Monday, June 13, 2016

విశ్వమే పిలిచింది జగతియే తెలిపింది

విశ్వమే పిలిచింది జగతియే తెలిపింది
మనస్సులోని మాట ఈనాడే తెలిసింది
ఏనాటిదో ఈ పిలుపు ఇప్పుడే తోచినది   || విశ్వమే పిలిచింది ||

విశ్వానికి నా భావన తెలిసినది
నా భావనతో పిలుపే తెలిపింది

నాతోనే ఉన్న భావన జగతికే అంకితమంది
నాలో ఉన్న వేదన విశ్వానికే మధురమంది

ఏనాటికైనా ఈ జగతి నాతోనే వస్తానంది
ఎప్పటికైనా ఈ విశ్వం నాతోనే  జీవిస్తానంది  || విశ్వమే పిలిచింది ||

నాలోనే ఉన్న ఎన్నో విశ్వ భావాలు జగతికే తెలపాలి
నాతోనే ఉన్న ఎన్నో స్వభావాలు విశ్వానికే తెలియాలి

ఏనాటిదో ఈ మధురం జన్మతో జగతికి అంకితం
ఏనాటిదో ఈ విజ్ఞానం మరణంతో విశ్వానికి సొంతం

తెలిసినది నా భావన విశ్వానికి ఓ సమయాన
తెలిపినది నా వేదన జగతికి ఓ క్షణ కాలాన    || విశ్వమే పిలిచింది ||

ఉదయించేను సూర్య కిరణం జ్వలించేను అరుణ కిరణం

ఉదయించేను సూర్య కిరణం జ్వలించేను అరుణ కిరణం
మనస్సులో స్వయంవరం వయస్సులో కలిగే స్వరంవరం
జీవితమే సుమధురం జీవనమే సుగంధాల సముద్ర తీరం  || ఉదయించేను ||

ఉదయించే భావాలతో మొదలయ్యేను నాలో ఆలోచనల తీరం
కిరణాల తేజస్సులతో నాలో కలిగేను భావాల వేద వర్ణ విజ్ఞానం

యదలో ప్రజ్వలించే వర్ణ తేజ భావం సముద్రాన్ని తాకే రూప వర్ణం
మేఘంతో సాగే ఆలోచన కిరణాల అంచులతో కలిసే సంధ్యావనం

ప్రకృతిలో జీవించే జీవితం వయసులో కలిగే మొహం ఓ వందనం
అడుగులు కలిసే లోకం మనస్సులో సాగే భావం ఓ స్వయంవరం  || ఉదయించేను ||

స్వరాలతో సాగే సంభాషణలో ఉన్నది ఓ విశేషం అది అర్థానికే మహా నిర్వచనం
సుగంధాలతో సాగే వేదనలో ఉన్నది ఓ ప్రత్యేకం అది పరమార్థానికే అనుబంధం

విశ్వ వేదం మేఘ వర్ణం జగతిలో నిలిచే తరుణం మనలో కలిగే సమయ భావం
వర్ణ కిరణం తేజో భావం సృష్టిలో కలిగే వచనం వయసులో మొదలే లోక జ్ఞానం

ఎన్నో భావాల జీవితాలు సాగేను సముద్ర తీరాల మేఘ వర్ణాల రూపాలలో
ఎన్నో ఆశలు మొదలయ్యేను స్వప్న భావాల అలలతో సంధ్యా సమయంలో  || ఉదయించేను ||

Wednesday, June 8, 2016

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
నీవు సాగే ప్రయాణంలోనే ప్రతి ఒక్కరు ప్రయాణాన్ని సాగించెదరు
నీవు జన్మించిన రహదారిలోనే మరణించే మార్గం ఉందని తెలిపారు
మరణమే గమ్యమని తెలిసినా నీ దారిలోనే ఎందరో శ్రమించెదరు     || ఓ బాటసారి ..... ||

ప్రయాణంతో సాగే శ్వాసకు అలసట లేదా హృదయానికి విశ్రాంతి లేదా
మేధస్సుకే లేని నిలకడతో సాగే ప్రయాణం మన జీవన జీవిత మార్గమే

