రూపంలో చలనం లేదు ఆకారంలో కదలిక లేదు
భావంలో అర్థం తెలియదు శ్వాసలో ధ్వనితం లేదు
చూపులో గమ్యం లేదు హృదయంలో నాదం లేదు || రూపంలో ||
ఏనాటి మహాత్మ రూపమో ఏనాటికి తెలియని ఆత్మ భావము
ఏనాటి జీవాత్మ ఆకారమో ఏనాటికి తెలియని పర తత్వము
ఎవరికి తెలియని భావంతో నిలిచిపోయిన రూపం శిల్పత్వము
ఎవరికి తోచని స్వభావంతో ఒదిగిపోయిన ఆకారం కల్పత్వము || రూపంలో ||
మానవుడిగా ఉదయించి మాధవుడిగా ఎదిగిన మహాత్ముడే ఇతడు
మాధవుడిగా జీవించినా పరంధామగా ఒదిగిన పరమాత్ముడే ఇతడు
జీవితమే అఖండమైన తత్వాలతో సాగించిన కాల బంధువుడు
జీవనమే అఖిలమైన సత్యాలతో పలికించిన సమయ మిత్రుడు || రూపంలో ||

No comments:
Post a Comment