ఒక శ్వాసగా ఒక ధ్యాసగా సాగేనే నా మనస్సు
ఒకే భాషగా ఒకే యాసగా సాగేనే నా వయస్సు
నాలోని హృదయమే నీలో ఒకటై జీవిస్తున్నదే
నేను నేనుగా లేక నీలోనే నీతో ఉండిపోయానే || ఒక శ్వాసగా ||
ప్రేమించే భాషకు అర్థం ఒకటేనని తెలిపినదే నా మనస్సు
ప్రేమించే ధ్యాసకు లోకం ఒకటేనని తెలిపిందే నా వయస్సు
ప్రేమతో సాగే నా శ్వాస నీతోనే ధ్యాసగా సాగుతున్నదే
ప్రేమతో సాగే నా మనస్సు నీతోనే మౌనమై పోయినదే || ఒక శ్వాసగా ||
ప్రతి శ్వాసలో నీ ధ్యాసే నన్ను జీవింపజేస్తున్నది
ప్రతి ధ్యాసలో నీ శ్వాసే నన్ను పలికించేస్తున్నది
ప్రతి క్షణం ఒక ధ్యాస ఒక శ్వాస అదే నా ప్రియమైన భాష
ప్రతి నిమిషం ఒక ధ్యాస ఒక శ్వాస అదే నా ప్రియతమ ఘోష || ఒక శ్వాసగా ||

No comments:
Post a Comment