Monday, March 6, 2017

లోకానికే మహోదయ తేజమై ఉదయిస్తున్నావా సూర్య దేవా

లోకానికే మహోదయ తేజమై ఉదయిస్తున్నావా సూర్య దేవా
మేధస్సుకే విజ్ఞాన ఉత్తేజమై ప్రజ్వలిస్తున్నావా సూర్య భావా  || లోకానికే ||

నీ తేజము లేని జగతి విజ్ఞానము లేని నిర్మాణమై అమానుషమయ్యేను
నీ కిరణము లేని లోకము ఉత్తేజము లేని మేధస్సై అంధకారమయ్యేను

నీ తేజోదయంతోనే జీవ ప్రకృతి పర్యావరణంతో శోభిల్లమయ్యేను
నీ వర్ణోదయంతోనే జీవరాసుల జీవన విధానము శోభనమయ్యేను   || లోకానికే ||    

నీ సూర్య తేజము లేక విశ్వ లోకమంతా అంధకార చీకటి ప్రయాసతో సతమతమయ్యేను
నీ సూర్య కిరణము లేక మేధస్సు సామర్థ్యమంతా అజ్ఞాన ప్రయాసతో నిరుపయోగమయ్యేను

నీవు లేని కార్యం ఉత్తేజం లేని ఆలోచనల పరిశోధనకే పరిమితం
నీవు లేని భావం వేదత్వం లేని స్వభావాల పర్యవేక్షణకే అంకితం   || లోకానికే ||   

Friday, March 3, 2017

విశ్వమే మహా ప్రకృతిగా జగమే సహజ వనరులుగా

విశ్వమే మహా ప్రకృతిగా జగమే సహజ వనరులుగా
లోకమే మహా గొప్పగా ప్రదేశమే అపురూప నిర్మాణంగా
భావ తత్వాలతో బ్రంహాండాన్ని సృష్టించావా ఈశ్వరా

విశ్వమే ప్రకృతిగా జగమే జాగృతిగా నీవే నిలిపావా ఈశ్వరా
జీవమే ఆకృతిగా కాలమే వికృతిగా సాగించావా పరమేశ్వరా  || విశ్వమే ||

ప్రకృతినే పరిశోధనతో విశ్వాన్ని పర్యావరణం చేశావా
ఆకృతినే పరిశీలనతో సజీవమైన ఆకారంగా మార్చావా

శ్వాసనే జీవంగా దేహాన్నే ఆకార రూపంగా మలిచావా
ధ్యాసనే జ్ఞానంగా పరధ్యానమే ప్రజ్ఞానంగా కల్పించావా  || విశ్వమే ||

తత్వాలతో మహాత్ములను భావాలతో మహర్షులను నెలకొల్పావా
వేదాలతో పండితులను ఉపనిషత్తులలో భోదకులను సృష్టించావా

జీవులు స్వేచ్ఛగా జీవించుటకు మహా రూపమైన సజీవ ప్రకృతిని సాగించెదవా
మానవులు విజ్ఞానంతో సాగుటకు మహా రూప నిర్మాణ వనరులను పొదిగించావా  || విశ్వమే || 

Thursday, February 9, 2017

మేలుకో మాధవ నీ రూపాన్ని విశ్వానికి ఉదయింపజేయవా

మేలుకో మాధవ నీ రూపాన్ని విశ్వానికి ఉదయింపజేయవా
మేలుకో మహాత్మ నీ రూపాన్ని జగతికి పరిచయింపజేయవా

నీ ముఖ రూపాన్ని నేను ఎన్నడూ చూడలేదు కాస్తైనా కనిపించలేదు
నీ ముఖ బింబాన్ని నాకు ఎప్పుడూ చూపలేదు జాడైనా తెలియలేదు  || మేలుకో ||

ఏమి భాగ్యమో నీ దర్శనం సుదర్శనం
ఏమి సౌఖ్యమో నీ ఆనందం మహానందం

ఎంతటి అఖిలమో నీ రూప వైభవం
ఎంతటి అమోఘమో నీ ఆకార వైభోగం

ఏమి చిత్రమో నీ సువర్ణ రూపం
ఏమి ఆత్రమో నీ సుందర ఆకారం
ఏమి గాత్రమో నీ సుమధుర గానం  || మేలుకో ||

