వారికి మనం ఎవరో ఎక్కడో ఉంటున్నామని తెలుసు

ఎవరికి ఎవరో బంధం ఐనా సంబంధాలు కలిసే భావాలే మనకు తెలుసు
ఎవరికి ఎవరో వేదం ఐనా వేదాంతాలు కలిగే స్వభావాలే మనకు తెలుసు   || ఎవరని ||

ఎవరో మనం ఎవరో ఎలా ఉన్నామో ఎంత ఎదిగామో మనస్సుకు తెలుసు
ఎవరో మనం ఎవరో ఎక్కడ ఉన్నామో ఎంత ఒదిగామో వయస్సుకు తెలుసు

ఎదిగిన వారు ఎవరని ఎందరికో నిదర్శనమని గొప్పగా తెలుసు
ఒదిగిన వారు ఎవరని ఎందరికో మార్గమని ఎంతో గొప్పగా తెలుసు

ఎదిగిన వారి విజ్ఞానం ఎల్లప్పుడు మనతో ఉండేనని తెలుసు
ఒదిగిన వారి వేదాంతం ఎప్పటికి మనతో ఉంటుందని తెలుసు   || ఎవరని ||

Monday, July 10, 2017

తేజమా భావమా నీవే నా రూపమా

తేజమా భావమా నీవే నా రూపమా
దైవమా తత్వమా నీవే నా దేహమా

వర్ణమా బంధమా నీవే నా స్వప్నమా
ధ్యానమా గానమా నీవే నా సంగీతమా   || తేజమా ||

జీవమై ప్రాణమై కలలకే స్నేహమై నిలిచావులే నా మేధస్సులో
వేదమై భావమై మాటలకే ప్రేమమై గెలిచావులే నా మనస్సులో

మౌనంతో మురిసినా మోహమై వాల్చినా అద్భుతమే నీ రూపం
దేహంతో మలిచినా మర్మమై దాల్చినా ఆశ్యర్యమే నీ స్వభావం   || తేజమా ||

రూపాలన్నీ స్వభావాలుగా సాగిన కార్యాలే జీవితాలుగా ఎదిగెనే
భావాలన్నీ తత్వాలుగా కొన సాగిన కార్యాలే వేదాలుగా ఒదిగెనే

జ్ణానంతో సాగే విజ్ఞానం వివిధ దశలుగా పరిశోధన కలిగించెనే
జననంతో సాగే మరణం వివిధ రకాలుగా పరిచయం చేసెనే    || తేజమా || 

ఉదయం ఉదయం జగతికే సూర్యోదయం

ఉదయం ఉదయం జగతికే సూర్యోదయం
అభయం అభయం జగతికే శుభోదయం
వినయం వినయం జగతికే నవోదయం

సూర్యోదయమే జగమంతా కార్యాచరణ ఉదయం
సూర్యానందమే జగమంతా కార్యాదరణ అభయం
సూర్యావరణమే జగమంతా కార్యావరణ పర్యావరణం   || ఉదయం ||

ఉదయించే సూర్యోదయం జగతికే ప్రజ్వలం జీవన ప్రకృతం
అభయమిచ్చే శుభోదయం జగతికే ప్రతేజం జీవిత ప్రమోదం

ఉదయించే లోకం సర్వం శాంతం ప్రశాంతం పరిమళ ప్రభాతం
అభయమిచ్చే లోకం సర్వం జ్ఞానం విజ్ఞానం పరిశోధన ప్రజ్ఞానం   || ఉదయం ||

ఉదయం మొదలయ్యే కార్యావచన కమనీయం కన్నులకే కరుణామృతం
అభయం ఆరంభమయ్యే కార్యాకర్తన కర్తవ్యం సుకార్యాలకే కళా నైపుణ్యం
వినయం ప్రారంభమయ్యే కార్యాభావన కమలం కాలానికే కాంతి చైతన్యం

ఉదయించుటలో కార్యా కాంతి సూర్యోదయం ప్రకృతి వర్ణాల తేజోదయం
అభయమిచ్చుటలో కార్యా క్రాంతి శుభోదయం విజయ వర్గాల నవోదయం   || ఉదయం ||

Thursday, July 6, 2017

నీలోన నీవే ఆత్మ జ్యోతిని వెలిగించు

నీలోన నీవే ఆత్మ జ్యోతిని వెలిగించు
నీలోన నీవే ఆత్మ జ్ఞానాన్ని సంబోధించు
నీలోన నీవే ఆత్మ బంధాన్ని నడిపించు
నీలోన నీవే ఆత్మ తత్వాన్ని అధిరోహించు   || నీలోన ||

యుగ యుగాలుగా వెలుగునిచ్చే ప్రజ్వల కాంతిని సంఘటించు
తర తరాలుగా విజ్ఞానాన్నిచ్చే మహోదయ మతిని సంగతించు

ఇహపర లోక ఆత్మ జ్ఞానాన్ని విశ్వమంతా వేదవిద్యగా పరిగణించు
మహాపర లోక ఆత్మ జ్యోతిని జగమంతా దైవకాంతిగా పరిమాణించు  || నీలోన ||

జీవ భావ బంధాల స్వభావాలతో సమతుల్యతను పరిశోధించు
జ్ఞాన వేద భావాల బంధాలతో సమయత్వమును పరిశీలించు

పరమాత్మము పరమార్థమేనని మనకై అనువదించు
ప్రకృతి పర్యావరణమేనని సహ జీవులకై ఆరాధించు  || నీలోన ||

