Showing posts with label ప్రయత్నం. Show all posts
Showing posts with label ప్రయత్నం. Show all posts

Tuesday, March 21, 2017

ఎక్కడ మన జీవనం ఎలాగ మన జీవితం

ఎక్కడ మన జీవనం ఎలాగ మన జీవితం
ఏనాటిదో మన జీవితం ఎందుకో మన జీవనం
ఎవరితో ఎవరు ఎక్కడ ఎవరు ఎలాగ ఎందుకో
ఏనాటికీ తెలియని గమనం మనతో సాగే సమయం
మనలో కలిగే ఆలోచన మరోసారి తలిచే తరుణం     || ఎక్కడ ||

కోరిన విధముగా లేని జీవనం ఎందుకో తెలియని విధముగా సాగే జీవితం
తలచిన విధముగా కలగని జీవనం ఏదీ తోచని విధముగా సాగే జీవితం

తలచిన కార్య ప్రయత్నమే విఫలమై విధిగా సాగే కాల పరిశోధనం
తోచని కార్య సంభవమే ఒక విధముగా సాగే సమయ సందర్భం          || ఎక్కడ ||

మనలో కోరిన ప్రయత్నం ఉన్నా లోపమే విఫలమై విధిగా సాగే కార్యం
మనలో తెలియని ప్రయత్నం సాగినా తలవని అసమ్మతి కార్య ఫలితం

కోరిన కోరికకై సాగని ఆలోచన ప్రయత్నం లేక తీరని కోరిక విఫలం
కోరిన కోరికకై చేసే ప్రయత్నం తోచని ఆలోచనల తెలియని మార్గం   || ఎక్కడ || 

Wednesday, March 15, 2017

ఏదో చూస్తూ ఉన్నా తోచదులే నా మదిలో

ఏదో చూస్తూ ఉన్నా ఏది తోచదులే నా మదిలో
ఏదో చేస్తూ ఉన్నా ఏది కలగదులే నా యదలో
ఏదో వింటూ ఉన్నా ఏది నిలవదులే నా దేహంలో

ఏదేదో చేయాలని ఎంతో నేర్చుకోవాలని అనుకున్నా నేనే నా మేధస్సులో ఎంతో గొప్పగా  || ఏదో చూస్తూ ||

ఎప్పటి దాకా చూస్తానో ఎంత వరకు చేస్తానో ఏదైనా వింటానో తెలియదులే తుది వరకు
చూసింది ఎప్పటిదో చేసింది ఏనాటిదో విన్నది ఏమైనదో తెలియదులే ఏ చివరి వరకు

జ్ఞాపకాల విజ్ఞానంతో మరవలేని జ్ఞానంతో ఏదో తెలియని కార్యాలతో సాగేను నా ప్రయత్నం
అనుభవాల నిర్ణయంతో ఏదో పరిష్కారంతో అధ్యాయాలుగా కార్యాలతో సాగేను నా విజయం  || ఏదో చూస్తూ ||

నా కార్యాలకు ఏ విఘ్నం కలిగినా అభ్యంతరం లేదని నాలో కలిగే భావాలే తెలిపేను పరమార్థం
నా సమస్యలకు ఆటంకం వచ్చినా అనర్థం జరిగినా నాలో నిలిచే ఆలోచనలే తెలిపేను పరమాత్మం

ఏ కాలం ఏ విజ్ఞానాన్ని తెలుపుతుందో మేధస్సుకే పరీక్షగా ఆలోచనలకే సమస్యగా తోచే గమనం
ఏ సమయం ఏ అనుభవాన్ని సూచిస్తుందో మేధస్సుకే దీక్షగా భావాలకే కఠినంగా తోచే తరుణం  || ఏదో చూస్తూ || 

Thursday, December 22, 2016

మరణం లేదనుకో అసాధ్యం లేదనుకో

మరణం లేదనుకో అసాధ్యం లేదనుకో
సాధనతో సాధించే ప్రయత్నం చేసుకో

తెలిసినదే జ్ఞాపకం చేసుకో తెలియనిదే గమనంతో తెలుసుకో
తెలియకపోతే తెలిసిన వారితో చర్చిస్తూ ఓపికతో ఎంతో నేర్చుకో  || మరణం ||

నీ మేధస్సులో ఎంతో విజ్ఞాన ప్రదేశం ఖాళీగా ఉందని తెలుసుకో
నీ మేధస్సులో ఎంతో ఆలోచనల ప్రవాహం సాగునని తెలుపుకో

నీ  మేధస్సులో ఉన్న అపారమైన విజ్ఞానాన్ని జ్ఞాపకంగా దాచుకో
నీ మేధస్సులో దాగిన విజ్ఞానాన్ని ఉత్తేజమైన మేధాశక్తిగా చేసుకో

నీ మేధస్సులో అన్వేషణ మొదలైతే విశ్వ భావ జీవ రహస్యాలెన్నో చేర్చుకో
నీ మేధస్సులో వేదాంతం ప్రారంభమైతే లోక జ్ఞాన వేదత్వాలెన్నో లెక్కించుకో  || మరణం ||

నీలో జీవించే ప్రాణ శక్తిని స్వధ్యానంతో దీర్ఘాయుస్సుగా మార్చుకో
నీలో ధ్వనించే జీవ శక్తిని స్వర నాదంతో దీర్ఘ కాలంగా సాగించుకో

నీవే మహా వేదమై మహాత్మగా ఎదుగుతూ పరలోకాన్ని అర్థం చేసుకో
నీవే మహా తత్వమై మహర్షిగా ఒదుగుతూ పరమార్థాన్ని గ్రహించుకో

నీవే అణువై ఓ పరమాణువుగా పరిశోధించి సూక్ష్మ జ్ఞానాన్ని పెనవేసుకో
నీవే పరమాణువై మహా అణువుగా పర్యవేక్షించి విజ్ఞానాన్ని పెకలించుకో  || మరణం || 

Tuesday, July 26, 2016

నీవే లేని జగం నీతో లేని యుగం

నీవే లేని జగం నీతో లేని యుగం
నీవే లేని సగం నీతో లేని బంధం
నీవే లేని రూపం నీతో లేని ఆకారం || నీవే లేని ||

ఒకరికి ఒకరై జీవిస్తేనే జగానికి ఒకటై నిలిచెదం
ఒకరికి ఒకరై తోడైతేనే యుగానికి ఒక్కటై పోతాం
ఒకరికి ఒకరై నడిచేస్తేనే కాలానికి ఒకరై ఉంటాం

నీవు నేను కలిసివుంటేనే మరో ప్రపంచం
నీవు నేనే కలుసుకుంటేనే మరో జీవితం
నీవు నేను కలవాలంటేనే మరో సమయం  || నీవే లేని ||


ఒకరికి ఒకరు చూసుకుంటే మనలోనే స్నేహం
ఒకరికి ఒకరు పంచుకుంటే మనలోనే సహాయం
ఒకరికి ఒకరు ఇచ్చుకుంటే మనలోనే బంధం

నీవు నేను నడిచేలా మరో ప్రయత్నం
నీవు నేను నడిపించేలా మరో జీవం
నీవు నేను నడిపించాలా మరో జగం  || నీవే లేని ||