నిలిచిపోయే మార్గ స్థానమే మరణమని మౌనం తెలిపిందా నీలో
అలసిపోయే దారి జాడయే నిలకడ లేని ప్రయాణమని తోచిందా నీలో

నీలో కలిగే భావాలన్నీ మార్గాన్ని చూపే అడుగు జాడలే
నీలో సాగే ఆలోచనలు ప్రయాణాన్ని సాగించే మార్గములే   || ఓ బాటసారి ..... ||

ఎంత కాలం శ్రమించినా మన జీవితం ఓ మరణ గమ్యమే
ఎందరో ఉన్నా మన జీవనం కొంత కాలానికి అంతమే

ఎవరు ఏ మార్గాన జీవిస్తారో ఎంత కాలం ఉంటారో తెలియదే
ఎవరికి ఏది తోచినా ఏమని తెలిసినా మన సమయం కొంతే

ఇది మరణమో ప్రయాణమో సాగిపోయే కాల జ్ఞాన అనుభవమో
విజ్ఞానమే తెలుపని పరిశోధన మరణాన్ని చేరుకునే పర్యవేక్షణా || ఓ బాటసారి ..... ||

Thursday, June 2, 2016

మాట మాట పలకరింపులో భావాన్ని మరవద్దు

మాట మాట పలకరింపులో భావాన్ని మరవద్దు
భావాలతో సాగే చర్చలలో హద్దులు మీరవద్దు   || మాట మాట ||

మాటలలో మంచి లేకపోతేనే వాదనలో ఆవేదన కలిగేను
సంభాషణలో అర్థం లేకపోతేనే ఆవేదన అనర్థమై సాగేను

మనం ఎదిగిన జ్ఞానముతోనే సంభాషణ విధానము సాగిపోయేను
సంభాషణలో విజ్ఞానము లేకపోతేనే వేదన వాదనలే ఆవేదనయ్యేను

అర్థాన్ని గ్రహించి పరమార్థాన్ని మెప్పించి మాటలలో అనుకువ ఉండాలి  
అహం లేని మన ఎదుగుదలతోనే ఒదిగిపోయే లక్షణంతో మాటలు సాగాలి  || మాట మాట ||

ఎంతటి మాటల చర్చలు జరిగినా సమాధానాలను ప్రశాంతంగా తెలుపుకోవాలి
ఎలాంటి పదాల వాదన సాగినా మన మాటలలో గౌరవ పదభూషణం ఉండాలి

ఎంత నేర్చినా అనుభవం మన జీవన తీరులోనే వస్తూ సాగుతుంది
ప్రయత్నం చేస్తేనే మాటల పదాల ఉచ్చరణ గొప్పగా ఉంటుంది

పదాలు పలకరింపులకే గాని వాదనలకు కాదని విజ్ఞానం తెలుపుతుంది
సమస్యలే వాదనలై మనం కలుగజేసుకునే ఆవేదనలను హెచ్చుగా సూచిస్తుంది || మాట మాట || 

ఓ బాటసారి... నీవు నడిచే మార్గం నాదే నీవు తెలిపే రహదారి నాదే

ఓ బాటసారి...
నీవు నడిచే మార్గం నాదే
నీవు తెలిపే రహదారి నాదే
నీవు ఎక్కడ నిలిచినా ఏ గమ్యం చేరినా నా ప్రయాణం సాగిపోవునే  || ఓ బాటసారి... ||

విశ్వమంతా నా రహదారి మార్గమే కనిపిస్తున్నది
నీవు ఉన్న చోట నా స్థానమే నీకు సూచిస్తున్నది

ఏ దారి లేని చోట నీవు నడచినా అదే నా రహదారిగా మారేను
ఏ మార్గాన్ని నీవు విడచినా ఆ దారిలోనే నడిచే వారు ఎందరో

ఎడారిలో కనిపించదు నా దారి ఆకాశం చూపదు నా మార్గము
నీటిలో తోచదు నా మార్గం నీకు ఏ దిక్కున ఎలా వెళ్ళిపోవాలో  || ఓ బాటసారి... ||

