Showing posts with label వైశాఖం. Show all posts
Showing posts with label వైశాఖం. Show all posts

Thursday, August 4, 2016

నిశ్శబ్దమే సత్యమై ఏకాగ్రతయే మౌనమై మేధస్సుకే మహా విజ్ఞానమవుతుంది

నిశ్శబ్దమే సత్యమై ఏకాగ్రతయే మౌనమై మేధస్సుకే మహా విజ్ఞానమవుతుంది
ఆలోచనే భావమై జ్ఞాపకమే తత్వమై మేధస్సుకు మహా గుణ విచక్షణవుతుంది || నిశ్శబ్దమే ||

సత్యాన్ని జయించుటకే మహా విజ్ఞానం మనలో చేరుతుంది
విచక్షణతో మెలగుట కొరకే మనలో ఓ సద్భావన చిగురిస్తుంది
దైవత్వంతో నడుచుటకై సత్య ధర్మం మనలో నిలిచిపోతుంది

నిశ్శబ్దంగా ప్రశాంతతో చేసే సాధన ఓ గొప్ప విజయమై నీలో చేరుతుంది
ఏకాగ్రతతో మౌనంగా చేసే అధ్యాయం మహా వేదమై నీలో నిలిచిపోతుంది
భావాలతో ఆలోచన చేసే తీరులోనే నీకై ఓ గొప్ప వేదాంతం ఉదయిస్తుంది || నిశ్శబ్దమే ||

పరిశోధనతో పరిజ్ఞానం పరిశీలనతో పరిపూర్ణత ప్రయోగంతో పరమార్థం
ప్రకృతిలో పర్యవేక్షణ పరిశుద్దత తత్వం సహచర ధర్మం సద్గుణ భావం

విజ్ఞానంతో వైభోగం వసంతాల వైశాఖం వర్ణాల సువర్ణోత్సవం శుభోదయం
వేదంతో వేదాంతం వేదాల సంకల్పం విశ్వాంతర వేదన వచనం వదనం || నిశ్శబ్దమే ||