Showing posts with label బంధనం. Show all posts
Showing posts with label బంధనం. Show all posts

Tuesday, December 27, 2016

ఏనాటిదో రూపం ఎప్పటిదో కాలం ఎంతటిదో జీవం

ఏనాటిదో రూపం ఎప్పటిదో కాలం ఎంతటిదో జీవం
మరవలేని జ్ఞాపకాలతో మర్మమై నాతో సాగుతున్నది

ఎందుకో స్వప్నం ఎవరికో ఊహం ఏనాటికో వాంఛనం
తీరలేని కోరికలతో తీరిపోతున్నది జన్మజన్మల బంధనం  || ఏనాటిదో ||

రూపానికి తేజం లేదుగా కాలానికి కరుణ రాదుగా శ్వాసకు సంతృప్తి అసలే ఉండదుగా
తెలిసిన జ్ఞాపకాలతో సాగుతున్నా హృదయం దుఃఖ సాగరమై కన్నీటితో తెలిపేనుగా

కోరికలు ఎన్నున్నా తీరని ఆశల వాంఛనాలు ఊహలతో స్వప్నాలుగా మిగిలేనులే
ప్రతి జన్మలో కోరికలు ఏవైనా తీరని భావాలతో ఆలోచనలు బంధాలుగా సాగేనులే   || ఏనాటిదో ||

ప్రాణమే ఉన్నా రూపమే జీవిస్తున్నా కాలమే మహా చలనమై సాగేను విశ్వంతో
భావమే ఉన్నా బంధమే సాగుతున్నా తత్వములే యుగాలుగా సాగేను జగంతో

దేహానికి రూపం ఏదైనా కాలంతో సాగే మార్పులు ఏవైనా కోరికలు మనస్సుకే
మేధస్సుకు ఆలోచనలు ఏవైనా సాధనతో సాధించే లక్ష్యాలు హృదయానికే  || ఏనాటిదో ||