Thursday, March 30, 2017

స్నేహమా నీవు మరో దైవమా

స్నేహమా నీవు మరో దైవమా
స్నేహమా నీవు మరో హితమా
జీవితానికే నీవు పరమానందమా
నీవే నాలో దాగిన పర తత్వమా  || స్నేహమా ||

ఏమీ తోచని కార్యాలకు నీవే సలహా బంధమా
ఏమీ లేని రోజులకు నీవే మహా ఫల హారమా
ఏమీ కలగని సమస్యలకు నీవే పరిష్కారమా
ఏమీ కనిపించని రూపానికి నీవే ఆనందమా
ఏమీ కోరినా మార్గాన్ని చూపే మహా భావమా

మాటల పరిచయాలతో తెలిసే సమాచారమే కొత్త భావమా
జ్ఞాపకాలతో కలిసే విషయాలతో సంబంధాల స్నేహత్వమా

స్నేహం అందరికి తెలిసి తెలియని అనుభవమా
స్నేహంలో కలిగే కలహాలు మనకే గుణ పాఠమా     || స్నేహమా ||

ఎదురుగా కనిపించే రూపమే నీ స్వరూపమా
ఎక్కడ నీవు ఉన్నా నాలో ఎప్పటికి కుశలమా
ఎవరు ఉన్నా లేకున్నా నీ పలుకులే ప్రాణమా
ఎవరు రాకున్నా నీవు వచ్చే వేళయే సంతోషమా
ఎవరికి ఎవరు లేకున్నా నీ పిలుపే మహా బంగారమా

మాటల విషయాల పరస్పర సంబంధాలే స్వభావాల స్నేహమా
అవసరాల ఉపయోగాలకు తోడుగా నిలిచే వారధియే స్నేహితమా

స్నేహం ఎప్పటికి మరవని గొప్ప జ్ఞాపకమా
స్నేహం ఎప్పటికైనా ప్రతి జీవికి అనుభవమా   || స్నేహమా || 

Wednesday, March 29, 2017

విజ్ఞానం ఎంతో ఉంది విశ్వ కాలం ఎంతో ఉంది

విజ్ఞానం ఎంతో ఉంది విశ్వ కాలం ఎంతో ఉంది
అనుభవానికి సమయం ఎంతో అవసరం ఉంది

కాలంతో అనుభవం ఉపయోగమైన సాధన కార్యం
సమయంతో వినయం ఉపకారమైన యోగ్యత భావం

మనిషికే మహా జీవన రూపం ప్రతి జీవికే మహా జీవిత ధర్మం  || విజ్ఞానం ||

తరగని విజ్ఞానం తరతరాలకు అందించే ప్రజ్ఞానం
అన్వేషణతో సాగే విజ్ఞానం చరిత్రకు పరిశోధనం
సుదీర్ఘమైన కాల ప్రయాణం విజ్ఞాన ప్రభంజనం
అనుభవమైన విజ్ఞానం జీవనోపాధికే సంకేతం           || విజ్ఞానం ||

సాధనకు సాహసం నైపుణ్యమైన విజ్ఞాన సహనం
మహా కార్య దీక్షకు విజ్ఞానం సమయోచిత యోగం
అనుభవ విజ్ఞానం కాల మార్పులకు సూచనీయం
మానవ రూపం విజ్ఞాన సోపానాల మహా గొప్ప గ్రంధం  || విజ్ఞానం ||

Tuesday, March 28, 2017

ఈ లోకం ఒక ఆలయం ఈ భువనం ఒక మందిరం

ఈ లోకం ఒక ఆలయం ఈ భువనం ఒక మందిరం
జగమంతా ఓ శరణాలయం విశ్వమే ఓ దేవాలయం
కాలమే ఒక వేదాలయం సమయమే ఓ దైవాలయం  || ఈ లోకం ||

ప్రతి జీవికి తన దేహమే మహోన్నత దేహాలయం
ప్రతి శ్వాసకు తమ ధ్యాసే మహోదయ ఆలయం

ప్రతి రోజు మన లోకం మేధస్సుకే మహా ఆలయం
ప్రతి క్షణం మన విశ్వం ఆలోచనకే మహా మందిరం  

భావాలతో సాగే ప్రతి జీవికి తమ తత్వమే దేహానికి నిలయం
స్వభావాలతో ఎదిగే ప్రతి జీవికి తమ శ్వాసే దేహానికి నివాసం  || ఈ లోకం ||

కాలం తెలిపే అనుభవాల వేదాలకు దేహమే స్వరాలయం
సమయం చూపే కార్య మార్గాలకు సూర్య తేజమే మార్గాలయం

విజ్ఞానంతో ఎదిగే మహా మేధస్సుకు మహోదయ భావాలే క్షేత్రాలయం
వినయంతో సాగే ఆలోచనకు మహోన్నత స్వభావాలే ప్రశాంతాలయం  

ఉత్తేజంతో సాగే మేధస్సులో సూర్య కిరణాల తేజమే కార్యాలకు స్వర్ణాలయం
ఆలోచనలతో సాగే సూక్ష్మ పరిశోధన భావాలకు విజ్ఞాన సోపానాలే తత్వాలయం  || ఈ లోకం ||

Monday, March 27, 2017

విడిచిపో నీ రూపాన్ని మరచిపో నీ విజ్ఞానాన్ని మరణంతో

విడిచిపో నీ రూపాన్ని మరచిపో నీ విజ్ఞానాన్ని మరణంతో
నడిచిపో నీ గమ్యాన్ని తలచిపో నీ గౌరవాన్ని సజీవంతో    || విడిచిపో ||

