ఏనాటి ఋషివో నీవు ఏనాటి మహర్షివో నీవు
ఏనాటి ఆత్మవో నీవు ఏనాటి మహాత్మవో నీవు
ఋషిగా సిద్ధాంతివై మహర్షిగా వేదాంతివైనావు
ఆత్మగా ప్రకృతివై మహాత్మగా పరాకృతివైనావు || ఏనాటి ||
ఋషిగా సిద్ధాంతాలు రచించినా మహర్షిగా వేదాంతాలు రుచించేవు
ఆత్మగా ప్రకృతినే ఆవహించినా మహాత్మగా పరాకృతులు ధరించేవు
ఋషిగా భావాలతో ఎదిగిన నీవు మహర్షిగా తత్వాలతో జీవించేవు
ఆత్మగా వేదాలతో ఒదిగిన నీవు సత్యాలతో మహాత్మగా ఉదయించేవు || ఏనాటి ||
ఋషిలోనే కృషి ఉన్నది మహర్షిలోనే స్వయంకృషి ఉన్నది
ఆత్మలోనే ఓ మాత ఉన్నది మహాత్మలోనే జగన్మాత ఉన్నది
ఋషిలోనే పవిత్రం మహర్షిలోనే పరిశుద్ధం ప్రకృతితో కొనసాగుతున్నది
ఆత్మలోనే అన్వేషణం మహాత్మలోనే పరిశోధనం జగతితో జరుగుతున్నది || ఏనాటి ||

No comments:
Post a Comment