Showing posts with label అవగాహన. Show all posts
Showing posts with label అవగాహన. Show all posts

Thursday, September 8, 2016

విశ్వంలో ఏమున్నదో జగమంతా ఏమి దాగున్నదో

విశ్వంలో ఏమున్నదో జగమంతా ఏమి దాగున్నదో
అన్వేషణతో సాగే మేధస్సుకు ఏదో రహస్యం తెలియాలి
ఆలోచనలలో విజ్ఞానం అనుభవమై కాలంతో సాగిపోవాలి  || విశ్వంలో ||

తెలిసే వరకు ప్రయోగం చేయాలి అర్థం అయ్యేవరకు పరిశోధన సాగాలి
ఏది ఏమిటో ఎందుకో గ్రహించాకే పర్యవేక్షణతో తీర్పు ఏదో ఇచ్చేయాలి

అద్భుతాలను తిలకిస్తూనే ఆశ్చర్యాన్ని అవగాహనతో పసిగట్టాలి
నిర్మాణాల విధానాలనే గమనిస్తూ మహా మూలాన్ని గ్రహించాలి   || విశ్వంలో ||

ప్రకృతియే మన వైద్యశాల పరిశోధన చేస్తే రహస్యం మన చెంత
విశ్వమే మన వేద కళాశాల పరిశీలిస్తే మహా పరమార్థం మన వెంట

ప్రయాణిస్తూనే అన్నింటిని గ్రహించాలి అనంతమైన  ఆలోచనలతో ఎన్నో తెలుసుకోవాలి
కాలంతో సాగుతూనే ఆరోగ్యం చూసుకోవాలి ఆయుస్సుతోనే మన విజ్ఞానానికి పదును పెట్టాలి  || విశ్వంలో ||