Showing posts with label సంకల్పం. Show all posts
Showing posts with label సంకల్పం. Show all posts

Monday, November 7, 2016

ఎవరో నీవు ఎవరో అనుకున్నా మనమంతా జనతా ఈ జగమంతా

ఎవరో నీవు ఎవరో అనుకున్నా మనమంతా జనతా ఈ జగమంతా
ఎవరో మనమెవరో అనుకున్నా మనమంతా జనతా ఈ జగమంతా  || ఎవరో ||

నీవే ఓ ప్రణామం తెలుపవా ప్రకృతిలో జీవిస్తున్నందుకు
నీవే ప్రభోదం గ్రహించవా జగతిలో విజ్ఞానాన్ని పొందుటకు
నీవే ప్రమాణం చేసుకోవా మన సృష్టిని మనమే రక్షించుటకు
నీవే సమస్తం తెలుసుకోవా ఎప్పటికైనా సమాప్తం అయ్యేందుకు
నీవే పరిశోధనం చేయవా విశ్వంలో ఉన్న ప్రజ్ఞానాన్ని పంచేందుకు

నీవు నేను మనమే జగతికి ప్రసిద్ధం ప్రపూర్ణం ప్రయోజనం          || ఎవరో ||

నీవే ప్రయాణం చేస్తూనే కాలంతో జరిగే ప్రమేయం ఎందుకో తెలుసుకోవాలి
నీవే ప్రణామం స్వీకరిస్తూనే జరుగుతున్న ప్రయోగం ఎందుకో తెలుపుకోవాలి
నీవే ప్రపంచం వీక్షిస్తూనే జరగబోయే పరిశోధనం ఎందుకో తెలియజేయాలి
నీవే సంకల్పం వహిస్తూనే జరగాలన్న మహా సంభోగం ఎందుకో తెలుపుకోవాలి
నీవే ప్రభావం చూపిస్తూనే జరిగిన కాలంతో ప్రశాంతం ఎందుకో తపించిపోవాలి

నీవు నేను మనమే జగతికి పరిశుద్ధం పరిపూర్ణం పరిమళం          || ఎవరో ||  

Tuesday, September 6, 2016

జయహో జనతా ఈ జగమంతా జయహో జనతా

జయహో జనతా ఈ జగమంతా జయహో జనతా
జయహో జనతా ఈ యుగమంతా జయహో జనతా   || జయహో జనతా ||

ప్రభాతం ప్రమోదం ప్రణామం  ప్రశాంతం
ప్రపంచం ప్రమేయం ప్రయోగం ప్రయాణం
ప్రభావం ప్రసిద్ధం ప్రమాణం ప్రయోజనం

సూర్యోదయ సుప్రభాతం విశ్వానికే ప్రావీణ్యం
నవోదయమే సుప్రభావం జగానికే పరిశోధనం   || జయహో జనతా ||

సమస్తం సంకల్పం సహస్త్రం సమాప్తం
సమీపం సంయుక్తం సంయోగం సంభోగం
సంగ్రామం సమూహం సంకేతం సంకీర్తం

ప్రకృతిలో పరిమళం పారిజాతం పరిశుద్ధం
సృష్టిలో ఆకారం మహా స్వరూపం అమోఘం   || జయహో జనతా || 

Thursday, August 4, 2016

నిశ్శబ్దమే సత్యమై ఏకాగ్రతయే మౌనమై మేధస్సుకే మహా విజ్ఞానమవుతుంది

నిశ్శబ్దమే సత్యమై ఏకాగ్రతయే మౌనమై మేధస్సుకే మహా విజ్ఞానమవుతుంది
ఆలోచనే భావమై జ్ఞాపకమే తత్వమై మేధస్సుకు మహా గుణ విచక్షణవుతుంది || నిశ్శబ్దమే ||

సత్యాన్ని జయించుటకే మహా విజ్ఞానం మనలో చేరుతుంది
విచక్షణతో మెలగుట కొరకే మనలో ఓ సద్భావన చిగురిస్తుంది
దైవత్వంతో నడుచుటకై సత్య ధర్మం మనలో నిలిచిపోతుంది

నిశ్శబ్దంగా ప్రశాంతతో చేసే సాధన ఓ గొప్ప విజయమై నీలో చేరుతుంది
ఏకాగ్రతతో మౌనంగా చేసే అధ్యాయం మహా వేదమై నీలో నిలిచిపోతుంది
భావాలతో ఆలోచన చేసే తీరులోనే నీకై ఓ గొప్ప వేదాంతం ఉదయిస్తుంది || నిశ్శబ్దమే ||

పరిశోధనతో పరిజ్ఞానం పరిశీలనతో పరిపూర్ణత ప్రయోగంతో పరమార్థం
ప్రకృతిలో పర్యవేక్షణ పరిశుద్దత తత్వం సహచర ధర్మం సద్గుణ భావం

విజ్ఞానంతో వైభోగం వసంతాల వైశాఖం వర్ణాల సువర్ణోత్సవం శుభోదయం
వేదంతో వేదాంతం వేదాల సంకల్పం విశ్వాంతర వేదన వచనం వదనం || నిశ్శబ్దమే ||