Wednesday, December 27, 2017

నా ఆత్మలోనే ఎన్నో ఆత్మలు కలిసున్నాయి

నా ఆత్మలోనే ఎన్నో ఆత్మలు కలిసున్నాయి
నా దేహంలోనే ఎన్నో దేహాలు కలిసున్నాయి

నా జీవంలోనే ఎన్నో జీవాలు కలిసున్నాయి
నా రూపంలోనే ఎన్నో రూపాలు కలిసున్నాయి

ప్రతి  జీవిలో నేనే శ్వాసగా మిళితమై ఉన్నాను  || నా ఆత్మలోనే ||

ఆత్మగా ఉదయిస్తూ వస్తున్నా
దేహమై జీవిస్తూ ప్రయాణిస్తున్నా

జీవమై జన్మిస్తూ ప్రకాశిస్తున్నా
రూపమై స్మరిస్తూ ఎదుగుతన్నా

శ్వాసగా అవతరిస్తూ నిత్యం అధిరోహిస్తూనే ఉన్నా  || నా ఆత్మలోనే ||

ఆత్మలోనే అంతర్లీనమై అవతరించాను
దేహంలోనే దైవాత్మమై దర్శించుకున్నాను

జీవంలోనే జీవోదయమై జీవిస్తున్నాను
రూపంలోనే రమణీయమై రూపశినైనాను

శ్వాసలో స్వయంభువమై సర్వం సందర్శిస్తూనే ఉన్నా  || నా ఆత్మలోనే ||

Friday, December 22, 2017

భాష లేనిదే మేధస్సులో భావన లేదే

భాష లేనిదే మేధస్సులో భావన లేదే
బాష లేనిదే మేధస్సులో తత్వన లేదే

భాష లేనిదే ఆలోచనకు అర్థం లేదే
భాష లేనిదే ఆలోచనకు పరమార్థం లేదే  || భాష ||

భాష లేని భావం అక్షరం లేని పఠనం
భాష లేని తత్వం పదం లేని గణితం

భాష లేని పరిచయం తెలుపలేని తపనం  
భాష లేని సంఘటనం వివరించలేని విధం  || భాష ||

భాష లేనిదే మేధస్సుకు సరైన వివరణ లేదే
భాష లేనిదే ఆలోచనకు సరైన విజ్ఞానం లేదే

భాష లేనిదే సమయ స్పందన సరైన కాలానికి రాదే
భాష లేనిదే సమయ చలన సరైన సందర్భానికి రాదే   || భాష || 

శ్వాసపై ధ్యాసతోనే కార్యం శ్వాసపై ధ్యాసతోనే సర్వం

శ్వాసపై ధ్యాసతోనే కార్యం శ్వాసపై ధ్యాసతోనే సర్వం
శ్వాసపై ధ్యాసతోనే జ్ఞానం శ్వాసపై ధ్యాసతోనే అనంతం
శ్వాసపై ధ్యాసతోనే శాంతం శ్వాసపై ధ్యాసతోనే ప్రశాంతం  || శ్వాసపై ||

ఉచ్చ్వాస నిచ్వాసాల స్వధ్యాస గమనమే సుధీర్ఘ హృదయ చలనం
ఉచ్చ్వాస నిచ్వాసాల స్వధ్యాస ధ్యానమే సుధీర్ఘ హృదయ ప్రయాణం
ఉచ్చ్వాస నిచ్వాసాల స్వధ్యాస సౌఖ్యమే సుధీర్ఘ హృదయ ప్రశాంతం  || శ్వాసపై ||

స్వధ్యాస గమన చలనమే కార్యా చరణం
స్వధ్యాస గమన నైపుణ్యమే కార్య ఫలితం
స్వధ్యాస గమన సాధనమే కార్య ప్రశాంతం
స్వధ్యాస గమన జీవనమే కార్య పరిశోధనం  || శ్వాసపై || 

మంచినే నేర్చుకో మంచినే ఏలుకో

మంచినే నేర్చుకో మంచినే ఏలుకో
మంచినే ఇచ్చుకో మంచినే తీసుకో
మంచినే దాచుకో మంచినే ఉంచుకో
మంచినే పెంచుకో మంచినే పంచుకో
మనిషిగా మంచినే కోరుకో మంచినే చేసుకో  || మంచినే ||

