వర్ణాల రూపమా గంధాల భావమా
సువర్ణాల స్వభావమా సుగంధాల తత్వమా
సువాసనల జీవమా సుమధురాల సౌందర్యమా || వర్ణాల ||
నీలోని భావాలే నాలో మొదలైన స్వప్నాల సౌఖ్యాలే
నీలోని గాలులే నాలో సోకిన ఉచ్చ్వాస నిచ్చ్వాసాలే
నీ మేధస్సులో ఆలోచనై నేనే ఉండి పోతాను హాయిగా
నీ మనస్సులో మౌనమై నేనే నిలిచిపోతాను శాంతంగా
నీ దేహం నాకు తోడైన వేళలో జీవితమే వేదాల సాగరం
నా రూపం నాకు నీడైన వేళలో జీవనమే వేదాంతాల తీరం || వర్ణాల ||
నీ కోసమే జీవితం నీ ధ్యాసతో నా లోనే ప్రయాణం
నీ కోసమే జీవనం నీ భావనతో నా కార్యాల గమనం
నీవు వస్తుంటే చిరు గాలితోనైనా నా భావాలతో జీవిస్తాను
నీవు చూస్తుంటే చిన్న ఆశతోనైనా నా కార్యాలను సాగిస్తాను
నీవే నా బంధమై అనుబంధనాన్ని పెనవేసుకో
నీవే నా స్వర రాగమై అనురాగాన్ని పంచేసుకో || వర్ణాల ||

No comments:
Post a Comment