Showing posts with label రక్షణ. Show all posts
Showing posts with label రక్షణ. Show all posts

Thursday, January 5, 2017

చిరంజీవ జై చిరంజీవ రావా ప్రకృతి పర్యావరణ రక్షణకై ఆకాశత్వంతో రావా

చిరంజీవ జై చిరంజీవ రావా ప్రకృతి పర్యావరణ రక్షణకై ఆకాశత్వంతో  రావా
చిరంజీవ జై చిరంజీవ రావా పంచ భూతాల పరి రక్షణకై అద్వైత్వంతో రావా
నీవే మా రక్ష నీవే మా ధీక్ష నీవు చూపే దైవత్వముకై అవధూతత్వంతో రావా   || చిరంజీవ ||

సర్వభూతాలకు అధిపతివైన జగదేక వీరశూర విశ్వ భూపతివై రావా
అష్ఠభూతాలకు జగపతివైన ఆదిశంకర మహాశూర లోకాధిపతివై రావా

పరధ్యానంలో ఉన్న పరధ్యాసలో ఉన్నా పరమాత్మవై పర జీవులకై రావా
పరతత్వంలో ఉన్న పరరూపంలో ఉన్నా పరంధామవై పర జ్ఞానులకై రావా   || చిరంజీవ ||

ఏ ప్రదేశంలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా ప్రజల సమావేశానికై ఆది నాయకుడివై రావా
ఏ లోకంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మహా ప్రజల శ్రేయస్సుకై సభా నాయకుడిగా రావా

ఏ భావంతో ఉన్నా ఏ తత్వంతో ఉన్నా ఏ అణువులో లీనమై ఉన్నా ఆత్మ మహాత్మగా రావా
ఏ జీవంతో ఉన్నా ఏ దేహంతో ఉన్నా ఏ పరమాణువులో కొలువై ఉన్నా పర బ్రంహగా రావా  || చిరంజీవ ||

ప్రకృతి సృష్టించే బీభత్సాలను సరైన స్థితిలో ఉంచేందుకు పరిపాలకుడివై రావా
పంచ భూతాలను సక్రమమైన పద్ధతిలో నిలిపేందుకు సర్వ సేనాధిపతివై రావా

భూగోళాన్ని సరైన కక్ష్యలో కాల భ్రమణం చేసేలా భాగస్వామివై బ్రంహాండాన్ని రక్షించుటకు రావా
సర్వ లోకాలను మహారాజులా కాపాడేందుకు సహాయకుడిగా కాలజ్ఞాన వేదాంత పండితుడివై రావా  || చిరంజీవ ||

Tuesday, October 25, 2016

ఎగిరిపో నేస్తమా చేరుకో మిత్రమా నీ దేశంలో కుశలమా

ఎగిరిపో నేస్తమా చేరుకో మిత్రమా నీ దేశంలో కుశలమా
నీ దేశమే ప్రశాంతమా నీవు జీవించే స్థానమే పరవశమా
జన్మించిన ఒడిలోనే ఉండిపో హాయిగా సాగిపో హితమా  || ఎగిరిపో ||

కలతలే లేనట్లు కలవరమే పడనట్లు కష్టాలే పూర్తిగా తొలగేనా
నష్టాలే రానట్లు  తడబడుట లేనట్లు కార్యాలే విజయమై సాగేనా

ఆనందమే నీకు వారధిగా అవధులే లేనట్లు ఆకాశంలో ఎగిరిపో
సంతోషమే నీకు వాహనగా అలసట లేనట్లు ఎక్కడికైనా వెళ్ళిపో  || ఎగిరిపో ||

ఎక్కడ ఉన్నా నీవు నిశ్చలంగా స్థిరపడిపో క్షేమముగా
ఎలా ఉన్నా నీవు రక్షణ దృక్పధంతో ఉండిపో జాగ్రత్తగా

ఎదురయ్యే సమస్యలు ఏవైనా నీకు నీవే పరిష్కారమా
ఎదురయ్యే ప్రకంపనలు ఏవైనా నీకు నీవే పరిశోధనమా  || ఎగిరిపో || 