జీవించే కాలం తెలుసుకునే సమయం మన జీవితానికే
నడిపించే కార్యం సాగించే సహనం మన జీవన వృద్ధికే

ఎంత కాలం జీవిస్తున్నా మన ఆకార రూపం తరుగునని
ఎంత జ్ఞానం పొందుతున్నా మన అనుభవం చాలదని   || విడిచిపో ||

ఉన్నప్పుడే కాస్త తీరిక చేసుకో ఉన్నంతలో ఊపిరి పీల్చుకో
ఉన్నట్లుగా జీవం సాగించుకో ఉంటూనే ఊహను చూసుకో

ఉదయించేది ఏదైనా అస్తమించేనని జన్మించిన నీకు మరణం తప్పదని
నీకోసం ఉన్నది ఏదైనా సొంతం కాదని సంపాదన ఖర్చులకే పరిమితమని   || విడిచిపో || 

కాలమా భావమా తెలియని గమనమా

కాలమా భావమా తెలియని గమనమా
వేదమా జ్ఞానమా తెలియని తరుణమా

మానవ జీవితానికే తెలియని బంధమా
మేధస్సున ఆలోచనకే తెలియని స్వభావమా!   || కాలమా ||

గాలి ఏ వైపు వీచినా కాలం ప్రతి దేశాన సాగెనే
నీరు ఏ వైపు ప్రవహించినా సముద్రాన్ని చేరెనే

సత్యం ఎక్కడ ఉన్నా ధర్మం అక్కడే రక్షింపబడేనని
విజ్ఞానం ఎక్కడ ఉన్నా అభివృద్ధి అక్కడే సాధ్యమని  || కాలమా ||

స్నేహం సంతోషం ఎక్కడ ఉంటే అక్కడే ప్రేమ బంధాలు చిగురించేనని
భావన ఆలోచన స్వభావాలు ఉంటే వేద విజ్ఞాన తత్వాలు ఉదయించేనని

కాలం ఎలా సాగిపోతున్నా తెలియని స్వభావాలు కొత్తగా పరిచయమయ్యేనులే
విజ్ఞానం ఎలా తెలుసుకున్నా తెలియని వేదాల అనుభవాలు వింతగా తోచేనులే  || కాలమా || 

Thursday, March 23, 2017

మరణం తెలిసిందా ప్రయాణం ముగిసిందా ఉదయం అస్తమించిందా

మరణం తెలిసిందా ప్రయాణం ముగిసిందా ఉదయం అస్తమించిందా
ప్రాణం నిలిచిపోయిందా మౌనం కలిగిందా హృదయం ఆగిపోయిందా

జీవితం అంతమౌతుందా  సందర్భం తెలిపిపోతుందా జీవనం నిలిచిపోతుందా
సమయం చెప్పి వస్తుందా కాలం తలచి పోతుందా తరుణం తపించి పోతుందా  || మరణం ||

శరణం లేని జీవితం అభయం లేని జీవనం ప్రశాంతమై కదిలేనా
విజ్ఞానం లేని గమనం ఉపయోగం లేని కార్యం సుఖాంతమై సాగేనా

భావమే లేని తత్వంతో స్పర్శ లేని స్వభావంతో మరణము సంభవించేనా
వేదమే లేని విజ్ఞానంతో మౌనమే లేని హృదయంతో మృత్యువు ఆవహించేనా  || మరణం ||

కారణం లేని కార్యం పరమార్థం లేని అర్థం పరిశోధన లేని పర్యవేక్షణ ఆగేనా
కాలం లేని కర్తవ్యం రూపం లేని ఆకారం దైవం లేని ధర్మం నిత్యం నిలిచేనా

ధైర్యం లేని జీవనం కోరిక లేని జీవితం విజ్ఞానం లేని కార్యం అంతమయ్యేనా
రక్షణ లేని జీవం శ్వాస లేని రూపం శాంతం లేని హృదయం నిలిచిపోయేనా  || మరణం || 

Tuesday, March 21, 2017

మరణాన్ని మరచేందుకా మన కార్యాల ప్రయాణం

మరణాన్ని మరచేందుకా మన కార్యాల ప్రయాణం
మరణాన్ని తొలచేందుకా మన ఆలోచనల విజ్ఞానం
మరణాన్ని విడిచేందుకా మన ఆహారముల ఆరోగ్యం
మరణాన్ని పంపించేందుకా మన భావ స్వభావాల తత్వం  || మరణాన్ని ||

మరణమే లేదనుకో నీ కార్యాలతో ముందుకు సాగిపో
మరణమే కాదనుకో నీ ఆహారములతో ఆరోగ్యం చూసుకో
మరణమే వద్దనుకో నీ ఆలోచనలతో విజ్ఞానం పెంచుకో
మరణమే రాదనుకో నీ భావాలతో తత్వాలను గ్రహించుకో

మరణం ఎలా వస్తున్నా పరిశోధనతో దేహాన్ని రక్షించుకో
మరణం ఎలా చూస్తున్నా పరిశీలనతో రూపాన్ని సాగించుకో    || మరణాన్ని ||

మరణం ఎప్పుడు సంభవించినా ఎదురించే సామర్థ్యం పెంచుకో
మరణం ఎక్కడ ఆవహించినా పోరాటంతో ధైర్యాన్ని నింపుకో

మరణం ఎవరితో వస్తున్నా ప్రశాంతతో శ్వాసను ఉంచుకో
మరణం ఎవరితో పోతున్నా పరధ్యాసతో జీవాన్ని బంధించుకో

మరణం ఏదైనా ఆత్మ ప్రశాంతతో సాగిపో
మరణం ఏమైనా జీవ శాంతంతో వెళ్ళిపో    || మరణాన్ని ||