ఎక్కడి భావమో నీ రూపమే సుగంధ పుష్పోదయం
ఎక్కడి తత్వమో నీ బింబమే సుమిత్ర భాష్పోదయం

ఎంతటి దైవమో నీ దేహమే దయతో కూడిన ప్రేమామృతం
ఎంతటి జీవమో నీ వేదమే కరుణతో కలిగిన స్నేహామృతం

పరలోక పరబ్రంహ మహా ద్వారమున నీ దివ్య ముఖ దర్శనం
పరలోక పరవిష్ణు మహా ప్రవేశమున నీ విశ్వ రూప నిదర్శనం
పరలోక పరశివ క్షేత్రమున నీ ముఖ బింబమే సర్వ సుదర్శనం  || మేలుకో || 

మేధస్సే బ్రంహాండమై అంతరిక్షముగా విజ్ఞానాన్ని అధిరోహించును

మేధస్సే బ్రంహాండమై అంతరిక్షముగా విజ్ఞానాన్ని అధిరోహించును
మేధస్సే అనంతమై అసంఖ్యాక విశ్వ వేద విజ్ఞానాన్ని పరిశోధించును

మేధస్సులో కణాలే మహా భావాలతో విశ్వ బ్రంహ విజ్ఞానాన్ని సేకరించును
మేధస్సులో భావాలే మహా తత్వాలతో విశ్వ వేద విజ్ఞానాన్ని అనుసరించును  || మేధస్సే ||

అన్వేషణ మహా పర్యవేక్షణగా సాగించుటలో విజ్ఞానమే మేధస్సుకు నిదర్శనం
పరిశోధన మహా పరిశీలనగా కొనసాగించుటలో ప్రజ్ఞానమే మేధస్సుకు నిర్వచనం

ప్రకృతినే మహా పరిశోధనగా విశ్వ రూప భావాలనే పరిశీలించుటలో మేధస్సుకు బోధనం
ప్రకృతినే పర్యావరణగా జగతి ఆకార తత్వాలనే పర్యవేక్షించుటలో మేధస్సుకు ఉపదేశం  || మేధస్సే ||

అంతరిక్ష ప్రయాణముకై వాహన నిర్మాణ సాంకేతిక విజ్ఞానమే మహా జ్ఞాన ప్రయోగము
గ్రహాంతర విహారముకై ఉపగ్రహ నిర్మాణ ఆధునిక విజ్ఞానమే మహా వేద ప్రయోజనము

ప్రతి క్షణమును అనేక భావాలతో తలచుటలో తెలుసుకొనెను మహా విజ్ఞాన గ్రంథము
ప్రతి క్షణమును అసంఖ్యాక తత్వాలతో తపించుటలో గ్రహించెను మహా జ్ఞాన దైవము  || మేధస్సే || 

ఏనాటిదో మరణం ఎప్పటి వరకో శరణం

ఏనాటిదో మరణం ఎప్పటి వరకో శరణం
ఏనాటిదో జననం ఎప్పటి వరకో జీవితం

జన్మించిన నాటి క్షణము నుండి తల్లి రక్షణమే కవచం
మరణించిన నాటి క్షణము నుండి పర లోకమే శరణం   || ఏనాటిదో ||

మరణంతో దేహం పంచ భూతాలుగా కలసినా శూన్యమే ధర్మం
జననంతో శరీరం పంచ భూతాలుగా వెలసినా విజ్ఞానమే సత్యం

మరణంతో మేధస్సులో నిండిన విశ్వ విజ్ఞాన భావ స్వభావ తత్వాలు పర బ్రంహ లోకానికే అంకితం
మరణంతో దేహంలో దాగిన ఆత్మ పరంజ్యోతి పరమాత్మగా పర విష్ణు వైకుంఠ లోకానికే సర్వాంకితం
మరణంతో శరీరంలో ఆగిన ఉచ్చ్వాస జీవ పరంధామగా పర ఈశ్వర కైలాస లోకానికే జగతాంకితం    || ఏనాటిదో ||