Wednesday, October 5, 2016

అమ్మ అంటే ప్రాణమని అమ్మ అంటే ఊపిరని

అమ్మ అంటే ప్రాణమని అమ్మ అంటే ఊపిరని
అమ్మ అంటే జీవమని అమ్మ అంటే శ్వాస అని
అమ్మతోనే జన్మించి ఎదిగాము మహా రూపమై     || అమ్మ ||

అమ్మగా లాలించి దీవిస్తుంది
తల్లిగా ఓదార్చి పలికిస్తుంది
మాటలనే నేర్పిస్తూ నడిపిస్తుంది
విజ్ఞానాన్నే భోదిస్తూ మెప్పిస్తుంది

అమ్మయే మహాత్మగా దైవత్వం చూపుతుంది
తల్లియే పరమాత్మగా కరుణామృతం చాటుతుంది  || అమ్మ ||

అమ్మగా స్నేహాన్ని తెలుపుతుంది
తల్లిగా ధైర్యాన్ని ఇచ్చేస్తుంది
రక్షణగా మనతోనే ఉండిపోతుంది
మాతగా మన కోసమే జీవిస్తుంది

అమ్మయే మహర్షిగా వేదాలనే వివరిస్తుంది
తల్లియే దేవర్షిగా అనుభవాలనే కలిగిస్తుంది  || అమ్మ || 

Friday, August 19, 2016

విశ్వం నీలో ఉన్న మాట నీ మేధస్సుకు తెలిసేనా

విశ్వం నీలో ఉన్న మాట నీ మేధస్సుకు తెలిసేనా
జీవంలోనే విశ్వం ఉన్న మాట నీ ఆలోచనకు తెలిసేనా  || విశ్వం ||

విశ్వమే జీవమై ప్రకృతిలో పంచభూతాలను విశ్వ శక్తిగా నీ శ్వాసలో చేర్చేనా
శ్వాసలో జీవమే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రకృతిగా ప్రాణ వాయువునే స్వీకరించేనా

ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాసతో హృదయంలో ప్రాణ వాయువు చేరి జీవించేనా
హృదయం పనిచేసే తీరును మేధస్సే గమనిస్తూ శరీర కణాల కార్యాలను గుర్తించేనా

శరీరంలోని ప్రతి అణువు కణాలను గమనించే స్థితి మేధస్సుకు స్పర్శగా తెలిసేనా
మేధస్సులోని స్పర్శ కణాలే మన అంతర్గత భావ శరీర రక్షణ కార్యాలను చూసేనా   || విశ్వం ||

శ్వాసే మనకు ఉత్తేజమై మేధస్సుకు హృదయానికి జీవమై శరీరాన్ని జీవింపజేయునా
శ్వాసే మనకు ఆరోగ్యమై మహా ప్రాణ వాయువై ఆహార శక్తిగా శరీరాన్ని జీవింపజేయునా

ఆహార స్థితియే ఆరోగ్య స్థితిగా మేధస్సులో ఆలోచన భావాలు ఉన్నంతవరకు జీవం ఉండును
జీర్ణ వ్యవస్థ ఆలోచన వ్యవస్థ ఉన్నంతవరకు ఆరోగ్యంతో శరీరం విశ్వ శక్తిగా జీవిస్తూనే ఉండును

మేధస్సుతో మన శరీర వ్యవస్థను ఓ గొప్ప గమనంతో మహా ఎరుకతో ఆరోగ్యాంగా చూసుకోవాలి
మన ఆలోచనల తీరులోనే సూర్యోదయ శక్తి ఉదయిస్తూ విశ్వ శక్తి ఉత్తేజమై జీవించును

ప్రకృతి గాలి సూర్య రశ్మి శుద్ధమైన నీరు వాతావరణ స్థితి శరీరానికి చాలా అవసరం
నిద్ర మంచి పోషక ఫల ఆహారం కార్య గమన ధ్యాస ధ్యాన ఉత్తేజం శ్వాసకు ముఖ్యం  || విశ్వం ||