విజ్ఞానంతో సాగిపోతే దిక్సూచిలా నా మార్గం నీకు తెలిసేను
అనుభవంతో సాగిపోతే మరో మార్గం నా రహదారిలో కలిసేను

జన్మించిన స్థానము నుండి మార్గాన్ని సాగించే మరణ గమ్యాన్ని చేరేవు
ఎందరో సాగించిన ఈ మార్గాలే సృష్టిలో రహదారులుగా సాగి పోయేను

తెలియని మార్గాన్ని అన్వేషిస్తే సూచనలెన్నో తెలిసేను
సూచనలతో మార్గాన్ని సాగిస్తే అనుభవమే నీకు కలిగేను

ఇదే నా ప్రయాణం ఇదే నా మార్గం ఇదే నా దారి రహదారి
ఇదే నా లోకం ఇదే నా రహస్యం ఇంతే నీ ప్రయాణ జీవితం  || ఓ బాటసారి... ||

ఏది నీ జీవం ఏది నీ విశ్వం ఏది నీ భావం

ఏది నీ జీవం ఏది నీ విశ్వం ఏది నీ భావం
శ్వాసే అనుకున్నా ధ్యాసే అనుకున్నా ధ్యానమే నీ సొంతం
మౌనమే అనుకున్నా శూన్యమే అనుకున్నా నాదమే నీ స్వరం || ఏది నీ జీవం ||

జీవమై ఉన్నావు ఈ జగతికి లీనమై పోయావు ఈ లోకానికి
దేహమై ఉన్నావు ఈ దైవానికి శ్వాసతో వచ్చావు ఈ స్వర్గానికి

శిఖరమై దాగి ఉన్నావు హిమాలయాన
ఆకాశమై నిలిచావు అంతర్గపు గగనాన

నీవు లేని రూపం అణువు లేని ఆకారం
నీవు లేని ఆకారం పరమాణువు లేని రూపం   || ఏది నీ జీవం ||

జన్మతో కరుణించి మరణంతో మరిచెదవు
మరో జన్మతో లాలించి మరణంతో విడిచెదవు

కాలంతో సాగించే జీవితం కనిపించని నీ భావమే
మరణంతో సాగించే మౌనం వినిపించని సత్యమే  

నీలో వేద మంత్రమో నాలో జీవ తంత్రమో
విశ్వానికి మోహ బంధమై జీవితాన్నే సాగించేవు || ఏది నీ జీవం || 

Wednesday, June 1, 2016

అరె ఏమైందీ... ఒక జీవం మళ్ళీ ఉదయించింది...

అరె ఏమైందీ... ఒక జీవం మళ్ళీ ఉదయించింది...
అరె ఏమైందీ... ఒక జీవం మళ్ళీ అస్తమించింది...
అరె ఏమిటో ఈ జనన మరణం సాగర తీరం చేరింది...
అరె ఎందుకో ఈ జీవితం ఎప్పటికకీ సాగర తీరాన్నే చేరుతున్నదీ ... || అరె ఏమైందీ... ||

జన్మించి నప్పుడు తెలియని భావన గమనించలేను
మరణించినప్పుడు తెలియని భావన చెప్పుకోలేను
జనన మరణ భావాలన్నీ తెలియకుండా ఒకటిగానే నాలో నిలిచాయి

జన్మించే భావన నాలోనే మిగిలింది
మరణించే భావన నాలోనే నిలిచింది
తెలియని భావాలన్నీ మౌనమై మనసులోనే దాగున్నాయి || అరె ఏమైందీ... ||

ఉదయించే అరుణ కిరణం నీవైతే
అస్తమించే ఉషా కిరణం నీవేగా
ప్రతి రోజు ఏ భావనతో ఉదయిస్తావో ఏ భావనతో అస్తమిస్తావో

ఉదయించే కిరణం ఉత్తేజమై నాలో జీవితాన్ని సాగించింది
అస్తమించే మేఘ రూప వర్ణం నాలో జీవితాన్ని నిలిపింది          

ఎవరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎంత కాలం ఉంటారో
కాలానికే తెలియని జీవన నది అలల తీర సాగరం ఇది ... || అరె ఏమైందీ... ||