మరణాన్ని జయించడం వేద విజ్ఞాన సత్య ధర్మాలను అధిగమించడం
జననాన్ని కోరుకోవడం విశ్వ విజ్ఞాన భావ స్వభావ తత్వాలను ధరించడం

జననంతో ప్రతి క్షణం ఉచ్చ్వాస నిచ్చ్వాసాల పోరాటమే దేహానికి సౌఖ్యం
జననంతో ప్రతి క్షణం హృదయ చలన తత్వాల సమరమే దేహానికి సౌలభ్యం
జననంతో ప్రతి క్షణం మేధస్సు ఆలోచన భావాల ఉపోద్ఘాతమే దేహానికి సౌభాగ్యం  || ఏనాటిదో || 

Wednesday, February 8, 2017

ఎవరైతేనేమి మనలోనే మహానుభావులు ఉదయించెదరు

ఎవరైతేనేమి మనలోనే మహానుభావులు ఉదయించెదరు
ఎలాగైతేనేమి మనలోనే దివ్యమైన మేధావులు జీవించెదరు
ఎలాగైతేనేమి మనలోనే వేదాంత మహాత్ములు జన్మించెదరు  || ఎవరైతేనేమి ||

ఎవరో ఎవరో మహానుభావులు ప్రజలతో ప్రయాణించెదరు
ఎవరో ఎవరో మహాత్ములు పరధ్యాసతో పరిశోధించెదరు
ఎవరో ఎవరో మహర్షులు పరధ్యానంతో పలికించెదరు
ఎవరో ఎవరో మాధవులు పరమాత్మునితో ప్రకాశించెదరు
ఎవరో ఎవరో మేధావులు ప్రజ్ఞానంతో ప్రజ్వలించెదరు
ఎవరో ఎవరో మానవులు ప్రశాంతతో ప్రేమించెదరు         || ఎవరైతేనేమి ||

ఎవరో ఎవరో ఇహ పర లోకాలను జయించెదరు
ఎవరో ఎవరో భూలోకాలను పర్యవేక్షించెదరు
ఎవరో ఎవరో భావ తత్వాలను అభ్యసించెదరు
ఎవరో ఎవరో వేద ఉపనిషత్తులను భోధించెదరు
ఎవరో ఎవరో సత్య ధర్మాలను పాటించెదరు
ఎవరో ఎవరో దైవ అద్వైత్వములను సాగించెదరు    || ఎవరైతేనేమి || 

Tuesday, February 7, 2017

విధిగా జీవించు విధినే అధిరోహించు

విధిగా జీవించు విధినే అధిరోహించు
విధిగా ప్రేమించు విధినే జయించు

నీ విజ్ఞానంతో విధినే తప్పించు
నీ అనుభవంతో విధినే వదిలించు  || విధిగా ||

ఏనాటి విధితత్వ జీవితమో మన కార్యాల శ్రమ సాధన సమస్యలతో సాగే జీవన విధానం
ఏనాటి బహు బంధమో మన భావాలు స్నేహితుల అనురాగాల ప్రేమతో సాగే అనుబంధం

ఎప్పటికీ తెలియని వేదాంత సారాంశం మన జీవితంలో సుఖ దుఃఖాలను కలిగిస్తుంది
ఎప్పటికీ తోచని భావోదయ వేదాంతం మన జీవనంలో బహు బంధాలను చేరుస్తుంది   || విధిగా ||

ఏమిటో కాల ప్రభావం ఎప్పటికో కార్య విరమణం
ఏమిటో జీవ ప్రభావితం ఎప్పటికో వేద విజ్ఞానం

ఏదో అనుభవం ఎక్కడికో గమ్యం సాధనలో ఎరుకే మహా గొప్ప మార్గం
ఏదో కొత్త విజ్ఞానం ఎక్కడికో ప్రయాణం శ్రమలో సాధన మహా ఆయుధం

అనుభవ విజ్ఞానమే శాంతి మార్గాన్ని సాగించే కాల ప్రయాణం
వేద ప్రభావమే విధిని తొలగించే ప్రేమ ప్రశాంత జీవన గమ్యం   || విధిగా ||