Wednesday, July 5, 2017

నేను చూడని రూపం ఎవరిది

నేను చూడని రూపం ఎవరిది
నేను వీడని భావం ఎటువంటిది
నేను తలవని స్వప్నం ఎక్కడిది

నేనుగా చూడనిది నేనే వీడనిది నేనై తలవనిది ఏదో పరమార్థమే  || నేను ||

నేను నేనని నాలో నేనే నేనని నాలో దాగినది ఏదో ఉందని
నేను నేనేనని నాలో నేనేనని నాలో ఉన్నది ఏదో తెలిసిందని

నేనుగా చూడని రూపం నాలో దాగిన అంతర్భావం
నేనుగా వీడని భావం నాలో ఎదిగిన అంతర్భావం
నేనుగా తలవని స్వప్నం నాలో ఒదిగిన ప్రజ్వలం   || నేను ||

నేనుగా ఉన్నానని నాలోనే ఉన్నానని ఏదో తెలియని తత్వం
నేనుగా ఉంటానని నాలోనే ఉంటానని ఏదో తెలియని బంధం

నేనుగా చూసిన రూపం నాలో దాగిన అనంతమైన ఆత్మ స్వరూపం
నేనుగా విడిచే భావం నాలో ఎదిగిన అత్యంతమైన ఆత్మ స్వభావం
నేనుగా తలిచే స్వప్నం నాలో ఒదిగిన అసాధ్యమైన ఆత్మ స్వతత్వం  || నేను || 

పురుషోత్తమా ...! పలకవా నీ పలుకులను వినిపించవా

పురుషోత్తమా ...!  పలకవా నీ పలుకులను వినిపించవా
ఏమని పిలిచినా ఎలా పలికినా మనస్సును తపించవా   || పురుషోత్తమా ||

నిత్యం ఉదయం సత్యం సమయం ఎదురుగా నిలిచే స్వరూపం నీదే
ధర్మం వేదం దైవం దేహం ఒకటిగా ఒక్కటై కలిగే భావం బంధం నీదే

రూపముతోనే కాలం సాగినా కార్యములో ఉత్తేజము నీవే కలిగించెదవు
భావంతోనే సమయం మీరినా సమస్యలో పరమార్థం నీవే తెలిపెదవు   || పురుషోత్తమా ||

భక్తులకు నీ పిలుపులతోనే మహానంద దివ్య దర్శనం కలిగించవా
సాధువులకు నీ పలుకులతోనే పరమానంద స్వరూపం చూపించవా

మహాత్ములకు నీలో వెలిగే తేజం నిత్యానందమని వర్ణించవా
మహర్షులకు నీలో కలిగే తత్వం ఆత్మానందమని వివరించవా   || పురుషోత్తమా || 

కలలే కంటున్నావా కథలే వింటున్నావా

కలలే కంటున్నావా కథలే వింటున్నావా
ఊహలే చేస్తున్నావా ఆలోచనలే గమనిస్తున్నావా

కలలైనా కథలైనా విజ్ఞానం ఉందని తెలుసుకున్నావా
ఊహలైనా ఆలోచనలైనా భావం ఏమని తెలుపుకున్నావా   || కలలే ||

కన్నులకే తెలియని కలలు కంటున్నా కాలం ఆగదులే
చిత్రాలకే తెలియని కథలు చెపుతున్నా సమయం నిలవదులే

వేదాలకే తెలియని ఊహలు చేస్తున్నా గమనం ఒదగదులే
భావాలకే తెలియని ఆలోచనలు వస్తున్నా కార్యం చేరదులే   || కలలే ||

కలలన్నీ కన్నులకు తెలియని మేధస్సులో కలిగే చిత్ర భావాలే
కథలన్నీ కన్నులకు కనిపించని మేధస్సులో కలిగే చిత్ర రూపాలే

ఊహలన్నీ చెవులకు వినిపించని మేధస్సులో కదిలే చిత్ర స్వభావాలే
ఆలోచనలన్నీ వరుసకు చేరని మేధస్సులో కదిలే చిత్ర భావ తత్వాలే   || కలలే ||

Tuesday, July 4, 2017

ఏమని నన్ను మెప్పించావు

ఏమని నన్ను మెప్పించావు
ఏమని నన్ను ఒప్పించావు
ఏమని నన్ను రప్పించావు
తెలియకనే తెలియని కాలంతో మెప్పించి ఒప్పించి రప్పించావు  || ఏమని ||

మెచ్చిన రూపం ఒప్పిన అందం జతకై రప్పించేనా
తలచిన భావం తపించిన తత్వం మనకై ఒప్పించేనా
కలసిన స్నేహం చేరిన ప్రేమం మదికై మెప్పించేనా   || ఏమని ||

చూసిన సమయం ఆగని తరుణం కాలంతో రప్పించిన తపనం
కోరిన శృంగారం మీరిన వయ్యారం దేహంతో ఒప్పించిన సోయగం
మెరిసిన తేజం విరిసిన కాంతం వర్ణంతో మెప్పించిన కమనీయం   || ఏమని || 

జయహో జయహో జయదేవా

జయహో జయహో జయదేవా
జయహో జయహో జయరాజా

జయ జయ జయహో జయరామా
జయ జయ జయహో జయవిజయ
జయ జయ జయహో జయసింహా
జయ జయ జయహో జయచంద్ర
జయ జయ జయహో జయసూర్య

జయానంద రూప జయ ప్రకాశ తేజ
జయ జగత్ జనని జయ చంద్ర భావ
జయ విజయ శౌర్య  జయ జనన ధీర
జయ స్వరూప కాంత జయ ప్రదేశ దేశ
జయ జగన్నాత మహా జయ జనార్దన 
జయ జగత్ పూర్ణ జయ విశ్వ అన్నపూర్ణ
జయ జన్మ ధార జయ జ్ఞాన జగదీశ