Wednesday, October 11, 2017

ఓ సూర్య దేవా! నీవే నా బోధకుడవు

ఓ సూర్య దేవా! నీవే నా బోధకుడవు
ఓ సూర్య దేవా! నీవే నా రక్షకుడవు
ఓ సూర్య దేవా! నీవే నా మిత్రుడవు
ఓ సూర్య దేవా! నీవే నా కార్యకుడవు

సర్వం నీవే నా జీవన మార్గ దర్శకుడవు
నిత్యం నీవే నా జీవిత మార్గ సూత్రుడవు  || ఓ సూర్య దేవా ||

ఉదయిస్తూనే ఉత్తేజంతో వేదాలనే పలకించెదవు
ప్రజ్వలిస్తూనే కిరణాలతో కార్యాలనే అందించెదవు
ప్రయాణిస్తూనే వర్ణాలతో భావాలనే అన్వేషించెదవు
అస్తమిస్తూనే బంధాలతో తత్వాలనే కలిగించెదవు

కాలంతోనే సమయాన్ని అందిస్తూ ఎన్నో స్వభావాలను తెలిపెదవు  || ఓ సూర్య దేవా ||

దైవాన్ని బోధిస్తూ జ్ఞానాన్ని కలిగిస్తూ ఉదయించెదవు
ధర్మాన్ని రక్షిస్తూ భయాన్ని తొలగిస్తూ జీవించెదవు
దేహాన్ని పలికిస్తూ స్నేహాన్ని సాగిస్తూ అస్తమించెదవు
దీక్షను సాగిస్తూ కార్యాన్ని నడిపిస్తూ అధిరోహించెదవు

భావాలతోనే తత్వాలను కలిగిస్తూ ఎన్నో కార్యాలను నడిపెదవు  || ఓ సూర్య దేవా ||

నేను తెలుపని భావన కాలంతో మిగిలేనా

నేను తెలుపని భావన కాలంతో మిగిలేనా
నేను తలచని భావన వేదంతో విడిచేనా
నేను మరచిన భావన జ్ఞానంతో వలిచేనా

తెలిసిన తెలియని మరచిన భావాలు ఏనాటికైనా నాలోనే చేరేనులే  || నేను ||

నేను తెలుపని భావన కాలం ఎవరికో తెలిపేనా
నేను తలచని భావన వేదం ఎందరికో తెలిపేనా
నేను మరచిన భావన జ్ఞానం ఎప్పటికో తెలిపేనా  || నేను ||

నేనే లేని విశ్వ భావన కాలం ఎలాగైనా తెలుపదా
నేనే లేని దైవ భావన వేదం ఎప్పుడైనా తెలుపదా
నేనే లేని జీవ భావన జ్ఞానం ఎక్కడైనా తెలుపదా  || నేను ||

ఏనాటి తరంగానివో వేగముతో వీచేస్తున్నావు

ఏనాటి తరంగానివో వేగముతో వీచేస్తున్నావు
ఎంతటి కెరటానివో వీర్యముతో వచ్చేస్తున్నావు
ఎలాంటి వలయానివో వేదనతో వాల్చేస్తున్నావు

తరంగాల కెరటాలు వలయమై ప్రకృతి ప్రభావంతో జీవితాన్ని భ్రమింపజేస్తున్నాయి  || ఏనాటి ||

తరలిన తరంగం తపనంతో తరిగిస్తున్నది
కదలిన కెరటం కదనంతో కప్పేస్తున్నది
వలచిన వలయం వదనంతో వంచేస్తున్నది  || ఏనాటి ||

తరంగాల తరంగం తడబడిస్తూనే తరలిస్తున్నది
కెరటాల కెరటం కదిలించేస్తూనే కుదించేస్తున్నది 
వలయాల వలయం వేధించేస్తూనే వహిస్తున్నది    || ఏనాటి || 