మంచిగా ఎదుగుటకే మంచినే తెలుసుకో
మంచిగా ఒదుగుటకే మంచినే తెలుపుకో

మంచిగా జీవించుటకే మంచినే చూసుకో
మంచిగా సాగుటకే మంచినే మలుచుకో

మంచిగా ఉండుటకే మంచినే ఆదరించుకో
మంచిగా వెళ్ళుటకే మంచినే సందర్శించుకో  || మంచినే ||

మంచిలోనే జీవం మంచిలోనే ప్రేమం
మంచిలోనే హితం మంచిలోనే స్నేహం

మంచిలోనే సర్వం మంచిలోనే సత్యం
మంచిలోనే నిత్యం మంచిలోనే శాంతం

మంచిలోనే భావం మంచిలోనే తత్వం
మంచిలోనే దైవం మంచిలోనే ప్రశాంతం  || మంచినే || 

సమయంతో సాగిపోయే రూపం కాలంతో నిలిచిపోయే దేహం

సమయంతో సాగిపోయే రూపం కాలంతో నిలిచిపోయే దేహం
మనస్సుతో సాగిపోయే భావం వయస్సుతో నిలిచిపోయే తత్వం  || సమయంతో ||

మేధస్సుతో ఎంత ఎదుగుతున్నా వయస్సుతో అంతగా ఒదుగుతున్నా
మనస్సుతో ఎంత ఎదుగుతున్నా ఆయుస్సుతో అంతగా ఒదుగుతున్నా

జీవంతో ఎంత ఎదుగుతున్నా ధ్యానంతో అంతగా ఒదుగుతున్నా
రూపంతో ఎంత ఎదుగుతున్నా దేహంతో అంతగా ఒదుగుతున్నా   || సమయంతో ||

సాధనతో ఎంత ఎదుగుతున్నా కార్యంతో అంతగా ఒదుగుతున్నా
ప్రేమంతో ఎంత ఎదుగుతున్నా స్నేహంతో అంతగా ఒదుగుతున్నా

జగతితో ఎంత ఎదుగుతున్నా దైవతితో అంతగా ఒదుగుతున్నా
ప్రకృతితో ఎంత ఎదుగుతున్నా విశ్వతితో అంతగా ఒదుగుతున్నా  || సమయంతో || 

Thursday, December 14, 2017

మేధస్సును మరువలేను ఆలోచనను ఆపలేను

మేధస్సును మరువలేను ఆలోచనను ఆపలేను
మనస్సును నిలుపలేను భావనను తొలచలేను

మనస్సు ఉన్నంత కాలం మేధస్సులో భావాలోచన చలించేను  || మేధస్సును ||

శ్వాసతో చలనం ధ్యాసతో కదలికం ఆలోచనతో అనేకం
భాషతో గమనం జీవంతో ప్రయాసం భావనతో మమేకం

కాలంతో ప్రయాణం సమయంతో కార్యాచరణం
వేదంతో పరిశోధనం విజ్ఞానంతో అనుభవగారం   || మేధస్సును ||

రూపంతో బంధాల పరిచయం దేహంతో ప్రకృతి పరిశోధనం
మేధస్సుతో భావాల మధురం మనస్సుతో విశ్వతి ప్రయాణం

పరభాషతో మాటల మాధుర్యం పరధ్యాసతో కాలమంతా తపనం
వయస్సుతో వేదాల పాండిత్యం మనస్సుతో జగమంతా గమనం   || మేధస్సును || 

మేధస్సునే పరిశోధించాను మేధస్సుతోనే అన్వేషించాను

మేధస్సునే పరిశోధించాను మేధస్సుతోనే అన్వేషించాను
మేధస్సునే తిలకించాను మేధస్సుతోనే ఆలోచించాను
మేధస్సునే మెప్పించాను మేధస్సుతోనే అధిగమించాను

మేధస్సులోనే సర్వ లోకాల విశ్వ చరితాన్ని దర్శించాను  || మేధస్సునే ||

ప్రయత్నించుటలోనే విఫలమైన సాధనతో అనుభవం కలిగేను
పరిశోధించుటలో అల్పజ్ఞానమైన సాహసంతో విజ్ఞానం తెలిసేను
ప్రయాణించుటలో ఆటంకమైన పఠనంతో వేదాంతం తెలియును  || మేధస్సునే ||

ఆలోచనలో తెలియని వేదం ఆచరణలో తెలిసేను వేదాంతం
భావనలో తెలియని గమనం ఆదరణతో తెలియును విజ్ఞానం
తత్వనలో తెలియని చలనం ఆదర్శనలో తోచేను అనుభవం  || మేధస్సునే ||