అమ్మ అంటే ప్రాణమని అమ్మ అంటే ఊపిరని
అమ్మ అంటే జీవమని అమ్మ అంటే శ్వాస అని
అమ్మతోనే జన్మించి ఎదిగాము మహా రూపమై || అమ్మ ||
అమ్మగా లాలించి దీవిస్తుంది
తల్లిగా ఓదార్చి పలికిస్తుంది
మాటలనే నేర్పిస్తూ నడిపిస్తుంది
విజ్ఞానాన్నే భోదిస్తూ మెప్పిస్తుంది
అమ్మయే మహాత్మగా దైవత్వం చూపుతుంది
తల్లియే పరమాత్మగా కరుణామృతం చాటుతుంది || అమ్మ ||
అమ్మగా స్నేహాన్ని తెలుపుతుంది
తల్లిగా ధైర్యాన్ని ఇచ్చేస్తుంది
రక్షణగా మనతోనే ఉండిపోతుంది
మాతగా మన కోసమే జీవిస్తుంది
అమ్మయే మహర్షిగా వేదాలనే వివరిస్తుంది
తల్లియే దేవర్షిగా అనుభవాలనే కలిగిస్తుంది || అమ్మ ||
అమ్మ అంటే జీవమని అమ్మ అంటే శ్వాస అని
అమ్మతోనే జన్మించి ఎదిగాము మహా రూపమై || అమ్మ ||
అమ్మగా లాలించి దీవిస్తుంది
తల్లిగా ఓదార్చి పలికిస్తుంది
మాటలనే నేర్పిస్తూ నడిపిస్తుంది
విజ్ఞానాన్నే భోదిస్తూ మెప్పిస్తుంది
అమ్మయే మహాత్మగా దైవత్వం చూపుతుంది
తల్లియే పరమాత్మగా కరుణామృతం చాటుతుంది || అమ్మ ||
అమ్మగా స్నేహాన్ని తెలుపుతుంది
తల్లిగా ధైర్యాన్ని ఇచ్చేస్తుంది
రక్షణగా మనతోనే ఉండిపోతుంది
మాతగా మన కోసమే జీవిస్తుంది
అమ్మయే మహర్షిగా వేదాలనే వివరిస్తుంది
తల్లియే దేవర్షిగా అనుభవాలనే కలిగిస్తుంది || అమ్మ ||
No comments:
Post a Comment