Tuesday, October 10, 2017

అన్వేషణ మేధస్సులో మొదలైనదా

అన్వేషణ మేధస్సులో మొదలైనదా
పరిశోధన ఆలోచనతో ఆరంభమైనదా 

విజ్ఞానం భావాలతో కలుగుతున్నదా
కార్యాచరణ కాలంతో సాగుతున్నదా  || అన్వేషణ ||

విశ్వాన్ని అన్వేషించి చూడగా తెలియును మహా విజ్ఞాన వేదం
జగతిని పరిశోధించి చూడగా తెలియును మహా శాస్త్రీయ భావం
ప్రకృతిని పరిశీలించి చూడగా తెలియును మహా ప్రజ్ఞాన తత్వం
లోకాన్ని పర్యవేక్షించి చూడగా తెలియును మహా ప్రస్థాన విధానం  || అన్వేషణ ||

విశ్వాన్ని గమనించి చూడగా తెలియును మహా కాల వేదాంతం 
జగతిని తిలకించి చూడగా తెలియును మహా కార్య సిద్ధాంతం
ప్రకృతిని పరీక్షించి చూడగా తెలియును మహా జీవన శాస్త్రీయం
లోకాన్ని అభ్యసించి చూడగా తెలియును మహా మానవ నైపుణ్యం  || అన్వేషణ || 

విశ్వ భావన ఎవరికి తెలుసు

విశ్వ భావన ఎవరికి తెలుసు
విశ్వ జీవన ఎవరికి తెలుసు
విశ్వ వేదన ఎవరికి తెలుసు
విశ్వ తత్వన ఎవరికి తెలుసు

విశ్వమంతా వేద భావాల తత్వ జీవితమే  || విశ్వ ||

విశ్వమే జీవన వేదం
విశ్వమే వేదన తత్వం
విశ్వమే భావన రూపం
విశ్వమే తత్వన జ్ఞానం

విశ్వ వేద భావ తత్వాలే విజ్ఞాన చరితమే  || విశ్వ ||

విశ్వమే ఆకాశ తత్వం
విశ్వమే కాల భ్రమణం
విశ్వమే ప్రకృతి రూపం
విశ్వమే జగతి స్వరూపం

విశ్వమంతా ప్రకృతి ప్రభావాల దైవ స్వరూపమే  || విశ్వ || 

Monday, October 9, 2017

ఓంకార లింగం శ్రీకార లింగం

ఓంకార లింగం శ్రీకార లింగం
మమకార లింగం శుభకర లింగం
భవకార లింగం నవకార లింగం
ఆకార లింగం ప్రాకార లింగం
స్వీకార లింగం స్వకార లింగం
పూర్వాంకార లింగం సూర్యంకార లింగం
శేఖర లింగం శంకర లింగం
క్షణకర లింగం ద్వికర లింగం
పూజ్యంకార లింగం పుష్పాంకార లింగం
సహకార లింగం సుధాకర లింగం
ధ్వనికర లింగం లయకర లింగం
నయకర లింగం సూక్ష్మకర లింగం
పద్మాకర లింగం ప్రాణాకర లింగం
దానాకర లింగం ధ్యానకర లింగం

ప్రతి క్షణం ఎన్నో జీవులకు అవసరమే

ప్రతి క్షణం ఎన్నో జీవులకు అవసరమే
ఎన్నో క్షణాలు ప్రతి జీవికి అనుభవమే

ప్రతి క్షణం ప్రతి సమయం ప్రతి జీవికి జీవితమే
ప్రతి స్వభావం ప్రతి తత్వం ప్రతి జీవికి జీవనమే  || ప్రతి క్షణం ||

కాలం ప్రతి జీవికి జన్మను ఇచ్చినది
క్షణం ప్రతి జీవికి మరణమే తలచినది
సమయం ప్రతి జీవికి జీవితాన్ని పంచినది

కాలంతో జన్మిస్తూ సమయంతో జీవిస్తూ క్షణాలతో మరణిస్తున్నాము  || ప్రతి క్షణం ||

కాలం ఎదిగే ప్రకృతికి ఎంతో అవసరమే
క్షణం తరిగే ప్రకృతికి ఎంతో అనుభవమే
సమయం ఒదిగే ప్రకృతికి ఎంతో ఆధారమే

కాలంతో ఎదిగినా సమయంతో ఒదిగినా క్షణంతో తరిగేదము  || ప్రతి క్షణం ||