శాంతం ప్రశాంతం మనస్సే ఏకాంతం
భావం ప్రభావం వయస్సే సుఖాంతం
లోకం పర లోకం మనిషికే వేదాంతం || శాంతం ||
ఏనాటికో మనకు ఏకాంతము ఎవరితో మనకు సుఖాంతము
ఎప్పటికో మనకు సర్వాంతము ఎందుకో మనకు వేదాంతము
ఏకాంతమే ఏకాగ్రతమై విజ్ఞానమే ప్రజ్ఞానమయ్యేను
భావాంతమే స్వభావమై ఊహత్వమే వేదాంతమయ్యేను
సుఖాంతమే సంపూర్ణమై సర్వత్వమే సమాప్తమయ్యేను || శాంతం ||
కాలమే మనకు కార్య గమనమై సమయమే సాగిపోవును
నాదమే మనకు వేద వచనమై విజ్ఞానమే వెలిగిపోవును
విశ్వాంతమే జీవత్వమై దేహమే ఉదయించేను
ప్రశాంతమే ఏకత్వమై దైవమే ప్రజ్వలించేను
సర్వాంతమే సమాప్తమై ధర్మమే అస్తమించేను || శాంతం ||

No comments:
Post a Comment