ఓ కృష్ణా నీవే పరమాత్మవా
ఓ బ్రంహా నీవే పరంధామవా
ఓ మహేశ్వరా నీవే పరంజ్యోతివా
పర లోకాలకు మీరే పరస్పర బంధువులా || ఓ కృష్ణా ||
ప్రతి జీవికి ఒక తత్వాన్ని కలిగించే పరమాత్మవు నీవేలే
ప్రతి జీవికి ఒక భావాన్ని కలిగించే పరంధామవు నీవేలే
ప్రతి జీవికి ఒక గుణాన్ని కలిగించే పరంజ్యోతివి నీవేలే
పర తత్వాలతో మా జీవితం సాగుతున్నది ప్రయాసగా
పర భావాలతో మా జీవనం జరుగుతున్నది భారముగా
పర స్వభావాలతో మా కాలం ప్రయాణిస్తున్నది వేదనగా || ఓ కృష్ణా ||
నిజంగా నీవే ఉంటే సత్యం తెలిసేను మనకు
నీడగా నీవే ఉంటే స్నేహమే తెలిపేను మనకు
ప్రాణంగా నీవే ఉంటే ప్రేమే తెలియును మనకు
ఏ శ్వాసలో ఉన్నావో ఏ ధ్యాసతో ఉన్నావో తెలిసేదెలా
ఏ జీవిలో ఉన్నావో ఏ దేహంతో ఉన్నావో కనిపించేదెలా
ఏ రూపంలో ఉన్నావో ఏ దైవంతో ఉన్నావో గ్రహించేదెలా || ఓ కృష్ణా ||

No comments:
Post a Comment