ఓ సూర్యదేవా నీవే నా గమనం నీవే నా చలనం
ఓ సూర్యదేవా నీవే నా ఉదయం నీవే నా హృదయం
నీవే నా గమనంలో వేద భావం నీవే నా చలనంలో జీవ తత్వం
నీవే నా ఉదయంలో సర్వ కార్యం నీవే నా హృదయంలో నిత్య తేజం || ఓ సూర్యదేవా ||
నా మేధస్సును ఉత్తేజముచే ఆలోచింపజేసెదవా
నా మేధస్సును ప్రజ్వలముచే తిలకింపజేసెదవా
నా దేహాన్ని ఆరోగ్యవంతం చేసే అపురూప తేజస్సు నీవే
నా రూపాన్ని ఆనందవంతం చేసే ఆకారపు ఉషస్సు నీవే || ఓ సూర్యదేవా ||
నా భావ కార్యాలను విజయవంతంగా జరిపెదవా
నా తత్వ బంధాలను సగర్వంతంగా సాగించెదవా
నా మేధస్సులో ఆలోచన సైతం నీ గమన జీవమే
నా మేధస్సులో ఆరాధన సైతం నీ చలన దేహమే || ఓ సూర్యదేవా ||

No comments:
Post a Comment